Tuesday, May 21, 2024
Tuesday, May 21, 2024

జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా వాహనాల తనిఖీలు

విశాలాంధ్ర- అనంతపురం వైద్యం : జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాల మేరకు డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు & సిబ్బంది…కేంద్ర సాయుధ బలగాలు, స్పెషల్ పార్టీ పోలీసులతో కలిసి విస్తృతంగా వాహనాల తనిఖీ చేపట్టారు. అక్రమాలకు తావులేకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికల నిర్వహించాలని జిల్లా పోలీసులు సంకల్పించారు. ఓటర్లను ప్రభావితం చేయకుండా డబ్బులు, ఇతర గిఫ్ట్ ఆర్టికల్స్, లిక్కర్ అక్రమ రవాణా జరగకుండా తనిఖీలలో చర్యలు తీసుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున 50 వేల కంటే ఎక్కువ డబ్బులు వెంట తీసుకుని వెళ్లకూడదని సూచిస్తున్నారు. ఎవరైనా అత్యవసరంగా డబ్బులు తీసుకొని వెళితే సంబంధిత ఆధారాలు తప్పకుండా వెంబడి ఉంచుకోవాలని తెలియజేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img