Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Saturday, September 21, 2024
Saturday, September 21, 2024

పౌష్టికాహార భద్రతకు పెద్దపీట

ప్రజా పంపిణీ వ్యవస్థలో అందిస్తున్న రాగిపిండిని సద్వినియోగం చేసుకోవాలి :
జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : పౌష్టికాహార భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి పేర్కొన్నారు. శుక్రవారం అనంతపురం నగరంలోని సూర్య నగర్ లో ప్రజా పంపిణీ వ్యవస్థలో రాగిపిండి పంపిణీని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థలో పౌష్టికాహారం అందించాలన్న లక్ష్యంతో పౌష్టికమైన బియ్యంతో పాటు రాగులు, జొన్నలు, ఫోర్టిపైడ్ గోధుమపిండి సరఫరా చేయబడుతోందన్నారు. రాగులకు వినియోగదారుల్లో మంచి డిమాండ్ ఉందని, ప్రభుత్వము రాగి పిండి ప్యాకెట్ల రూపంలో 11 రూపాయలకే అందుబాటులోకి తెస్తోందని, రాగులను ప్రాస్సింగ్ చేసి పిండి ఆడించి ప్యాకింగ్, రవాణా చేసేందుకు అయ్యే ఖర్చులను మాత్రమే రేటుగా నిర్ధారించారన్నారు. మార్చి 1వ తేదీ నుంచి ప్రభుత్వం రెగ్యులర్ పిడిఎస్ కింద ఉన్న బియ్యం కార్డుదారులందరికి ఒక కేజీ బియ్యానికి బదులుగా రాగి పిండిని కిలో 11 రూపాయలకే పంపిణీ చేయడం జరుగుతోందన్నారు. బహిరంగ మార్కెట్లో కిలో రాగిపిండి 40 రూపాయలు పైనే పలుకుతుండగా, ప్రభుత్వం లబ్ధిదారులకు కిలో 11 రూపాయలకే పంపిణీ చేయనుందన్నారు. రాగి పిండి వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయన్నారు. జిల్లాకు 6,67,268 కేజీల రాగి పిండిని కేటాయించడం జరిగిందని, అనంతపురం అర్బన్ మండలానికి 58,356 కేజీలు మరియు అనంతపురం రూరల్ మండలానికి 41,842 కేజీల రాగి పిండిని కేటాయించడం జరిగిందన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో అందిస్తున్న రాగిపిండిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఎస్ఓ శోభారాణి, సిఎస్డిటి దుర్గాప్రసాద్, కార్డుదారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img