Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

జగనన్న పాలవెల్లువ కింద పాలసేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

మహిళా పాడి రైతులకు విస్తృతస్థాయిలో రుణాలు అందించాలి : జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : జగనన్న పాలవెల్లువ కింద పాలసేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి ఆదేశించారు. గురువారం ఆత్మకూరు మండలంలోని వడ్డిపల్లి, పంపనూరు తాండా గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఏఎంసియులలో జగనన్న పాలవెల్లువ కింద చేపడుతున్న పాలసేకరణను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్న పాలవెల్లువ కింద పాలసేకరణ ద్వారా కలిగే ప్రయోజనాలను క్షేత్రస్థాయిలో మహిళా పాడి రైతులకు వివరించాలన్నారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఏఎంసియులలో అమూల్ సంస్థకు పాలుపోయడం ద్వారా కలిగే ప్రయోజనాల గురించి క్షేత్రస్థాయిలో అందరు పాల ఉత్పత్తిదారులకు వివరించాలని, ఇందులో ప్రమోటర్స్ కీలక పాత్ర పోషించాలన్నారు. ప్రైవేట్ డెయిరీలకు పాలు పోయడం ద్వారా లీటర్ కి ఎంత ఆదాయం వచ్చింది, అమూల్ కు పాలుపోయడం ఎంత ఆదాయం, లాభం వచ్చింది అనే తేడాను పూర్తిగా అర్థమయ్యేలా వివరించాలన్నారు. మార్చి ఒకటవ తేదీన చాలా కీలకమైన రోజని, అన్ని ఏఎంసియులకు కేటాయించిన లక్ష్యానికి అనుగుణంగా పాల సేకరణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాలసేకరణ బాగా చేయడం జరుగుతోందని, పూర్తి స్థాయిలో పాల సేకరణ జరిగేలా చూడాలన్నారు. పాల ఉత్పత్తిదారులతో మాట్లాడి ఎలాంటి బలవంతం లేకుండా ఏ విధంగా లాభం వస్తుంది అనేది తెలిపి పాలుపోసేలా చూడాలన్నారు. ప్రైవేట్ సంస్థ కన్నా అమూల్ కు పాలుపోయడం ద్వారా అధికంగా ఎంత ఆదాయం వస్తుంది అనేది తెలపాలని, ఈ తేడా గమనించాలని అందరికీ తెలియజేయాలి అన్నారు. జగనన్న పాలవెల్లువ కింద మహిళా పాడి రైతులకు విస్తృతస్థాయిలో రుణాలు అందించాలన్నారు. పశువులు కొనుగోలు చేసేందుకు రుణాలను అందించాలని, ఈ విషయమై సమావేశం నిర్వహించి రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మరిన్ని పాడిపశువులు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందించాలన్నారు. ఇప్పటికే ఏఎంసియులకు పాలుపోస్తున్న మహిళా పాడి రైతులు వారి తోటి మహిళా రైతులకు పాలు పోయమని చెప్పాలన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఎంతమంది పాడి రైతులు ఉన్నారు, ఎన్ని లీటర్ల పాలు ఏఎంసియులకు పోస్తున్నారు, లీటర్ కు ఎంత ఆదాయం, లాభం వస్తోంది, తదితర వివరాలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల అడాప్షన్ అధికారి మరియు డీఆర్డీఏ పిడి నరసింహా రెడ్డి, రూట్ ఇంచార్జి రమాదేవి, ఎంపీపీ హేమలత, వడ్డీపల్లి సర్పంచ్ లక్ష్మీనారాయణ రెడ్డి, పంపనూరు తాండా సర్పంచి ఎర్రి స్వామి, వెటర్నరీ అధికారులు దిలీప్, తులసీరామ్, ఏపీఎం మదన్ మోహన్, ప్రమోటర్స్ ధనలక్ష్మీ, నాగరత్నమ్మ, ప్రభాకర్, సచివాలయ ఉద్యోగులు, మహిళా పాడి రైతులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img