Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

బీజేపీ, వైసీపీ పాలన నుంచి ప్రజల విముక్తి కోసమే సీపీఐ బస్సు యాత్ర

పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హరినాథ రెడ్డి
విశాలాంధ్ర – చిత్తూరు : ప్రజాకంఠక బీజేపీ, వైసీపీ ప్రభుత్వాలను సాగనంపి దేశాన్ని, రాష్ట్రాన్ని రక్షించండి అనే నినాదంతో సీపీఐ రాష్ట్ర సమితి అధ్వర్యంలో జరిగే బస్సు యాత్రను జయప్రదం చేసేందుకు పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.హరినాథ రెడ్డి కోరారు. బుధవారం చిత్తూరులోని ఎస్టీయూ కార్యాలయంలో విజయ గౌరి అధ్యక్షతన జరిగిన సీపీఐ జిల్లా సమితి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోదీ, జగన్‌మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీలు ఏ మాత్రం అమలు చేయకపోగా ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వ మతోన్మాద రాజకీయాలు, ధరలు పెరుగుదల, దళితులు, మహిళలపై దాడులు, రైతాంగ, కార్మిక వ్యతిరేక విధానాల వలన అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈసారి మోదీని సాగనంపేందుకు దేశంలోని సెక్యులర్‌ పార్టీలు ముందుకు రావడం శుభపరిణామం అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం పూర్తిగా హరించ వేయబడిరదని, ప్రతిపక్షాలపై దాడులు పెరిగిపోతున్నాయని తెలిపారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీశ్‌ మాట్లాడుతూ బీజేపీ పాలనలో ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు జీఎస్‌టీ పరిధిలోకి తీసుకువస్తే అన్ని వస్తువుల ధరలు తగ్గుతాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడంలో పూర్తి వైఫల్యం చెందిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా అమ్మేస్తున్నారని, అంబానీ, అదానీకి వాటిని కట్టబెడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం ప్రజావ్యతిరేక చర్యలను ప్రోత్సహిస్తూ, కేంద్రానికి దాసోహం అయిందన్నారు. ప్రత్యేక హోదా, అమరావతి రాజధాని, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయింపు తదితర విషయాల్లో వైఫల్యం చెందారని విమర్శించారు. ఈ నేపథ్యంలో సీపీఐ ఆగస్టు 16 నుంచి సెప్టెంబరు 6 వరకు చేపట్టే బస్సు యాత్రను జయప్రదం చేసేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌.నాగరాజు, సహాయ కార్యదర్శి జనార్దన్‌, జిల్లా కార్యవర్గ సభ్యులు టి.కోదండయ్య ఎం.సుబ్రహ్మణ్యం, గోపీనాథ్‌, సత్యమూర్తి, మణి, డి.చంద్ర, రమాదేవి, లక్ష్మి కుమారి, బాలాజీ రావు, రఘు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img