Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

సీపీఐ అభ్యర్థి అత్తిలి విమలకు ప్రజల నుంచి విశేష ఆదరణ

 ప్రదర్శనలు, బైక్‌ ర్యాలీల హోరు

విశాఖపట్నం పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గ సీపీఐ అభ్యర్థి అత్తిలి విమల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆమె ప్రచారానికి అన్ని వర్గాల ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ధన రాజకీయాలను ఓడిద్దాం, శ్రామిక జన రాజకీయాల్ని గెలిపిద్దాం… నినాదంతో విమల చేస్తున్న ప్రచారం ప్రజల ఆదరాభిమానాలను చూరగొంటోంది. ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ, కార్మికుల హక్కులు కాపాడడం, ప్రజా సమస్యల పరిష్కారంలో ముందు ఉండడం, బీజేపీ మతతత్వ రాజకీయాలు.. తదితర అంశాలు ప్రధానంగా సీపీిఐ అభ్యర్థి ప్రచారం సాగుతోంది. గత నెల 20వ తేదీన భారీ ప్రదర్శనతో నామినేషన్‌ దాఖలు చేయడం మొదలుకొని నియోజకవర్గంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. పార్టీ, ప్రజాసంఘాలు, ఇండియా కూటమి పార్టీల సభ్యులు బృందాలుగా ఏర్పడి నియోజకవర్గంలో వాడవాడల విమలను గెలిపించాలని కోరుతూ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. సిపిఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ, కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి, రాష్ట్ర సమితి సభ్యులు సీహెచ్‌ రాఘవేంద్రరావు, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఓబులేసు తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రచారం నిర్వహించారు. ఏపీ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో బాజీ జంక్షన్‌ నుంచి గోపాలపట్నం పెట్రోల్‌ బంక్‌ వరకు నిర్వహించిన భారీ మహిళా ప్రదర్శనలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి దుర్గాభవాని పాల్గొన్నారు. పారిశ్రామిక ప్రాంతలో రెండుసార్లు, కంచరపాలెం, గోపాలపట్నం ప్రాంతాల్లో ఒక సారి భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గంలో ప్రతీ ఇంటికి కరపత్రాలు పంచుతూ కేంద్రంలోని బీజేపీి ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించడంతో పాటు ఆ పార్టీకి వంత పాడుతున్న రాష్ట్రంలోని అధికార వైసీపీి, ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన పార్టీల వైఖరిని ఎండగట్టారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ని ప్రైవేటీకరించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను విమర్శిస్తూ దానిపై గట్టిగా నిలదీయని వైసీపీ, తెలుగుదేశం, జనసేన పార్టీల విధానాలను ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీి ప్రభుత్వ మతతత్వ విధానాలను ప్రశ్నించడంతోపాటు గత పదేళ్లలో ధరల పెరుగుదల సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను వివరించటం, ఎన్నికల్లో బీజేపీి ఇచ్చిన హామీలు… ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు, నల్లధనాన్ని వెనక్కి తేవడం, ధరల నియంత్రణ తదితర అంశాలను ప్రచారంలో ప్రస్తావించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను నాలుగు కోడ్‌లుగా మార్చిన అంశాన్ని ప్రచారంలో ప్రస్తావించారు. బీజేపీి మరోసారి అధికారంలోకి వస్తే దేశ లౌకికత్వానికి, సౌభ్రాతృత్వానికి, రాజ్యాంగానికి ఏర్పడబోయే ముప్పు గురించి హెచ్చరించారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో సీపీఐ ప్రచారం కోసం పార్టీ శ్రేణులు విరాళాలు అందజేశారు. నియోజకవర్గంలో సీపీఐ అభ్యర్థి అత్తిలి విమల ప్రచారాన్ని పలువురు స్వాగతించారు. అనేక ప్రాంతాల్లో మహిళలు హారతులు పట్టారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు, కార్యవర్గ సభ్యులు కె. సత్యాంజనేయ, జి రాంబాబు, కసిరెడ్డి సత్యనారాయణ, ఎస్‌ కె రెహమాన్‌, జి ఎస్‌ జె అచ్యుతరావు, ఎం మన్మధరావు, పి. చంద్రశేఖర్‌, సి ఎన్‌ క్షేత్రపాల్‌ తదితరులు మూడు దళాలుగా గోపాలపట్నం, పారిశ్రామిక ప్రాంతం, కంచరపాలెం ఏరియాలుగా మొత్తం నియోజకవర్గంలో ప్రచారం విస్తృతంగా నిర్వహిస్తున్నారు. నియోజకవర్గ సమస్యలపై కరపత్రాన్ని ముద్రించి పరిష్కారానికి కృషి చేస్తామని సీపీఐ పేర్కొంది. ఆ పత్రాన్ని ఓటర్లకు పంపిణీ చేశారు. ప్రజా వాణి అసెంబ్లీలో వినిపించేందుకు విమలను గెలిపిస్తామని ఓటర్లు హామీ ఇస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img