Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

చేనేతల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత

మాజీ ఎంపీ బుట్టా రేణుక

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేనేతల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని కర్నూలు మాజీ ఎంపీ బుట్ట రేణుక అన్నారు. ఉరవకొండలో సోమవారం తొగటవీర క్షత్రియ కళ్యాణమండపం లో జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేనేత నేస్తం పథకం కింద ఒక్కో లబ్ధిదారునకు 24 వేల రూపాయలు సంవత్సరానికి అందించడం జరిగిందన్నారు. చేనేతల యొక్క ఉత్పత్తులను అమ్మకోడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ సౌకర్యం కూడా ఏర్పాటు చేసిందన్నారు.ఆప్కో అభివృద్ధికి 468 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగిందని గడిచిన నాలుగు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేనేతలకు 2,835 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చేనేత తో పాటు కులవృత్తులు ప్రోత్సహించడానికి వారిని ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు.బీసీ కులాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని అనేక కులాలకు సంబంధించి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్లు, డైరెక్టర్లు పదవులు కూడా ఇవ్వడం జరిగింది అన్నారు. గత టిడిపి ప్రభుత్వంలో చేనేతల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఉరవకొండ నియోజకవర్గంలో చేనేతల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు. అర్హులైన వారందరికీ చేనేత నేస్తం అందించడం జరిగిందని అంతే కాకుండా 1.50కోట్ల రూపాయలతో క్లస్టర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. దీనివల్ల 350 మంది నేత కార్మికులు లబ్ధి పొందుతారు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత తో పాటు విద్య, వైద్యం, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని ఆయన తెలిపారు. రానున్న ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని చేనేత వర్గాలు ఆదరించాలని సందర్భంగా పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో చేనేత సంఘం నాయకులు ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలు చేనేత వర్గాల వారు పాల్గొన్నారు. అంతకుముందు సీనియర్ చేనేత కార్మికులను ఘనంగా సన్మానించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img