Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

బాధ్యతలను స్వీకరించిన పురందేశ్వరి.. ఏపీకి పెట్టుబడులు రాని పరిస్థితి నెలకొందని విమర్శ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి బాధ్యతలను స్వీకరించారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె తన ఛాంబర్ లో వేదమంత్రోచ్ఛారణల మధ్య ఆశీనులయ్యారు. రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆమెకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛాన్ని అందించి, మిఠాయి తినిపించి అభినందనలు తెలియజేశారు. పురందేశ్వరి అధ్యక్ష బాధ్యతల కార్యక్రమానికి పలువురు కీలక నేతలు హాజరయ్యారు. బీజేపీ కార్యాలయం అభిమానులతో కిక్కిరిసి పోయింది. మరోవైపు బాధ్యతలను స్వీకరించిన అనంతరం పురందేశ్వరి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రహదారుల పరిస్థితి దారుణంగా ఉందని ఆమె అన్నారు. కేంద్ర ప్రభుత్వ చలవతోనే రాష్ట్రంలో రహదారులు నిర్మితమవుతున్నాయని… రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రహదారిని కూడా వేయలేదని దుయ్యబట్టారు. రోడ్ల దుస్థితిపై ప్రజలను అడిగితే చెపుతారని అన్నారు. ఒక్క ఏపీకే కేంద్ర ప్రభుత్వం 22 లక్షల ఇళ్లను ఇచ్చిందని పురందేశ్వరి తెలిపారు. రాష్ట్రంలో 35 శాతం ఇళ్ల నిర్మాణం కూడా పూర్తి కాలేదని, దీనిపై పేదలకు ఏం సమాధానం చెపుతారని ప్రశ్నించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఏ సంస్థ కూడా ముందుకు రాని పరిస్థితి నెలకొందని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న కంపెనీలు కూడా ఇతర రాష్ట్రాలను తరలిపోతున్నాయని అన్నారు.విభజన చట్టంలో పేర్కొన్న కేంద్ర విద్యా సంస్థలను రెండేళ్లలోనే దాదాపు అన్నింటినీ కేంద్ర ప్రభుత్వం నిర్మించిందని పురందేశ్వరి చెప్పారు. రాష్ట్రంలో పలు ఎయిర్ పోర్టులను కూడా కేంద్రం నిర్మించిందని అన్నారు. ఏపీలో పలు చోట్ల ఇండస్ట్రియల్ కారిడార్లను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తేనే ఇది సాధ్యపడుతుందని… కానీ, రాష్ట్రం నుంచి ఎలాంటి స్పందన లేదని విమర్శించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img