Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

గంగలో కలిసిన సంప్రదాయం

విశ్వనాథ్‌ ప్రతాప్‌ సింగ్‌ 1989లో ప్రధానమంత్రి అయినప్పుడు ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. 1989 నవంబర్‌ ఎన్నికలకు ముందే నేషనల్‌ ఫ్రంట్‌ ఏర్పడిరది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అతి పెద్ద పార్టీగా అవతరించింది తప్ప ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తగినంత మెజారిటీ సాధించలేకపోయింది. ఎన్నికలకు ముందే బోఫోర్స్‌ కుంభకోణం, రాజీవ్‌ గాంధీ ప్రభుత్వంలో అవినీతి లాంటి అంశాలను లేవదీయడంద్వారా విశ్వనాథ్‌ ప్రతాప్‌ సింగ్‌ జనంలో మంచి పలుకుబడి సంపాదించారు. తీరా ప్రభుత్వం ఏర్పాటుచేసే దశ వచ్చేసరికి దేవీలాల్‌, చంద్రశేఖర్‌, విశ్వనాథ్‌ ప్రతాప్‌ సింగ్‌ మధ్య ప్రధాని పదవి కోసం పోటీ ఏర్పడిరది. చివరకు పార్లమెంటరీ పార్టీ సమావేశంలో దేవీలాల్‌ను పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నుకున్నారు. కానీ ఆయన వెంటనే లేచి నేను కాదు విశ్వనాథ్‌ ప్రతాప్‌ సింగ్‌ పార్లమెంటరీ పార్టీ నాయకుడు అని ప్రకటించేశారు. ఆ రకంగా విశ్వనాథ్‌ ప్రతాప్‌ సింగ్‌ ప్రధాన మంత్రి అయిపోయారు. ఇలా విశ్వనాథ్‌ ప్రతాప్‌ సింగ్‌ను పార్లమెంటరీ పార్టీ నాయకుడిని చేయడం మీద ఆ రోజుల్లో తీవ్రమైన విమర్శలే వచ్చాయి. అయితే రాజీవ్‌ గాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకంచేసి, అవినీతికి వ్యతిరేకంగా పోరాడడంలో విశ్వనాథ్‌ ప్రతాప్‌ సింగ్‌దే ప్రధాన పాత్ర. అందుకని ఆయన ప్రధానమంత్రి కావడమే నైతికంగా సరైంది. ఒక రాజకీయ పార్టీ ఎన్నికలలో సంపూర్ణమైన మెజారిటీ మాత్రమే కాదు అద్వితీయమైన మెజారిటీ సాధించినప్పుడు కూడా ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీ పార్లమెంటు సభ్యులందరూ సమావేశం అవుతారు. పార్లమెంటరీ పార్టీకి ఒక నాయకుడిని ఎన్నుకుంటారు. ఆ తరవాత ఫలానా వారిని పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నుకున్నామని, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వాలని రాష్ట్రపతిని అభ్యర్థిస్తారు. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నికైన వ్యక్తికి సభ మద్దతు ఉంటుందన్న నమ్మకం కలిగితే రాష్ట్రపతి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆ వ్యక్తిని ఆహ్వానిస్తారు. ఇది స్వాతంత్య్రం వచ్చిన దగ్గర నుంచి కొనసాగుతున్న సంప్రదాయం. ఆనవాయితీ. 1962లో నెహ్రూ హయాంలో కాంగ్రెస్‌కు 361 స్థానాలు వచ్చినప్పుడూ, 1984లో రాజీవ్‌ నాయకత్వంలో కాంగ్రెస్‌కు 404 సీట్లు వచ్చినప్పుడు కూడా పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగడం, నాయకుడిని ఎన్నుకోవడం, ఆ విషయాన్ని రాష్ట్రపతికి లిఖిత పూర్వకంగా తెలియజేయడం, రాష్ట్రపతి సదరు నాయకుడిని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆహ్వానించే ఆనవాయితీ కొనసాగుతూనే ఉంది. ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా, లేదా ఏ ఐక్య సంఘటన అధికారంలోకి వచ్చినా లేదా మైనారిటీ ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిన అగత్యం వచ్చినా ఇదే ఆనవాయితీ కొనసాగింది. అలా కొనసాగడం సంప్రదాయమో, ఆనవాయితీనో మాత్రమే కాదు. అది నిఖార్సైన ప్రజాస్వామ్య విధానం. మనం అనుసరిస్తున్నది పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానం. అందువల్ల ఈ పద్ధతి అనుసరించడం ప్రజాస్వామ్యానికి అనుకూలమైంది. సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు కూడా ప్రధానమైన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తాము మద్దతు ఇస్తున్నామని సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షాలయ్యే పార్టీలన్నీ లిఖిత పూర్వకంగా రాష్ట్రపతికి తెలియజేస్తాయి. ఈ భరోసా ఆధారంగానే రాష్ట్రపతి ఎక్కువ మంది సభ్యుల మద్దతు ఉందనుకున్న నాయకుడిని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆహ్వానిస్తారు.
సంప్రదాయాలు, ఆనవాయితీలు, నియమ నిబంధనలు పాటించే వారికే వర్తిస్తాయి. వాటి బాదరబందీ పెట్టుకోని నాయకులు ఈ మర్యాదలు పాటించరు అని నరేంద్ర మోదీ మరోసారి రుజువు చేశారు. మొదటిసారి ప్రధానమంత్రి అయిన తరవాత పార్లమెంటు భవనంలోకి ప్రవేశించే సమయంలో మోదీ పార్లమెంటు భవనం మెట్లకు నమస్కారం చేశారు. మొన్న రాజ్యాంగాన్ని కళ్లకద్దుకున్నారు. మోదీకి, ఆయన పార్టీకి, ఆ పార్టీ మాతృసంస్థకు రాజ్యాంగంమీద ఏ నాడూ నమ్మకం లేదన్నది వేరే విషయం. కానీ ఉన్న పద్ధతుల ఆధారంగా అధికారం చేపడ్తున్నప్పుడు అంతవరకు ఉన్న సంప్రదాయాలను, ఆనవాయితీలను పాటించి తీరవలసిందే. వారం రోజుల కింద మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణం స్వీకారం చేశారు. అంతకు ముందు రాష్ట్రపతి ముర్ము మోదీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆహ్వానిస్తూ అందజేసిన లేఖను మోదీ ‘‘సగర్వంగా’’ ప్రదర్శిస్తున్న ఫొటోలు విరివిగా ప్రచారంలోకి వచ్చాయి. నిజానికి మోదీనే వాటిని ప్రచారంలో పెట్టారు. తాము ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కొంతమంది సీనియర్‌ నాయకులను వెంటబెట్టుకుని మోదీ రాష్ట్రపతికి విన్నవించిన మాట వాస్తవమే. ఆయన ఏ సంప్రదాయం లేదా ఏ అధికారం ఆధారంగా రాష్ట్రపతికి ఈ విషయం చెప్పారో తెలియదు. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా కనీసం ఆయన సొంతపార్టీ ఆయనను ఎన్నుకోలేదు. ఆ పార్టీకి మద్దతిస్తున్న పార్టీలన్నీ కలిసి పార్లమెంటు సభ్యులందరినీ సమావేశ పరిచి ఎన్నుకున్న దాఖలాలూ లేవు. ఈ ఎన్నికల్లో మోదీ నాయకత్వంలోని బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావలసినంత మంది బీజేపీ ఎంపీలు ఎన్నికకాలేదు. తెలుగు దేశం, జె.డి.(యు) తాము బీజేపీకి మద్దతు ఇస్తామని రాష్ట్రపతికి లేఖ పంపించిన మాటా వాస్తవమే. కానీ మోదీని పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నుకున్న సమావేశం, ప్రక్రియ మాత్రం మాయమై పోయాయి. సర్వ వ్యవస్థలను ఛిద్రం చేసిన మోదీ హయాంలో ఈ సుకుమారమైన సంప్రదాయాన్ని పాటించకపోవడంలో ఆశ్చర్య పడనవసరంలేదు. ఇటీవలి ఎన్నికల్లో బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశం వస్తే మోదీనే ప్రధానమంత్రి అన్న అభిప్రాయం సర్వత్రా ఉండొచ్చు. కానీ ఈ మధ్య కాలంలో ఆ పదవిని ఆశించిన మరి కొందరు కూడా ఉన్నారు, అందుకే ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబడదు అన్న వదంతులు నిజమనుకునేంత బలంగా వినిపిస్తున్నాయి. అలాంటప్పుడు పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగడం, నాయకుడిని ఎన్నుకోవడం, ఆ విషయం రాష్ట్రపతికి సాధికారికంగా తెలియజేడం లాంటివి జరిగితే బాగుండేది. కానీ అవేవీ లేకుండానే మోదీ ప్రధానిగా ప్రమాణం స్వీకరించేశారు. దీనివల్ల ఆయన పదవి పదిలంగా ఉందా లేదా అనేది ఇక్కడ ప్రధానం కాదు. సంప్రాదాయాన్ని, కట్టుబాట్లను, ఆనవాయితీలను పాటించారా లేదా అన్నదే ముఖ్యం. చట్టాలకన్నా ఆనవాయితీలకు బలం ఎక్కువ. ఆనవాయితీ పాటించకుండా మోదీ ప్రధానమత్రి కుర్చీలో ఆసీనులైపోయారు. మోదీ ఏలుబడిలో ఏదైనా సాధ్యమే. పార్లమెంటు మెట్లకు మొక్కడం, రాజ్యాంగాన్ని కళ్లకు అద్దుకోవడం లాంటివి వెర్రి జనాన్ని నమ్మించడానికే. ఈ విధి విధానాలను, పద్ధతులను మోదీ పనిగట్టుకుని ఉల్లంఘించారా లేదా ఎక్కడైనా పొరపాటు జరిగిందా అన్న చర్చకు తావే లేదు. ఎందుకంటే ఇలాంటి సందర్భంలో ఏర్పాట్లుచేసే బాధ్యత ఉన్న అధికారవర్గం సొంత నిర్ణయాలు తీసుకుని విధి విధానాలను ఉల్లంఘించే సాహసం చేయలేదు. చేయదు. ఇది పూర్తిగా మోదీ ధిక్కార ధోరణే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img