Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

తీస్తా సెతల్వాడ్‌కు ఊరట

గుజరాత్‌ మారణకాండకు సంబంధించిన కేసులో ప్రసిద్ధ న్యాయవాది, మానవహక్కుల కార్యకర్త తీస్తా సెతల్వాడ్‌కు సుప్రీం కోర్టు బుధవారం ఊరట కలిగించింది. అంతకుముందు ఇదే నెలలో తక్షణం లొంగిపొమ్మని గుజరాత్‌ హైకోర్టు ఆమెను ఆదేశించింది. తీస్తా సెతల్వాడ్‌ గుజరాత్‌ మారణకాండకు సంబంధించి కట్టు కథలల్లి కేసులు నమోదు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. గుజరాత్‌లోని కింది కోర్టుల నుంచి హైకోర్టు దాకా అన్ని కోర్టులూ బీజేపీకి అనుకూలంగా తీర్పులు ఇవ్వడం స్పష్టంగా కనిపిస్తోంది. 2002లో గుజరాత్‌ మారణకాండ జరిగితే ఆమె మీద 2022లోనే కేసులు ఎందుకు నమోదు చేశారని, ఇరవై ఏళ్లుగా ఏం చేస్తున్నారని ప్రశ్నించిన సుప్రీంకోర్టు…ఈ కేసే అనుమానాస్పదంగా ఉందని వ్యాఖ్యానించింది. న్యాయమూర్తులు బి.ఆర్‌.గవాయ్‌, ఎ.ఎస్‌.బొపన్న, దీపంకర్‌ దత్తాతో కూడిన బెంచి ఈ వ్యాఖ్యలు చేసింది. చార్జ్‌ షీట్‌ దాఖలైంది కనక ఆమెను నిర్బంధంలోకి తీసుకుని విచారించవలసిన అగత్యం ఏముందని న్యాయమూర్తులు ప్రశ్నించారు. సెతల్వాడ్‌ను అరెస్టు చేయడానికి ఎంచుకున్న సమయాన్ని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నార్థకం చేసింది. అధికారులు వ్యవహరిస్తున్న తీరునుబట్టి చూస్తే సాక్ష్యాధారాల చట్టాన్నే చెత్తబుట్టలో వేయవలసి వస్తుందని న్యాయమూర్తి గవాయ్‌ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఎవరి మీదైనా కేసు మోపితే వారి మీద తీర్పు వచ్చే దాకా జైలులో ఉంచాలని అధికారులు భావిస్తున్నట్టు కనిపిస్తోందని గవాయ్‌ అన్నారు. మోదీ ప్రతిష్ఠను దెబ్బ తీయడానికే సెతల్వాడ్‌ కూడా సాక్ష్యాలు చూపుతున్నారన్న ఆరోపణలను సుప్రీంకోర్టు అనుమాన దృష్టితోనే చూస్తున్నట్టు తేలిపోతోంది. గుజరాత్‌ మారణకాండ సమయంలో మాజీ ఎంపీ ఎహ్సాన్‌ జాఫ్రీని హతమార్చారు. తన భర్తను హతమార్చినందుకు జకియా జాఫ్రీ చేస్తున్న న్యాయ పోరాటానికి తీస్తా సెతల్వాడ్‌ అండగా నిలబడడం గుజరాత్‌ ప్రభుత్వానికి మింగుడు పడడం లేదు. బెయిల్‌ కోసం సెతల్వాడ్‌, జకియా జాఫ్రీ పెట్టుకున్న అర్జీని కోర్టు తిరస్కరించిన రెండు రోజులకే సెతల్వాడ్‌ను అరెస్టు చేయడం చూస్తే గుజరాత్‌ ప్రభుత్వ అధికారులు కత్తిగట్టినట్టు ప్రవర్తిస్తున్నారని భావించక తప్పదు. మారణకాండకు అప్పటి ముఖ్యమంత్రి మోదీ ప్రోత్సాహం ఉందన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. గత ఏడాది సుప్రీంకోర్టు తాత్కాలిక బెయిలు మంజూరు చేసిన తరవాత సెతల్వాడ్‌ జైలు నుంచి విడుదలయ్యారు. ఆ తరవాత ఆమె శాశ్వత బెయిలు కోసం ప్రయత్నం చేస్తున్నారు. మారణకాండ సమయంలో గుజరాత్‌ పాలనా వ్యవస్థ పని తీరును సెతల్వాడ్‌ నిరంతరం తప్పు పడ్తూనే ఉండడం గుజరాత్‌ పాలనా యంత్రాంగానికి ఇప్పటికీ జీర్ణం కావడం లేదు.
గత జూన్‌లో సెతల్వాడ్‌కు బెయిలు ఇవ్వడాన్ని గుజరాత్‌ ప్రభుత్వం వ్యతిరేకించింది. ఆమె కొన్ని రాజకీయ పక్షాల చేతిలో కీలుబొమ్మగా ఉన్నారని వ్యాఖ్యానించి హైకోర్టు తన రాజకీయ పక్షపాతాన్ని రుజువు చేసుకుంది. గుజరాత్‌లో ముస్లింల మీద కొనసాగిన మారణకాండను సవాలు చేస్తూ, దీనిలో అప్పటి ముఖ్యమంత్రి ప్రోత్సాహం ఉందని ఆరోపిస్తూ జకియా జాఫ్రీ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంలో సెతల్వాడ్‌ కూడా భాగస్వామే. ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని గత ఏడాది సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దానితో పాటు న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించింది. ఆ వెంటనే సెతల్వాడ్‌ను అరెస్టు చేసిన తరువాత రెండు నెలలు జైలులో గడిపిన ఆమెకు తాత్కాలిక బెయిలు మంజూరు అయింది. అనంతరం ఆమె మామూలు బెయిలు కోసం చేసిన అన్ని ప్రయత్నాలకు హైకోర్టులో చుక్కెదురైంది. హైకోర్టు నిరాకరించిన తరవాత సెతల్వాడ్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సెతల్వాడ్‌ లాంటివారు ఎవరి చేతిలోనో కీలుబొమ్మలుగా ఉన్నారని ప్రచారం చేయడం కొత్త కాదు. గుజరాత్‌ మారణకాండను కావాలని కొండంతలు చేసి చూపిస్తున్నారని, అందులో సెతల్వాడ్‌ లాంటి వారు కీలక పాత్ర పోషిస్తున్నారన్న ఆరోపణలూ చాలా కాలం నుంచే ఉన్నాయి. 2002 నాటి మారణకాండను ఏదో చిన్న సంఘటనగా చిత్రించాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను ఇప్పుడు కోర్టులను కూడా నమ్మించడానికి తీవ్ర ప్రయత్నం జరుగుతోంది. జకియా జాఫ్రీలాంటి వారికి సెతల్వాడ్‌ అండగా నిలబడి ఉండొచ్చు. కానీ ఆమె ఈ విషయంలో కోర్టుకు ఎక్కకముందే జాతీయ మానవ హక్కుల కమిషన్‌, ఎన్నికల కమిషన్‌ మారణకాండలో లోపాయికారీ వ్యవహారాలను ఎండగట్టాయి. అందువల్ల మోదీ ప్రతిష్ఠను దెబ్బ తీయడానికి సెతల్వాడ్‌ మాత్రమే కంకణం కట్టుకున్నారని వాదించడం అర్థ రహితం. మోదీ ప్రతిష్ఠను సెతల్వాడ్‌ దెబ్బ తీస్తున్నారని వాదించడం వెనక ఆంతర్యం బ్రహ్మ రహస్యమేమీ కాదు. గుజరాత్‌ మారణకాండను అప్పటి జాతీయ మానవ హక్కుల కమిషన్‌ అధ్యక్షులు జె.ఎస్‌.వర్మ, న్యాయమూర్తులు కె.రామస్వామి, సుజాతా మనోహర్‌, వీరేంద్ర దయాళ్‌ పరిగణనలోకి తీసుకున్నారు. అక్కడితో ఆగకుండా సమగ్రమైన నివేదిక ఇవ్వాలని మోదీ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ న్యాయమూర్తులు గుజరాత్‌లో పర్యటించారు కూడా. అప్పుడు మానవ హక్కుల కమిషన్‌కు అధ్యక్షులుగా ఉన్న జె.ఎస్‌.వర్మ అంతకుముందు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఈ మారణకాండలో మరణించిన వారి కుటుంబాలకు పరిహారం అందించడంలోనూ గుజరాత్‌ ప్రభుత్వం పక్షపాత దృష్టి స్పష్టంగా కనిపిస్తోందని అప్పటి నివేదికలో పేర్కొన్నారు. బాధితులకు పరిహారం అందించడంలోనూ అప్పటి మోదీ సర్కారు పక్షపాతంతోనే వ్యవహరించింది. మారణకాండ తరువాత గుజరాత్‌లో ఎన్నికలు నిర్వహించడానికి అనువైన పరిస్థితులు ఉన్నాయో లేదో అంచనా వేయడానికి ఎన్నికల కమిషన్‌ ఆ రాష్ట్రంలో పర్యటించింది. ప్రభుత్వం పంపిన నివేదికలకు, మోదీ ప్రభుత్వం నడవడికకు పొంతన లేదని ఎన్నికల కమిషన్‌ తేల్చింది. బెస్ట్‌ బేకరీ కేసును మళ్లీ విచారించాలని పెట్టుకున్న అర్జీని పరిశీలించిన సమయంలో అప్పటి ప్రధాన న్యాయమూర్తి వి.ఎన్‌.ఖరే సైతం గుజరాత్‌ ప్రభుత్వం అధీనంలో జరిగే ప్రాసిక్యూషన్‌ ప్రక్రియ నమ్మశక్యంగా లేదని వ్యాఖ్యానించారు. బెస్ట్‌ బేకరీ ఘటనలో బాలలు, నిస్సహాయులైన మహిళలు మంటలకు ఆహుతి అవుతుంటే ‘ఆధునిక నీరోలు’ మరెటో చూస్తూ కూర్చున్నారని ఖరే దుయ్యబట్టారు. మానవ హక్కుల సంఘం, ఎన్నికల కమిషన్‌, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం మీద ప్రతికూల వ్యాఖ్యలు చేయడానికి తోడు మహిళా సాధికారిత కోసం ఏర్పడిన పార్లమెంటరీ కమిటీ కూడా మోదీ ప్రభుత్వ ధోరణిని నిలదీసింది. ఇన్ని వ్యవస్థలు మోదీని బోనులో నెలబెట్టినప్పుడు ఆయన ప్రతిష్ఠను సెతల్వాడ్‌ దెబ్బ తీస్తున్నారని ఇరవై ఏళ్ల తరువాత ప్రచారం చేయడం వితండవాదమే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img