Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

మరో ముందడుగు

అపోలో 11 చంద్ర మండల యాత్ర 1969 జులై 16న ప్రారంభించిన నాలుగు రోజుల తరవాత నీల్‌ ఆర్మ్‌ స్ట్రాంగ్‌, ఎడ్విన్‌ ఆల్డ్రిన్‌ చంద్రుడి మీద కాలుపెట్టే దాకా చంద్రుడి గురించి మన ఊహలకు హద్దే లేకుండా ఉండేది. మానవుడు చంద్రుడి మీద అడుగుపెట్టిన సందర్భంలో డా.సి.నారాయణ రెడ్డి ‘‘నీ పత్తా దొరికింది శశి/ నీ పస తెలిసిపోయింది/నీలో ఉన్నది సుధ కాదు-సుద్ద’’ అని రాసి శాస్త్రీయ పునాదిలేని ఊహలు కేవలం అక్కడే మిగిలిపోతాయని తేల్చారు. అంతకు ముందు చంద్రుడి గురించి మనం చేయని ఊహలేదు. అంతరిక్ష యాత్రలు కేవలం సంపన్న దేశాలకు మాత్రమే సాధ్యం అన్న భావనను భారత్‌ 1962లోనే పటాపంచలు చేసింది. శుక్రవారం ప్రయాణం మొదలైన చంద్రయాన్‌-3 ఈ యాత్రను మరింత ముందుకు తీసుకెళ్లింది. చంద్రుడిమీదకు వ్యోమ నౌకను పంపించడం ఇది భారత్‌కు మూడో సారి. శుక్రవారం మనం ఎల్‌.వి.ఎం.-3 `ఎం4 వాహక నౌక ద్వారా వ్యోమ నౌకను విజయవంతంగా ప్రయోగిం చగలిగాం. అయితే చంద్రుడి మీద పరిశోధనలు కొనసాగించడానికి ప్రారంభించిన చంద్రయాన్‌-3 చంద్రుడి మీద దిగడానికి ఆగస్టు 23 దాకా వేచి ఉండవలసిందే. ఈ వ్యోమ నౌక ముందు చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించాలి. ఆ తరవాత చంద్రుడి మీద సురక్షితంగా దిగగలగాలి. అప్పుడు మన ప్రయత్నం చాలావరకు సఫలమైనట్టు లెక్క. ఆ తరవాత పరిశోధనలు సాగుతాయి. అయితే వ్యోమనౌక చంద్రుడి మీద సురక్షితంగా దిగడమే ఈ ప్రస్థానంలో అత్యంత కీలకాంశం. చంద్రుడిమీద ఉండే ఒక పగలు అంటే మన 14 పగళ్లతో సమానం. ఆ తరవాత మరో 14 రోజులు రాత్రి. అంటే అంతా చీకటి. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకునే చంద్రుడి మీద పగలు ఉన్న సమయంలోనే ఈ వ్యోమనౌకను దించాలని సంకల్పించారు. 2008, 2019లో – రెండు సార్లు మనం చంద్రుడి మీదకు వ్యోమనౌకలు పంపించాం. మొదటిసారి వ్యోమనౌక సురక్షితంగానే దిగింది. చంద్రగ్రహం మీద నీటి ఆనవాళ్లు పసిగట్టగలిగాం. కానీ 2019లో ప్రయోగించిన వ్యోమనౌక మాత్రం చంద్రుడి మీద దిగడం కుదరలేదు. మొదటి చంద్రయాన్‌ చేపట్టిన సమయంలోనూ అనేక కొత్త విషయాలు మన శాస్త్రజ్ఞులు తెలుసుకోగలిగారు. చంద్రగ్రహాన్ని శోధించే మన ప్రయత్నాలు 2008లో మొదటి చంద్రయాన్‌తో మొదలైనాయి. అక్టోబర్‌ 2008లో చంద్రయాన్‌ 1ని విజయవంతంగా ప్రయోగించగలిగాం. ఆ నౌకలో ఉన్న సామాగ్రి పరిశోధనా పరిధి చాలా పరిమితమైంది. చంద్రుడి ఉపరితలం, స్థలాకృతి, వాతావరణం పరిశీలించడానికే మొదటి యాత్రను ఉద్దేశించారు. ఆ పని సక్రమంగానే నెరవేరింది. ఈ విజయం ఇచ్చిన స్ఫూర్తివల్ల 2019లో రెండో చంద్రయాన్‌లో మరింత సంక్లిష్టమైన అంశాలను పరిశోధిం చాలనుకున్నారు. చంద్రుడి మీద వాతావరణాన్ని, ఉపరితలాన్ని పరిశీలించడానికి కూడా ఉపకరించింది. కానీ సాఫ్ట్‌వేర్‌లో లోపాలు తలెత్తడంవల్ల చంద్రుడి మీద దిగడం సాధ్యం కాలేదు. గతంలో ఉన్న లోపాలను సరిదిద్ది మూడవ యాత్ర చేపట్టాం. చంద్రుడి మీదికి ఇలాంటి వ్యోమ నౌకలను పంపింది ఇంతవరకు అమెరికా, రష్యా, చైనా మాత్రమే. చంద్రయాన్‌-3 తన లక్ష్యాన్ని సాధిస్తే భారత్‌ నాల్గవ దేశం అవుతుంది. సురక్షితంగా చంద్రుడి మీద దిగగలగడం కూడా చంద్రయాన్‌-3లో నిర్దేశించుకున్న లక్ష్యాలలో ప్రధానమైందే. రెండవ యాత్రలో ఎదురైన సమస్యలు మళ్లీ తలెత్తకుండా మన అంతరిక్ష శాస్త్రవేత్తలు సకల జాగ్రత్తలూ తీసుకున్నారు. ఈ యాత్ర అంతా అనుకున్నట్టు జరిగితే సమాచారం సేకరించడమే కాకుండా చంద్రుడిమీద సార్‌నాథ్‌లోని అశోక చిహ్నాం కూడా అక్కడ నెలకొల్పుతారు. చంద్రయాన్‌-3 చంద్రుడి దక్షిణ ధ్రువం మీద సాగాలన్నది సంకల్పం.
ప్రస్తుత యాత్ర అంతా అనుకున్నట్టు సాగితే భారతీయ అంతరిక్ష యాత్రికులను చంద్రుడి మీదకు పంపాలన్న సంకల్పం నెరవేరుతుంది. చంద్రుడి ఉపరితలాన్ని పరిశీలించడం ఏ చోటి నుంచి బాగా సాధ్యం అవుతుందో పరిశీలించడానికి కావలసిన ఏర్పాట్లు కూడా చేశారు. మొదటి రెండు యాత్రల్లో ఎదురైన విజయాలను, అపజయాలను కూడా దృష్టిలో ఉంచుకుని ఈ యాత్రకు ప్రణాళిక రూపొందించారు. రెండో యాత్ర అంతిమ లక్ష్యం విఫలమైనా ఆర్బిటర్‌ తన పని తానుచేస్తూ చాలా విలువైన సమాచారాన్ని అందిస్తూనే ఉంది. చంద్రయాన్‌-3 సాఫల్యం మన భవిష్యత్‌ కార్యాచరణ పథకాలకు నూతనోత్సాహాన్ని, విశ్వాసాన్ని కల్పిస్తుంది. మన వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రంలోకి పంపాలను కుంటున్నాం. అది సాధ్యమైతే అంతరిక్షరంగంలో భారత్‌ కూడా అగ్రరాజ్యాల సరసనచేరి సత్తా చాటుకోగలుగుతుంది. ఇది ఇతర విజ్ఞానశాస్త్రాభివృద్ధిలో నూతన పరిణామాలకు అవకాశం కల్పిస్తుంది. స్వాతంత్య్రం వచ్చిన కొద్దిరోజులకే మనం అంతరిక్ష పరిశోధనల మీద దృష్టి నిలిపాం. పండిత్‌ నెహ్రూ దానికోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. ఆ ముందు చూపే మన అంతరిక్ష పరిశోధనలకు చోదక శక్తిగా పనిచేస్తోంది. అంతరిక్ష విజ్ఞాన పరిశోధనల్లో కూడా ప్రైవేటు రంగానికి ద్వారాలు తెరిచినందువల్ల ఆ రంగం నుంచి ఉత్సాహం, ఆసక్తి, పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది. అంతరిక్ష యాత్రల్లో భారత్‌ పాదముద్రలను ఈ రంగంలో దిగ్దంతలు అనిపించుకున్న దేశాలు కూడా అత్యంత ఆసక్తితో పరిశీలిస్తున్నాయి.
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న భారత్‌ అంతరిక్ష ప్రయోగాలకు అపారంగా డబ్బు వెచ్చించడం ఎందుకు అని ప్రశ్నించేవారు లేకపోలేదు. కానీ శాస్త్రరంగంలో మనంవేసే ప్రతి ముందడుగూ, తద్వారా అంది వచ్చే అనుభవాన్ని సమాజాభివృద్ధి కోసం వినియోగించుకుంటే ఆర్థిక రంగంలో సమానత్వం సాధించడం అసాధ్యంకాదు. ఇతర దేశాల ఉపగ్రహాలను కూడా రోదసిలోకి ప్రవేశపెట్టే దశకు మనం ఇదివరకే చేరుకున్నాం. మనం సాధించే ప్రతి విజయం మానవాభ్యుదయానికి ఊత కర్ర కావాలి. అయితే మన శాస్త్రీయ స్ఫూర్తి కనీసం శైశవ దశలో కూడా ఉన్నట్టు లేదు. సృష్టికి ప్రతి సృష్టి చేయగల సత్తా ఉన్న శాస్త్రవేత్తలకు మూఢ నమ్మకాలు ఉండకూడదు. కానీ మనం అంతరిక్షంలోకి ఏం ప్రయోగించినా ఆ ఉపగ్రహం, పరికరంలాంటి వాటి నమూనాలను తీసుకెళ్లి తిరుపతి వెంకటేశ్వరస్వామి పాదాల దగ్గరపెట్టి ఆశీస్సులు తీసుకోవడం వీటిని తయారుచేసిన శాస్త్రవేత్తలే మానలేదు. అంటే విజ్ఞాన శాస్త్ర రంగంలో విశేష ప్రతిభ ఉన్న శాస్త్రవేత్తలకు కూడా అతీత శక్తుల మీద విశ్వాసం ఉండడం శాస్త్రీయ స్ఫూర్తి లేమికి నిదర్శనం. ఇది ఆయా శాస్త్రవేత్తల వ్యక్తిగత అభిప్రాయం అని కొట్టి పారేయడానికి వీలులేదు. ఎందుకంటే శాస్త్రీయ స్ఫూర్తి కొరవడుతున్నది వ్యక్తులుగా అద్భుత విజయాలను సాధిస్తున్న శాస్త్రవేత్తల్లోనే కదా! మన శాస్త్రవేత్తలలో శాస్త్రీయ స్ఫూర్తి ఇంకనే లేదు. సంపూర్ణమైన శాస్త్రీయ దృక్పథం ఉన్న వారి సంఖ్య చాలా పరిమితం అని అంతరిక్ష శాస్త్రవేత్తలు చేస్తున్న పూజాదికాలవల్ల రుజువవుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img