Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

మోదీ మొసలి కన్నీళ్లు

మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా రోడ్డు మీద ఊరేగించి, ఆ తరవాత మూకుమ్మడి అత్యాచారం చేసినట్టు చూపే వీడియో బుధవారం నాడు విస్తృతంగా ప్రచారంలోకి రాకుండా ఉంటే ప్రధానమంత్రి మోదీ కనీసం మొసలి కన్నీళ్లు అయినా కార్చేవారు కాదు. ‘‘మీకు తెలిసింది ఈ ఒక్క వీడియోనే. ఇలాంటివి వందకన్నా ఎక్కువ ఉన్నాయి అని మణిపూర్‌ ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ చెప్పి ఉండరు. జాతీయ మహిళా కమిషన్‌ తనంత తాను మణిపూర్‌ లోని ఘోరమైన పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని మణిపూర్‌ ప్రభుత్వం నుంచి నివేదిక అడిగి ఉండదు. అన్నింటికన్నా ముఖ్యంగా మణిపూర్‌ పరిస్థితిని చక్క దిద్దడానికి ప్రభుత్వం ఏ చర్యా తీసుకోకపోతే మేమే ఏదో ఒకటి చేయాల్సివస్తుంది అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్ర చూడ్‌ బుధవారం వ్యాఖ్యానించి ఉండే వారు కారేమో. సుప్రీంకోర్టులో మణిపూర్‌ వ్యవహారం ప్రస్తావనకు రాకపోతే మోదీ నోటికి వేసిన తాళం కచ్చితంగా తెరుచుకునేది కాదు. అదీ కాక గురువారం పార్లమెంటు సమావేశాలు ప్రారంభం అవుతున్నందువల్లే మోదీ ఈ విషయాన్ని ప్రస్తావించినట్టున్నారు. మహిళలను నగ్నంగా ఊరేగించింది మే నాల్గవ తేదీన. ఈ విషయంలో ఎఫ్‌.ఐ.ఆర్‌. దాఖలైంది మే 18న. అయినా ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ కు చీమ కుట్టినట్టయినా అనిపించలేదు. కానీ మే నాలుగున మహిళల మీద అత్యాచారం జరగిందన్న వీడియో ప్రచారంలోకి రావడానికి కనీసం నెలరోజుల ముందు హక్కుల కోసం పోరాడే మహిళలు జాతీయ మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు రేఖా శర్మను హెచ్చరించారు. మణిపూర్‌ లో నెలకొన్న అల్లకల్లోల పరిస్థితి గురించి ఆ కార్యకర్తలు అనేక ఉదంతాలు కూడా చూపించారు. ఆ సామాజిక కార్యకర్తలు రేఖా శర్మకు అపహరణలు, కొట్టిచంపడం, దహనాలు, హత్యల గురించి సమాచారం ఇచ్చారు. కానీ జాతీయ మహిళా కమిషన్‌ తనంత తాను మణిపూర్‌ పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవడానికి కూడా ఇద్దరు మహిళల మీద హేయమైన అత్యాచారం వీడియో బయటకు రావాల్సి వచ్చింది. ఈ ఇద్దరు మహిళా సామాజిక కార్యకర్తలతో పాటు ఉత్తర అమెరికా మణిపూర్‌ గిరిజన సంఘం కూడా మణిపూర్‌ లో పర్యటించింది. జూన్‌ రెండున సామాజిక కార్యకర్తలు మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు రేఖా శర్మకు లేఖ రాశారు. మణిపూర్‌ లో భయంకరమైన నిశ్శబ్దం ఆవహించి ఉందని, స్త్రీల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయని, కుకీ, జోమి మహిళలపైనిరాఘాటంగా అత్యాచారాలు జరుగుతున్నాయని, మెయితీల హత్యాకాండ భయానకంగా ఉందని కూడా వారు ఈ లేఖలో తెలియ జేశారు. తనకు అందిన సమాచారం ఎంత మేరకు నమ్మదగిందో పరి శీలించవలసి వచ్చిందని, ఇందులో విదేశాల నుంచి అందిన సమాచారం కూదా ఉందని రేఖా శర్మ చెప్పారు. సామాజిక కార్యకర్తల లేఖ అందిన తరవాత రేఖా శర్మ మణిపూర్‌ ప్రభుత్వాధికారులను సంప్రదించారట. కానీ వారు పలకనే లేదట. వారి మౌనం వెనక ఆంతర్యం ఏమిటో తెలిసిపోతూనే ఉంది. వాస్తవ పరిస్థితి ముఖ్యమంత్రి బీరేన్‌ సింఫ్‌ుకు తెలియదనుకోలేం. తెలిసినా ఆయన ఏ చర్యా తీసుకోలేదంటే గుజరాత్‌ మారణకాండ జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ లాగే దుర్మార్గమైన దాడులను ప్రోత్సహించి ఉండాలి. అలాంటి ముఖ్యమంత్రిని అధికారంలో కొనసాగనిచ్చిన కేంద్ర ప్రభుత్వం కూడా బోనెక్కవలసిందే. ఆ రాష్ట్ర గవర్నర్‌ అనసూయ ఎప్పటి కప్పుడు కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపుతూనే ఉన్నారు. ఈ నివేదికలన్నీ హోం మంత్రి అమిత్‌ షా దృష్టికి వెళ్తాయి. ఈ నివేదికలను ఆయన తనకు సమర్పించిన ‘‘నైవేద్యం’’ అనుకున్నారేమో.
మెయితీ కార్యకర్తలు, అందునా మహిళా కార్యకర్తలు కుకీలు, జోమీ మహిళలు, పిల్లల మీద దాడుల్లో కీలక పాత్ర పోషించారు. దేశవ్యాప్తంగా కల్లోలం రేపిన వీడియో మే నాల్గవ తేదీకి సంబంధించిది అయినప్పటికీ బుధవారం నాడే వెలికి వచ్చి విస్తృత ప్రచారంలోకి వచ్చింది. ఇంటర్నెట్‌ మీద ఆంక్షలు తొలగించినందువల్లే ఈ వీడియో బయటపడిరది. మహిళల మీద అత్యాచారం జరిగినట్టు తెలియగానే అటు మోదీ మౌనం వీడారు. ఇటు మణిపూర్‌ ప్రభుత్వం ఇద్దరిని అరెస్టు చేసింది. ఆ వీడియోలో దోషిగా కనిపిస్తున్న వ్యక్తి ముస్లిం కావడం కూడా బీజేపీ విద్వేష ప్రచారానికి ఉపకరించవచ్చు.
మణిపూర్‌లో జరిగిన సంఘటన తనకు అపారమైన హృదయ వేదన కలిగించిందని మోదీ నటనా చాతుర్యంలో ఏ లోటూ లేకుండా చెప్పారు. అది నాగరిక సమాజానికి సిగ్గు చేటు అని కూడా అన్నారు. నాగరిక సమాజాన్ని అనాగరికంగా మార్చింది సంఫ్‌ు పరివారే కదా! మోదీ ఆవేదన మోస పూరితమైంది.
ఆయన రాజకీయ ఎజెండానే ఈ బీభత్సానికి కారణం అయినప్పుడు ఆయన ఆవేదన పడ్డారంటే నమ్మలేం. తన బాధ్యత ఏమీ లేదు అని చేతులు కడిగేసుకోవడానికే మోదీ ఆవేదనను అంకితం చేశారు. ఇలాంటి పరిస్థితి మణిపూర్‌ కే పరిమితం కాలేదని మోదీ సిగ్గు విడిచి చెప్పారు. ఇందులోనే ఆయన రాజకీయ కుట్ర ఉంది. ఆయన కాంగ్రెస్‌ పరిపాలన ఉన్న రాజస్థాన్‌, ఛత్తీస్‌ గఢ్‌ లో పరిస్థితిని ప్రస్తావించింది అందుకే. తన ఒక్కడి మీద బురద ఎందుకు అనుకుని కాంగ్రెస్‌ మీద కూడా బకెట్లకొద్దీ బురద గుమ్మరించారు. రాజస్థాన్‌, ఛత్తీస్‌ గఢ్‌లో జరిగిన చిన్న ఘటనలను మణిపూర్‌ అగ్నిగుండంతో కలిపేయడం మోదీ ప్రదర్శిస్తున్న గారడీ విద్యలో భాగం. అసలు పరిస్థితిని జనం దృష్టి మళ్లించే ఎత్తుగడ. వ్యవస్థ లోపం అన్నారు. హింసాకాండకు తన వత్తాసును కప్పి పుచ్చు కోవడానికి కొంత బాధ్యత మణిపూర్‌లోని బీజేపీ ప్రభుత్వంపైకీ నెట్టారు. తనకు అక్కడి పరిస్థితి తెలియదని బుకాయించారు. నిజంగానే మణిపూర్‌ ప్రభుత్వం కేంద్రానికి తెలియజేయకపోతే ఆ బాధ్యతా రాహిత్యానికి పాల్పడినందుకు బీరేన్‌ సింగ్‌ను వెంటనే ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి ఉండ వలసింది.
మోదీ ఆ పని చేయలేదంటే నమ్మడం కుదరదు. మే మూడవ తేదీననే మణిపూర్‌ లో కల్లోలం ప్రారంభం అయింది. అయినా మోదీ సర్కారు దాన్ని కేవలం శాంతి భద్రతల సమస్యగా ప్రచారం చేసి వాస్తవాన్ని గంప కింద కమ్మేసింది. మోదీ మాటల్లోని డొల్లతనం, మోసం ఆయన మౌనం కన్నా ప్రమాదకరం. మణిపూర్‌ పరిస్థితిని ప్రస్తావించి ఆవేదన వ్యక్తం చేసిన మోదీ ఆ రాష్ట్రంలోని హింసాకాండను ప్రస్తావించకుండా తప్పించు కున్నారు. మణిపూర్‌ ప్రభుత్వం, ఆర్‌.ఎస్‌.ఎస్‌. కార్యకర్తలను కాపాడ డానికే ఆయన ప్రయత్నించారు. ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌ హెచ్చరించకుండా ఉంటే మోదీ మౌనవ్రతాన్ని నిర్విఘ్నంగా కొనసాగించే వారు. కోర్టు కార్యకలాపాలు ప్రారంభం కాక ముందే ప్రధాన న్యాయమూర్తి నిండు కొలువులో మణిపూర్‌ పరిస్థితి చాలా విచలితం చేసేదిగా ఉందని ప్రకటించడం మన న్యాయ వ్యవస్థ చరిత్రలో ఇదే మొదటి సారి కావచ్చు. ఈ ప్రకటన చేయడం ద్వారా ప్రధాన న్యాయమూర్తి మణిపూర్‌ పరిస్థితిని రికార్డులకెక్కించాలనుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img