Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

వక్ఫ్‌ చట్ట సవరణ వెనక విద్వేషం

ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు గురువారం లోక్‌సభలో వక్ఫ్‌ బోర్డ్‌ సవరణ చట్టాన్ని ప్రతిపాదించారు. అదే సమయంలో ఈ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జె.పి.సి.) కి పంపించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. సాధారణంగా ఏ బిల్లునూ స్థాయీ సంఘాల, సంప్రదింపుల కమిటీకి కూడా పంపించడానికి నిరాకరించే మోదీ ప్రభుత్వం ఈ బిల్లును జె.పి.సి.కి పంపడానికి సుముఖత వ్యక్తం చేయడంతో ప్రభుత్వం జె.పి.సికి పంపింది. 1995 నాటి వక్ఫ్‌ చట్టాన్ని సవరించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్‌ చట్టంలో 44 సవరణలు చేయాలనుకుంటోంది. అందులో నాలుగైదు ప్రధానాంశాలు ఉన్నాయి. మొట్ట మొదటిది 1995 నాటి చట్టం పేరే మార్చేయడం. వక్ఫ్‌ విస్తృత లక్ష్యాలను ప్రతిబింబించేలా వాటి నిర్వహణ, అధికారాలు, వక్ఫ్‌ ఆస్తులను అభివృద్ధి చేయడం. రెండవ ముఖ్యమైన అంశం 40వ సెక్షన్‌ను పూర్తిగా తొలగించడం. ఇప్పుడున్న 40వ సెక్షన్‌ ప్రకారం ఒక ఆస్తి వక్ఫ్‌దో కాదో నిర్ధారించే అధికారం వక్ఫ్‌ బోర్డులకే ఉంది. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న సవరణ ప్రకారం వక్ఫ్‌ ఆస్తుల వర్గీకరణలో మార్పులు సాధ్యం అవుతాయి. మూడవది: వక్ఫ్‌ బోర్డులలో ఎవరు ఉండాలన్న అంశానికి సంబంధించింది. ఇందులో ముస్లిం మహిళలకు కూడా ప్రాతినిధ్యం ఉండాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇది ఆహ్వానించదగిన సవరణే. దానితో పాటు హిందువులకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలనుకుంటున్నారు. ప్రతిపక్షాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇతర మతాలవారిని వక్ఫ్‌ బోర్డుల్లో సభ్యులుగా నియమించడం ముస్లింల మతపరమైన హక్కులను కాల రాయడమేనని ముస్లిం వర్గాలు, ప్రతిపక్షాలు కూడా వాదిస్తున్నాయి. నాల్గవది: దీనికి తోడు దావూదీ బోహ్రాలు, ఆగాఖానీల కోసం ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోంది. షియాలకు, సున్నీలకు, ఇతరులకు సైతం ప్రాతినిధ్యం కల్పించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. అయిదవది: వక్ఫ్‌ ఆస్తులను ఒక కేంద్ర పోర్టల్‌ ద్వారా రిజిస్టర్‌ చేయించడం. రెవెన్యూ చట్టాలకు అనుగుణంగా ఆస్తులను విభజించడం. ఈ బిల్లును ప్రతిపాదించడానికి మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు లేచి నిలబడగానే కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, సమాజ్‌ వాదీ పార్టీ, డి.ఎం.కె.సభ్యులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సవరణ బిల్లు రాజ్యాంగం మీద, మత స్వేచ్ఛ మీద, ఫెడరల్‌ వ్యవస్థ మీద బాహాటమైన దాడి అనీ, కిరాతకమైందని ప్రతిపక్షాలు అంటున్నాయి. 1995 నాటి వక్ఫ్‌ చట్టం రూపు రేఖలను సంపూర్ణంగా మార్చడంతో పాటు కాల దోషం పట్టిన 1923 నాటి చట్టాన్ని రద్దు చేయడానికి విడిగా మరో బిల్లు ప్రతిపాదిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వివరించారు.
ఈ బిల్లును జె.పి.సి.కి పంపడం వల్ల ఫలితం ఎలా ఉంటుందో తెలియదు. కానీ ప్రభుత్వం ఉద్దేశించిన రీతిలో ఆమోదం పొందితే దేశంలో వక్ఫ్‌ ఆస్తుల నిర్వహణ సమూలంగా మారిపోతుంది. ఇంతవరకు అన్ని ముస్లిం వర్గాలకు కలిపి ఒకే వక్ఫ్‌ బోర్డు ఉంది. ప్రతిపాదిత చట్టం అమలులోకి వస్తే దావూదీ బోహ్రాలకు, ఆఘాఖానీలకు ప్రత్యేక బోర్డులు ఏర్పాటు అవుతాయి. అంటే ఇస్లాం మతానుయాయుల్లో ఉన్న వివిధ శాఖల వారి మధ్య చీలికలు తేవాలన్న సంకల్పం మోదీ ప్రభుత్వానికి బలంగాఉంది. ఏ మతంలోనైనా భిన్నమైన శాఖలు ఉన్నాయి. ఉంటాయి. వక్ఫ్‌బోర్డ్‌ ఆస్తుల దురాక్రమణను నివారించడం ఈ సవరణ బిల్లు పరమ లక్ష్యం అని కిరణ్‌ రిజిజు అంటున్నారు. వక్ఫ్‌ బోర్డుల ఆస్తులు అన్యాక్రాంతమైన సందర్భాలు లేవని కాదు. వక్ఫ్‌ బోర్డులకు ఆస్తులు దానధర్మాల వల్ల సమకూరినవే. ఈ దానాలన్నీ దేవుడికి చెందినవే తప్ప వ్యక్తులకు, సంఘాలకు, సంస్థలకు వాటి మీద ఎలాంటి హక్కూ ఉండదు. వక్ఫ్‌ లక్ష్యం సమాజ సేవ, సమాజ సంక్షేమం. వక్ఫ్‌ వ్యవహారాలు నడిపే వారు నిర్వాహకులే తప్ప ఆ ఆస్తులకు యజమానులు కారు. వక్ఫ్‌ బోర్డులు ముస్లింలకు చెందినవే అనడం ఎంత సత్యమో ఈ బోర్డుల మీద ప్రభుత్వ ఆధిపత్యం ఉందనడం అంతకన్నా ఎక్కువ సత్యం. వక్ఫ్‌లో ప్రభుత్వానికి పాత్ర లేదనడం కేవలం అసత్య ప్రచారమే. 2009 నుంచి వక్ఫ్‌ ఆస్తులు రెట్టింపైనాయన్న ఆరోపణ ఉంది. వక్ఫ్‌ దగ్గర ఉన్న డబ్బును విద్య, అభివృద్ధి, సంక్షేమంకోసం ఖర్చు పెట్టాలన్న నియమం ఎప్పటి నుంచో ఉంది. హిందువులు కూడా వక్ఫ్‌ బోర్డుకు ఆస్తులు దానం ఇవ్వొచ్చు. అయితే అది హిందూ ధర్మానికి, హిందువులకు వర్తించే చట్టాలకు అనుగుణంగా ఉండాల్సిందే. ప్రభుత్వం దీన్నే తిరగేసి వక్ఫ్‌ దగ్గర ఉన్న డబ్బును భర్తను కోల్పోయిన వారి, విడాకులు పుచ్చుకున్నవారి, అనాథల సంక్షేమానికి వెచ్చించాలని పాత లక్ష్యాలకు కొత్త ముసుగు తొడుగుతోంది. వక్ఫ్‌ బోర్డుల్లో ఇతర మతాల వారికి కూడా ప్రాతినిధ్యం కల్పించాలన్న ప్రభుత్వ సంకల్పం మాత్రం కచ్చితంగా ముస్లింల వ్యతిరేక వైఖరివల్ల ఉత్పన్నమైందే. హిందూ ఆలయాలు, ధర్మ కర్తృత్వ సంస్థలలో హిందువులు కాని వారికి ప్రాతినిధ్యం లేనప్పుడు ముస్లింల విషయంలోనే ఈ నియమం ఎందుకు అన్నది అత్యంత సామాన్యులకు కూడా రావలసిన అనుమానమే. వక్ఫ్‌ బోర్డులకు మసీదులు నిర్మించే అధికారంలేదు. కానీ ఆసుపత్రులు, విద్యాలయాలు, ధర్మ సంస్థలు ఏర్పాటు చేయొచ్చునన్న నియమం ఎప్పటి నుంచో ఉంది. ఎప్పటి నుంచో ఉన్న ఈ సానుకూల అంశాలను మార్చడంలో ప్రభుత్వ ముస్లిం వ్యతిరేక భావన లేదని అనుకోలేం. వక్ఫ్‌ ఏర్పాటు చేయడానికి ముస్లింలే కానక్కర లేదన్న 1921 నాటి తీర్పు కూడా ఉంది. వక్ఫ్‌ ఆస్తులు సర్వే చేయడానికి సర్వేయర్‌ను నియమించేదీ ప్రభుత్వమే. ఈ సర్వేయర్‌ వక్ఫ్‌ ఆస్తుల జాబితా తయారు చేయాలి. ఈ సర్వేయర్‌కు సివిల్‌ కోర్టులకు ఉండే అధికారాలు ఉంటాయి. సాక్షులను పిలిపించే అధికారమూ ఉంటుంది. ప్రభుత్వం కావాలనుకుంటే మరోసారి కూడా సర్వే చేయించవచ్చు. వక్ఫ్‌ బోర్డు నిర్వాహకులను కూడా ప్రభుత్వమే నియమిస్తుంది. వక్ఫ్‌ ఆస్తులకు సంబంధించిన వివరాలను గెజెట్‌ ఉత్తర్వు ద్వారా ప్రభుత్వం ప్రకటిస్తుంది. వివాదాలు వస్తే నిర్వాహకులు (ముతవల్లీలు) ట్రిబ్యునల్‌ దృష్టికి తీసుకెళ్లాలి. ట్రిబ్యునల్‌ తీర్పులపై హై కోర్టుకో, సుప్రీంకోర్టుకో వెళ్లాల్సిందే. ఈ ట్రిబ్యునళ్లలో ముస్లింలు మాత్రమే ఉండాలన్న నియమేమీ లేదు. వక్ఫ్‌ల నిర్వహణకు కేంద్ర వక్ఫ్‌ కౌన్సిల్‌ ఉంటుంది. దానికి అధిపతి కేంద్రమంత్రి. జమా ఖర్చుల ఆడిట్‌ నిర్వహిం చడం కూడా ప్రభుత్వం అధీనంలోనే ఉంటుంది. ఇన్ని కట్టుదిట్టాలున్న వక్ఫ్‌ వ్యవహారాలకు వర్తించే చట్టాన్ని సవరించాలనుకోవడంలో ముస్లిం వ్యతిరేకత తప్ప మరో లక్ష్యం కనిపించదు. ముమ్మారు తలాక్‌ నిషేధం మొదలైనవి ముస్లిం మహిళల సంక్షేమానికేనని మోదీ ప్రభుత్వం చేసుకున్న ప్రచారాన్ని ఎలా మరిచి పోగలం!

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img