Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

అమ్మఒడి నిండేనా ?

అరకొరగానే ఖాతాల్లో నిధుల జమ
తల్లుల ఎదురు చూపు
సచివాలయాలు, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు
ఆర్థిక లోటుతో సర్కారు సతమతం

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: ఈ విద్యా సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జగనన్న అమ్మఒడి పథకం డబ్బులు లబ్ధిదారులందరికీ అందలేదు. చాలా మంది తల్లులు నిత్యం గ్రామ/వార్డు సచివాలయాల దగ్గరకు వెళ్లి తమ బ్యాంకు ఖాతాల్లో అమ్మఒడి సొమ్ము జమ కాకపోవడంపై ఆరా తీస్తున్నారు. సాంకేతిక కారణాలతోనే జమ అవ్వలేదని, రేపు, ఎల్లుండి అంటూ వారిని సిబ్బంది బుజ్జగిస్తున్నారు. అటు వలంటీర్ల నుంచి సరైన జవాబు రావడం లేదు. తమ పరిధిలో లేదని, బ్యాంకులకు వెళ్లి అడగాలంటూ తల్లులకు బదులిస్తున్నారు. గంటల కొద్దీ బ్యాంకుల ఎదుట తల్లులు నిలబడినా ఫలితం దక్కడంలేదు. మీ ఖాతాల్లోకి ఇంకా సొమ్ము జమ కాలేదంటూ బ్యాంకు సిబ్బంది చెప్పడంతో డీలా పడుతున్నారు. శని, ఆది వారాలతోపాటు మధ్యలో ప్రభుత్వ సెలవులు రావడంతోనే ఈ పరిస్థితి ఎదురవుతోందని చెప్పడంతో చేసేదేమీ లేక నిరుత్సాహంగా వెనుదిరుగుతున్నారు. ప్రభుత్వం ఏకకాలంలో ‘అమ్మఒడి’కి అర్హులైన తల్లుల ఖాతాల్లో సొమ్ము జమ చేసినట్లు ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నప్పటికీ, మరెందుకు పడలేదంటూ ప్రశ్నిస్తున్నారు.
బటన్‌ నొక్కినా…సొమ్ము జాడేది ?
జగనన్న అమ్మఒడి పథకం ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో ఒకటి నుంచి ఇంటర్‌ వరకు అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. జగన్‌ సర్కారు ఇప్పటికే మూడు విద్యా సంవత్సరాలకుగాను అమ్మఒడిని అమలు చేసింది. నాలుగో విడతలో భాగంగా, 2023-24 విద్యా సంవత్సరానికిగాను జూన్‌ 28వ తేదీన పార్వతీపురం మన్యంజిల్లా కురుపాంలో సీఎం వైఎస్‌ జగన్‌… అమ్మఒడి పథకం నిధులను బటన్‌ నొక్కి తల్లుల ఖాతాల్లోకి లాంఛనంగా జమచేశారు. ఈ విద్యా సంవత్సరానికిగాను 42లక్షల మందికిపైగా తల్లుల ఖాతాల్లోకి జగనన్న అమ్మఒడి నిధులు రూ.6392 కోట్ల ను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని పదిరోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని తలపెట్టింది. అయితే సీఎం బటన్‌ నొక్కి పది రోజులు గడుస్తున్నా… అర్హులందరికీ సొమ్ము జమ కాకపోవడంపై లబ్ధిదారుల్లో అసంతృప్తి నెలకొంది. ప్రభుత్వం, అధికారుల మధ్య సమన్వయం లేనందునే ఈ పరిస్థితి దాపురించిందని వాపోతున్నారు.
ఆర్థికలోటే కారణమా ?
ప్రభుత్వ ఆర్థిక లోటు కారణంగానే జగనన్న అమ్మఒడి నిధులను ఏకకాలంలో తల్లుల ఖాతాల్లోకి జమ చేయలేకపోతున్నారన్న విమర్శలున్నాయి. జగన్‌ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆర్థిక లోటుతో సతమతమవుతోంది. అవసరానికి మించి అప్పులు చేయడం, ఎడాపెడా సంక్షేమ పథకాల అమలే దీనికి ప్రధాన కారణాలంటూ ప్రతిపక్షాలు దుమ్మెతిపోస్తున్నాయి. ఈ విద్యా సంవత్సరం జగనన్న అమ్మఒడికి ఆర్థిక లోటే కారణమని తెలుస్తోంది. ఆ విషయాన్ని ప్రభుత్వ యంత్రాంగం పక్కనపెట్టి… తల్లుల ఆధార్‌కు ఈ కేవైసీ అనుసంధానం లేకపోవడం, ఇతరత్రా సాంకేతిక సమస్యలతోనే జాప్యం జరుగుతోందంటూ దాటవేస్తున్నారు. ఈ కేవైసీ ఆధా రంగా అమ్మఒడి ఖాతాదారులకు ప్రభుత్వం డబ్బులు వేస్తోంది. జగనన్న అమ్మఒడిని తొలుత ఏడు జిల్లాల వారికి పూర్తి స్థాయిలో అందజేసేలా నిర్ణయి ంచినట్లు సమాచారం. ఆ తర్వాత జిల్లాల వారీగా ప్రక్రియ ప్రారంభిస్తారు. దీనికి ఈ కేవైసీ చిక్కులు ఎదురవుతున్నాయి. తల్లుల ఆధార్‌ లింక్‌లో సాంకేతిక సమస్యల వల్ల డబ్బు జమవ్వడం లేదు. జూన్‌ 27వ తేదీలోగా ఈ కేవైసీ చేసిన వారికి జులై మొదటి వారంలోను అనగా ఏడో తేదీ తర్వాత డబ్బులు జమ చేసేలా చూస్తారు. 27వ తేదీ తర్వాత ఈ కేవైసీ చేసిన వారికి జులై రెండో వారంలో డబ్బులు జమయ్యే అవకాశముంది. రెండు వారాలుగా డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అయినా ఇంతవరకు తల్లుల ఖాతాల్లోకి సొమ్ము పడకపోవడంపై నిరుత్సాహం చెందుతున్నారు.
‘ప్రైవేట్‌’ ఫీజుల ఒత్తిళ్లు
జూన్‌ నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో ప్రైవేట్‌ విద్యా సంస్థల యాజమాన్యాలు తల్లిదండ్రులపై ఫీజులు కట్టమని ఒత్తిళ్లు ప్రారంభించాయి. తమకు జగనన్న అమ్మఒడి వచ్చాక ఫీజులు చెల్లిస్తామని వారికి సర్దిచెబుతున్నా, నిరాకరిస్తున్నారు. తల్లిదండ్రులు తమ రోజు వారీ పనులు మానుకుని స్కూళ్ల యాజమాన్యం చుట్టూ తిరిగి, వివరణ ఇచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడిరది. ఫీజులు కడితేనే స్కూళ్లకు అనుమతిస్తామంటూ యాజమాన్యాలు మొండి వైఖరిని అవలంబిస్తున్నాయి. దీంతో తల్లిదండ్రులకు దిక్కుతోచక బయట వడ్డీలకు అప్పులు తెచ్చి పిల్లల ఫీజులు కడుతున్నారు. అమ్మఒడి వచ్చిన వెంటనే వాటిని చెల్లిద్దామనే ఆశతో ఉన్నప్పటికీ, అవి చాలా మందికి ఇంకా జమ కాలేదు. సకాలంలో ఫీజులు చెల్లించని విద్యార్థుల పట్ల ప్రైవేట్‌ స్కూళ్లల్లో వివక్ష చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇంటర్‌ విద్యను నడుపుతున్న పేరొందిన కార్పొరేట్‌ కళాశాలల్లో బలవంతంగా ఫీజులను వసూలు చేస్తున్నారు. ఈ సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి అర్హులైన అందరి ఖాతాల్లో జగనన్న అమ్మఒడి నిధులు జమయ్యేలా చూడాలని తల్లులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img