Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

ఇంకా జలదిగ్బంధమే…

. రంగంలోకి సైన్యం
. బుడమేరు గండి పూడ్చివేతకు విశ్వ ప్రయత్నం
. ఆగని వరద ఉధృతి… బెజవాడ కాలనీల్లో పెరుగుతున్న నీటిమట్టం

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: ఆరు రోజులు గడుస్తున్నా బెజవాడ ఇంకా జల దిగ్బంధంలోనే ఉంది. బుడమేరు గండ్ల పూడ్చివేత ద్వారా నగరాన్ని వరద ముంపునుంచి బయటపడేయాలని ప్రభుత్వం విశ్వప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో గండ్ల పూడ్చివేత కోసం సైన్యాన్ని రంగంలోకి దింపింది. ప్రస్తుతం ముంపుకు కీలకంగా భావిస్తున్న బుడమేరు మూడో గండిని పూడ్చే పనుల్లో సైనిక దళం నిమగ్నమైంది. ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం శాంతినగర్‌ సమీపాన గండి పడిన ప్రాంతానికి 6వ మద్రాస్‌ సైనిక దళం నుంచి 120 మంది సైనిక అధికారులు, జవాన్లు గండి పడిన ప్రాంతానికి తరలివచ్చారు. జోరు వానలోను బుడమేరు గట్టు నిర్మాణం పనుల్లో స్థానిక అధికారులతో కలిసి సైనికులు నిమగ్నమయ్యారు. ఎలాగైనా మూడో గండి వేగవంతంగా పూడ్చాలన్న లక్ష్యంతో అధికార యంత్రాంగం ఉంది. వీలైతే శుక్రవారం రాత్రికే పూర్తి చేసేందుకు శ్రమిస్తున్నారు. వాతావరణం అనుకూలించకుంటే శనివారంతో పనులు పూర్తవుతాయి. ఇప్పటికే రెండు గండ్లను అధికారులు పూడ్చివేయించగా…మిగిలిన మూడో దానికి యుద్ధప్రాతిపదికన పూడ్చివేత పనులు నిర్వహిస్తున్నారు. గండి పడిన ప్రాంతంలో వర్షం పడుతున్నప్పటికీ పనులు కొనసాగుతున్నాయి. ఒక వైపు గండి పూడుస్తూనే..మరోవైపు నీటి ప్రవాహాన్ని కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మచిలీపట్నం నుంచి వచ్చిన పడవలను బుడమేరు గండి పడిన ప్రాంతానికి తరలించి సహాయక చర్యలు నిర్వహిస్తున్నారు. వర్షాలు, భారీ వరదలతో ఎన్టీఆర్‌జిల్లా శాంతినగర్‌ దగ్గర బుడమేరు గట్లకు మూడు గండ్లు పడ్డాయి. ఈ గండ్ల ద్వారా 40వేల క్యూసెక్కుల నీరు తరలిచ్చి విజయవాడ నగర పరిసర ప్రాంతాలను ముంచెత్తింది. ఐదు రోజులపాటు వరద ముంపులోనే ప్రజలు ఉండేలా చేసింది. ప్రజలను నిరాశ్రయిలను చేసింది. ఆహారం, మంచినీరు, ప్రాథమిక సౌకర్యాలు తీర్చుకునే అవకాశం లేకుండా బుడమేరు వరద విలయతాండం చేసింది. శాంతినగర్‌ నుంచి బుడమేరు కవులూరు, పైలూరిపాడు, ఈలప్రోలు, రాయనపాడు చెరువు మీదుగా ప్రవహించి సింగ్‌నగర్‌కు చేరుకుంటుంది. అక్కడి నుంచి నందివాడ మండలం మీదుగా కొల్లేరులో కలుస్తుంది. భారీ వర్షాలతో బుడమేరుకు మూడు గండ్లు పడగా…ఇందులో ఒకదానికి 100 మీటర్లు, మిగిలిన వాటికి 60 మీటర్లు, 50 మీటర్ల పొడవుతో గండ్లు పడ్డాయి. వర్షాలు పడటంతో బుడమేరు గండ్ల పూడికకు ఆటంకం ఏర్పడిరది. సీఎం చంద్రబాబు ఈ గండ్ల పూడిక పనులను మంత్రి నారా లోకేశ్‌, జలవనరులశాఖా మంత్రి నిమ్మల రామానాయుడుకు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే రెండు గండ్ల పనులు పూర్తయ్యాయి. ఇక మిగిలిన 100 మీటర్ల మేర పొడవున్న గండి పూడ్చివేతకు సైన్యాన్ని రప్పించారు. బుడమేరు, కొల్లేరు ప్రాంతాలను సీఎం చంద్రబాబు ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అధ్వర్యంలో పార్టీ ఎంపీ సంతోశ్‌ కుమార్‌తో కూడిన నేతల బృందం వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించింది.
గేబియాన్‌ బుట్టలతో…
గేబియాన్‌ బుట్టల విధానంతో బుడమేరు కట్టకు పడిన గండిని పూడ్చివేయాలని సైనికులు నిర్ణయించారు. ఇందుకోసం రాష్ట్ర అధికారుల పర్యవేక్షణలో పనులు నిర్వహిస్తున్నారు. గేబియాన్‌ బుట్టలు అంటే…ఇనుప చువ్వను బుట్టలా తయారు చేసి, దానిని పెద్ద రాళ్లు, ఇసుక బస్తాలతో నింపుతారు. మొదట గేబియాన్‌ బుట్టలు పేర్చి… తర్వాత రాళ్లు వేస్తారు. ఈ బుట్టలను పటిష్టం చేసేందుకుగాను నాలుగు మీటర్ల వరకు రక్షిత కట్టను నిర్మిస్తారు. గేబియాన్‌ బుట్టల తయారీని ఆర్మీ అధికారుల పర్యవేక్షణలో స్థానికంగా తయారు చేస్తున్నారు. జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పనుల వేగవంతానికి కృషి చేస్తున్నారు. మూడో గండి పూడ్చితేనే బుడమేరు నుంచి విజయవాడకు ముంపు ప్రమాదం తప్పుతుందని భావిస్తున్నారు. బుడమేరు గండ్ల పూడికే తమ లక్ష్యమని, ఆ దిశగా యుద్ధప్రాతిపదికన పనులు కొనసాగిస్తున్నట్లు సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు.
కాలనీల్లో నడుం లోతు నీరు
మళ్లీ బుడమేరు పొంగడంతో సింగ్‌నగర్‌లోని వివిధ కాలనీలకు వరద పెరుగుతోంది. కండ్రిక, వాంబేకాలనీ, ఆంధ్రప్రభకాలనీల్లో ఇంకా నడుంలోతులో నీరుంది. నీటి మట్టం క్రమేపీ పెరుగుతోంది. బయటకు రావాలంటే స్థానిక ప్రజలు నడుం లోతు నీళ్లలో దిగి రావాలి. రామకృష్ణాపురం, రాజరాజేశ్వరిపేట ప్రాంతాల్లోనూ వరద నీటి ప్రవాహం అధికమవుతోంది. దీనివల్ల రాకపోకలకు స్థానికులు అవస్థలు పడుతున్నారు.
మరోవైపు రాయనపాడు వద్ద బుడమేరు ప్రవాహం పెరిగింది. సమీప రైల్వేస్టేషన్‌లో ట్రాక్‌లపైకి వరదనీరు ప్రవహిస్తోంది. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నారు. కాలనీవాసులకు ప్రభుత్వం సహాయ కార్యక్రమాలను ఉధృతం చేసింది. అయితే వైఎస్‌ఆర్‌ కాలనీచుట్టూ నీరు చేరికతో వారు బయటకు వచ్చే అవకాశం లేదు. ఆహారం, మంచినీరు వారి దరిచేరడం లేదు. ఇప్పటివరకు విద్యుత్‌ పునరుద్ధరణ పనులకు ప్రభుత్వం సిద్ధమవ్వగా, మళ్లీ వర్షం పడటంతో వాటికి అంతరాయం కలిగింది. వరద నీరు చేరడంతో పారిశుధ్య పనులకూ అసౌకర్యం కలుగుతోంది. ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద నీటితో కృష్ణాజిల్లా నందివాడ మండలంలోని 12 గ్రామాలు జలదిగ్బంధంలో మునిగిపోయాయి. బుడమేరు వరద కాస్త తగ్గుముఖం పట్టడంతో ఈనెల 5వ తేదీన ప్రజలు తమ నివాసాల్లోకి వెళ్లి బురదను శుభ్రం చేసుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. మళ్లీ కొన్ని ప్రాంతాల్లోకి వరద నీరు ఇంట్లోకి రావడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img