Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ఎన్డీయే కూటమిలో అసమ్మతిరాగం

. బీజేపీ సీనియర్లు సోము వీర్రాజు, మాధవ్‌, విష్ణువర్థన్‌రెడ్డికి మొండిచేయి
. విజయవాడ పశ్చిమలో పోతినకు భంగపాటు
. బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరిపై అసంతృప్తి
. అనపర్తిలో టీడీపీ నేత రామకృష్ణారెడ్డి అనుచరుల నిరసన
. ఆ పార్టీ జెండాలు, కరపత్రాల దహనం

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : రాష్ట్రంలో ఎన్డీయే భాగస్వామ్య పార్టీల్లో అసమ్మతిరాగం ఊపందుకుంది. టీడీపీ, జనసేన, బీజేపీ సీట్ల వ్యవహారం కొలిక్కి రావడంతో నిరసనలు భగ్గుమన్నాయి. పొత్తులో భాగంగా టికెట్లు దక్కని కూటమి అభ్యర్థులు ఆందోళనకు దిగుతున్నారు. అసంతృప్త నేతలంతా ఆధిష్ఠానంపై తిరుగుబాటు చేస్తున్నారు. రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలకుగాను 144 సీట్లలో టీడీపీ, 21 సీట్లు జనసేన, బీజేపీ పది సీట్ల పొత్తుతో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన సీట్లు విడుదల చేశాయి. తాజాగా బీజేపీ పది మంది జాబితా విడుదలతో ఆయా మూడు పార్టీల నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పది అసెంబ్లీ స్థానాల్లో ఆరు సీట్లను వలస వచ్చిన వారికే కేటాయించడంపై మండిపడుతున్నారు. బీజేపీ సీనియర్‌ నేత, ఆ పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, మాధవ్‌, విష్ణువర్థన్‌రెడ్డి, పరిపూర్ణానంద స్వామి తదితరులకు చోటు దక్కలేదు. ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారికే పెద్దపీట లభించింది. ఎంతోకాలం నుంచి బీజేపీకి సేవలందిస్తున్న నేతలకు టికెట్లు దక్కపోవడంతో రగిలిపోతున్నారు. బీజేపీలో చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న వారికే పార్టీ టికెట్లు కేటాయించారన్న విమర్శలున్నాయి. దీనికి నిదర్శనంగా టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చిన సుజనాచౌదరికి, కామినేని శ్రీనివాస్‌కు టికెట్లు ఇవ్వడమేనని స్పష్టంచేస్తున్నారు. బద్వేల్‌ సీటుపైనా బీజేపీ నేతలు నిరసన వ్యక్తంచేస్తున్నారు. అటు ఎంపీల జాబితాలోనూ టీడీపీ ముద్ర ఉన్న

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img