Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

ఏపీకి అంతులేని అన్యాయం

. కేంద్రం తీరుపై రామకృష్ణ ధ్వజం
. మోదీ విద్రోహాన్ని తిప్పికొడదాం: శ్రీనివాసరావు
. బీజేపీతో పొత్తుపెట్టుకున్నవారిని ఓడిస్తాం: చలసాని
. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం దిల్లీలో మహాధర్నా

విశాలాంధ్ర – న్యూదిల్లీ : కేంద్రంలోని మోదీ సర్కారు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి పదే పదే అన్యాయం చేస్తోందని వక్తలు విమర్శించారు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి అధ్వర్యంలో బుధవారం స్థానిక ఏపీ భవన్‌ వద్ద మహా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న వివిధ రాజకీయపార్టీలు, ప్రజాసంఘాల నేతలు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు హోరెత్తించారు. ఏపీకి అన్యాయం చేసిన ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వం డౌన్‌ డౌన్‌ అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. ముందుగా అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలేసి నివాళుర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో తొమ్మిదేళ్లుగా ప్రత్యేక హోదా కోసం, మూడేళ్లుగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని, అమరావతి రాజధాని కోసం నాలుగేళ్లుగా ఆందోళనలు జరుగుతున్నాయని చెప్పారు. అయినా కేంద్ర ప్రభుత్వం తీరు చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లు ఉందని ఎద్దేవా చేశారు. ఐదుకోట్ల మంది ఆంధ్రుల ఆందోళన, ఆవేదనను మోదీ ప్రభుత్వం ఏమాత్రం లెక్కచేయట్లేదన్నారు. రాష్ట్ర విభజన బిల్లులో పొందుపర్చిన ఏ ఒక్కటీ అమలు చేయకుండా రాష్ట్రానికి పదేపదే అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీకి ఎగనామం పెట్టారని దుయ్యబట్టారు. కడప స్టీల్‌ ప్లాంట్‌కు అతీగతీ లేదని, పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని విమర్శించారు. వైజాగ్‌ రైల్వే జోన్‌ పై అబద్ధాలు చెబుతున్నారని, ఉన్న ఉక్కు పరిశ్రమని కూడా ప్రైవేట్‌ పరం చేయడానికి ముందుకు సాగుతున్నారని ధ్వజమెత్తారు. విభజన హామీలు అమలు చేయకుండా ఏపీ ప్రజల నెత్తిపై పెద్ద బండరాయితో కొట్టినట్లుగా మోదీ సర్కారు వైఖరి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ప్రత్యేక హోదా హామీ ఇవ్వలేదని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని, ఎవరో ఇచ్చిన చిట్టీని చదవడానికి మోదీ అమాయకుడా? అని ప్రశ్నించారు. పార్లమెంట్‌లో పదేళ్ల ప్రత్యేక హోదా కావాలని డిమాండ్‌ చేసిన వెంకయ్యనాయుడికి నోరు పడిపోయిందా? అని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే వరకు పోరాటం ఆగదన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేట్‌పరం చేసి, ఏపీకి ప్రధాని మోదీ చేసే విద్రోహాన్ని, వెన్నుపోటును రాష్ట్ర ప్రజలు తిప్పికొట్టాలన్నారు. ఇంత దారుణం జరుగుతుంటే వైసీపీ, టీడీపీ నేతలు జాతర చూసినట్లు చూస్తున్నారని విమర్శించారు. ఈ రెండు పార్టీలు బీజేపీ చుట్టూ తిరుగుతూ తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బకొడుతున్నాయని ధ్వజమెత్తారు. రాజ్యసభలో బీజేపీకి పూర్తి మెజార్టీ లేదని, వైసీపీ మద్దతుతోనే రాజ్యసభలో పది బిల్లులు ఆమోదం పొందాయన్నారు. వ్యవసాయ చట్టాల నుంచి రాష్ట్రపతి ఎన్నికల వరకు అన్ని సందర్భాల్లో బీజేపీకి వైసీపీ మద్దతు ఇచ్చిందని విమర్శించారు. నాడు ధర్మ పోరాట దీక్షలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు… ఇప్పుడు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కలుస్తున్నారని, ఎందుకు కలుస్తున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేసుల కోసమా? రాజకీయ పొత్తుల కోసమా? స్పష్టం చేయాలన్నారు.
ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు మాట్లాడుతూ పదేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌ హక్కుల కోసం, ఆంధ్రుల ఆత్మ గౌరవం కోసం దిల్లీ గడ్డపై పోరాటం చేశామని తెలిపారు. ఈ పోరాటం ఏ ఒక్కరి కోసమో చేయటం లేదని, రాష్ట్ర భావితరాల కోసం, యువత కోసం చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఉద్యమానికి మొదటి నుంచి వామపక్షాలు అండగా ఉన్నాయన్నారు. మోదీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని, కొత్త ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నామని అన్నారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం నమ్మక ద్రోహం, నయ వంచన చేసిందని విమర్శించారు. పన్నులు, పారిశ్రామిక ప్రోత్సాహకాలు, బుల్లెట్‌ ట్రైన్‌, పరిశ్రమలు వంటివన్నీ గుజరాత్‌ కే ఇస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ ఆకాంక్షలను నెరవేర్చని బీజేపీతో పొత్తు పెట్టుకున్న వారిని చిత్తుగా ఓడిస్తామని అన్నారు. ఆనాడు ధర్మ పోరాటం చేసిన చంద్రబాబు అధర్మం వైపు ఉండొద్దని హితవు పలికారు. బీజేపీ విష కౌగిలి నుంచి పవన్‌ కల్యాణ్‌ బయటకు రావాలని కోరారు. తెలంగాణకి కూడా విభజన హామీలు అమలు కాలేదని, తెలంగాణ ముఖ్యమంత్రి కూడా పోరాడాలని సూచించారు. ప్రత్యేక హోదా వచ్చే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. జై భారత్‌ నేషనల్‌ పార్టీ అధ్యక్షులు వీవీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ… రామరాజ్యం గురించి మాట్లాడే వారు ధర్మాన్ని నిలబెట్టాలన్నారు. ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంట్‌లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామన్న వారే హామీని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14 ఆర్థిక సంఘం ఎక్కడా చెప్పలేదని 15వ ఆర్థిక సంఘం చైర్మన్‌ ఎన్‌కే సింగ్‌ రాసిన పుస్తకంలో తెలిపారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కే ప్రసన్న, ఏ అశోక్‌, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు రాము, ఉపాధ్యక్షులు జయచంద్ర, శివకుమార్‌, ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి నేత ప్రొఫెసర్‌ సదాశివ రెడ్డి, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్లు జే అయోధ్యరామ్‌, డీ ఆదినారాయణ, అమ్‌ఆద్మీ ఏపీ ఇన్‌చార్జ్‌ మునినాయక్‌ తదితర నాయకులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img