Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

జగన్‌తో అవినాశ్‌రెడ్డి మంతనాలు

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని కడప వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డి గురువారం తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో కలిశారు. వివేకా హత్య కేసులో ఇటీవల సీబీఐ కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేసింది. చార్జిషీట్‌లో అనేకమంది సాక్షులను, వారిచ్చిన వాంగ్మూలాలను సీబీఐ వెల్లడిరచింది. ఈ నేపథ్యంలో సీఎంతో అవినాశ్‌రెడ్డి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అవినాశ్‌రెడ్డి తండ్రి భాస్కరరెడ్డి ప్రస్తుతం చంచల్‌గూడా జైలులో ఉన్నారు. వివేకా కేసులో అవినాశ్‌రెడ్డిది కీలకపాత్రగా సీబీఐ భావిస్తోంది. తండ్రీ కొడుకులిద్దరూ ఈ కేసులో 8, 9 నిందితులుగా ఉన్నారు. ముఖ్యమంత్రి సోదరి షర్మిల సైతం ఈ కేసులో 189వ సాక్షిగా సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. వివేకానందరెడ్డిది కచ్చితంగా రాజకీయ హత్యేనని ఆమె స్పష్టం చేశారు. ఎంపీ సీటు విషయమై రెండు కుటుంబాల మధ్య నెలకొన్న విబేధాలు, ఇతర అంశాలను సీబీఐ సేకరించింది. ఈ పరిస్థితుల్లో అవినాశ్‌రెడ్డి ముఖ్యమంత్రితో ఏకాంతంగా సమావేశం కావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.
సీఎంతో భూమన, బాలినేని భేటీ
ముఖ్యమంత్రిని క్యాంపు కార్యాలయంలో అవినాశ్‌రెడ్డి తర్వాత శాసనసభ్యులు భూమన కరుణాకరరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి విడివిడిగా కలిశారు. వచ్చే నెల 12వ తేదీతో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ పదవీకాలం ముగుస్తుంది. ప్రస్తుతం భూమన టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ఉన్నారు. టీటీడీ చైర్మన్‌గా ఇప్పటికే సుబ్బారెడ్డిని రెండోసారి కొనసాగించిన నేపథ్యంలో, ఈసారి భూమన ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై ముఖ్యమంత్రిని కలిసినట్లు సమాచారం. ఇటీవల అలకబూనిన బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా సీఎంను కలిశారు. నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు, రాజకీయంగా తన నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను సీఎం దృష్టికి తెచ్చినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img