Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

జైల్‌ భరో ఉద్రిక్తం

ఎస్మా ప్రయోగంపై కార్మిక సంఘాల ఆగ్రహం

. అంగన్‌వాడీల ఆందోళన మరింత ఉధృతం
. ముఖ్యనేతల అరెస్టు, విడుదల
. బెదిరింపులకు తలొగ్గం: ఓబులేసు, రవీంద్రనాథ్‌
. చరిత్ర సృష్టించేలా ఉద్యమం: ఈశ్వరయ్య
. ఇక రాజకీయ పోరాటమే: జంగాల

విశాలాంధ్ర బ్యూరో`విజయవాడ/కడప/గుంటూరు: అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం ఎస్మా ప్రయోగించి బెదిరింపులకు దిగడాన్ని వ్యతిరేకిస్తూ కార్మికసంఘాలు మంగళవారం చేపట్టిన జైల్‌ భరో కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. చిన్నారులను తల్లిలా లాలించే అంగన్‌వాడీ కార్మికులపై బ్రిటీష్‌ కాలం నాటి ఎస్మాను ప్రయోగించటంపై కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. కనీస వేతనం రూ.26వేలు, గ్రాట్యుటీ తదితర డిమాండ్లు సాధించుకోవటం కోసం 29 రోజులుగా అంగన్‌వాడీలు కొనసాగిస్తున్న నిరవధిక సమ్మెకు కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు మద్దతు ప్రకటిస్తూ ‘జైల్‌ భరో’ చేపట్టాయి. ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ తదితర కార్మిక సంఘాల అధ్వర్యంలో విజయవాడ లెనిన్‌ సెంటర్‌ నుంచి ధర్నా చౌక్‌ వద్ద నిరసన దీక్ష చేస్తున్న అంగన్‌వాడీలకు సంఫీుభావం ప్రకటించేందుకు భారీ ర్యాలీతో బయలుదేరారు. అప్పటికే పెద్దసంఖ్యలో మోహరించిన పోలీసు బలగాలు వారిని అడ్డుకునేందుకు యత్నించాయి. కార్మిక సంఘాల నేతలను పోలీసులు అడ్డగించి అరెస్టు చేసేందుకు యత్నించగా, కార్యకర్తలు ప్రతిఘటించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రావులపల్లి రవీంద్రనాథ్‌, జి.ఓబులేసు మాట్లాడుతూ సమ్మె చేస్తున్న అంగన్‌వాడీ వర్కర్లను భయభ్రాంతులకు గురి చేసేందుకు ప్రభుత్వం పూనుకుందని మండిపడ్డారు. ఎస్మాను ఏఏ రంగాల వారిపై ప్రయోగించాలో కూడా వైసీపీ ప్రభుత్వానికి తెలియదన్నారు. ఎవరూ ఉద్యమం చేయకుండా హక్కులు కాలరాసేలా అందరిపై ఎస్మాను ప్రయోగిస్తున్నదని విమర్శించారు. జగన్‌ ప్రభుత్వం బెదిరింపులకు తలొగ్గేది లేదన్నారు. అంగన్‌వాడీ మహిళలు ధైర్యంగా సమ్మె కొనసాగించటాన్ని వారు అభినందించారు. సమ్మె విచ్ఛిన్నానికి చేసే కుటిల ప్రయత్నాలను విరమించుకుని అంగన్‌వాడీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అరెస్టు అయిన వారిలో ఆర్‌.రవీంద్రనాథ్‌, జి.ఓబులేసు, సీఐటీయూ రాష్ట్ర నాయకులు ఏవీ నాగేశ్వరరావు, ధనలక్ష్మి, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి పి.ప్రసాద్‌, ఎ.రవిచంద్ర, ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు జి.కోటేశ్వరరావు, విజయవాడ నగర నాయకులు నక్కా వీరభద్రరావు, మూలి సాంబశివరావు, తెడ్డు వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్‌ మహిళా సమాఖ్య విజయవాడ నగర అధ్యక్షురాలు ఓర్సు భారతి, ప్రధాన కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ, నాయకులు డి.సీతారావమ్మ తదితరులు ఉన్నారు. అరెస్టు అయిన కొందరు నాయకులను కృష్ణలంక పోలీసు స్టేషన్‌కు, మరికొందరిని ప్రైవేటు కల్యాణమంట పానికి తరలించారు. మధ్యాహ్నం విడుదల చేశారు. దీక్షా శిబిరంలో అంగన్‌వాడీ వర్కర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.లలితమ్మ, అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌.సుబ్బరావమ్మ, సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ నాయకులు ప్రసంగించారు.
జగన్‌ నియంతృత్వానికి నిదర్శనం: ఈశ్వరయ్య
లక్షల మంది అంగన్‌వాడీలు, మున్సిపల్‌ వర్కర్లు, సర్వ శిక్ష అభియాన్‌, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులు సమ్మెలతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తుంటే జగన్‌ సర్కారు పరిష్కరించకపోగా ఎస్మా ప్రయోగించడం సీఎం జగన్‌ నిరంకుశ వైఖరిని తేటతెల్లం చేస్తోందని ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌,హెల్పర్స్‌ అసోసియేషన్‌(ఏఐటీయూసీ) గౌరవాధ్యక్షుడు జి.ఈశ్వరయ్య విమర్శించారు. కడప కలెక్టర్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీల రిలే దీక్షలో ఈశ్వరయ్య మాట్లాడుతూ కార్మికవర్గం ఆర్థిక సమ్మెగా ప్రారంభించిన ప్రతి సందర్భంలో రాజకీయ పోరాటంగా మారుతున్నట్లు చరిత్ర రుజువు చేసిందని గుర్తు చేశారు. చర్చల పేరిట కాలయాపన చేయకుండా చిత్తశుద్ధితో ఆలోచన చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ విధానంలో భాగంగా నిర్బంధ విధానాన్ని తీవ్రతరం చేసే అవకాశం లేకపోలేదని, ఎస్మాను ప్రయోగించి ఆందోళనలు, నిరసనలను, ధర్నా శిబిరాలను పోలీసు ద్వారా భగ్నం చేసే అవకాశం ఉందన్నారు. ఈ కొత్త రాజకీయ దాడిని ఎదుర్కోవడానికి అంగన్‌వాడీల సమ్మెను మరింత విస్తృత, విశాల రాజకీయ పోరాటంగా మార్చాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర కార్మిక సంఘాల సహకారం తీసుకొని…ప్రతిపక్షాల, ప్రజాతంత్ర శక్తుల మద్దతు కూడగట్టి రాష్ట్ర బంద్‌ వంటి రాజకీయ పోరాట రూపాలు గూర్చి జేఏసీ సమాలోచన చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్‌.నాగ సుబ్బారెడ్డి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్‌, ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ సెక్రటరీ బాదుల్లా, నగర ప్రధాన కార్యదర్శి మద్దిలేటి, సీఐటీయూ నగర ప్రధాన కార్యదర్శి వెంకటసుబ్బయ్య, డీవైఎఫ్‌ఐ నగర కార్యదర్శి ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.
ఇక రాజకీయ పోరాటమే: జంగాల
ఇప్పటివరకు కార్మిక పోరాటంగా జరిగిన అంగన్‌వాడీల పోరాటం ఇక నుంచి రాజకీయ పోరాటంగా మారుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జంగాల అజయ్‌కుమార్‌ అన్నారు. అంగన్‌వాడీలపై ఎస్మాను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ కార్మిక, ప్రజా సంఘాలు చేపట్టిన జైల్‌భరో కార్యక్రమంపై ప్రభుత్వం నిర్బంధం ప్రయోగించింది. నాయకులను బలవంతంగా అరెస్ట్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తొలుత గుంటూరు మార్కెట్‌ సెంటర్‌ నుంచి శంకర్‌ విలాస్‌ సెంటర్‌ వరకు వివిధ కార్మిక సంఘాల నాయకులు నిరసన ప్రదర్శన చేశారు. అప్పటికే శంకర్‌విలాస్‌ సెంటర్‌లో పోలీసులు భారీగా మోహరించారు. అక్కడికి చేరుకున్న కార్మిక సంఘాల నాయకులు శంకర్‌విలాస్‌ బ్రిడ్జి వద్ద రాస్తారోకో చేపట్టారు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్‌ నిలిచిపోయింది. రాస్తారోకో కార్యక్రమం వద్దకు చేరుకున్న పోలీసులు నాయకులను బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి నల్లపాడు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా జంగాల అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ కార్మికవర్గం పట్ల దుర్మార్గ వైఖరి అవలంబిస్తున్న జగన్‌ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడం ఖాయమని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img