Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

వైసీపీలో రాజ్యసభ గుబులు

. కలవరపెడుతున్న అసంతృప్తుల వ్యవహారం
. క్రాస్‌ ఓటింగ్‌ జరగవచ్చని అనుమానం
. మాక్‌ పోలింగ్‌కు యోచన

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికల వ్యవహారం అధికార వైసీపీలో గుబులు రేపుతోంది. మూడు రాజ్యసభ స్థానాలను గెలుచుకునేందుకు అవసర మైన ఎమ్మెల్యేల బలం ఉన్నప్పటికీ క్రాస్‌ ఓటింగ్‌ జరుగుతుందని కలవరం చెందుతోంది. ఎమ్మెల్యేల సంఖ్యాపరంగా చూస్తే… మూడు రాజ్యసభ స్థానా లను వైసీపీ కైవసం చేసుకునే అవకాశాలు అధి కంగా ఉన్నాయి. అయితే వైసీపీ ఇన్‌చార్జిల, మార్పులు చేర్పులతో టికెట్లు దక్కని వారు, ఇంతకు ముందే పార్టీని వీడినవారు, ఇతరత్రా కారణాలతో మరికొంతమంది దాదాపు 25 మందికిపైగా పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. ఇది గమనిం చిన టీడీపీ వ్యూహాత్మకంగా ఒక స్థానానికి తమ పార్టీ నుంచి అభ్యర్థిని పోటీ పెట్టేందుకు సిద్ధమై నట్లు సమాచారం. ఇటీవల టీడీపీ అధినేత చంద్ర బాబు నివాసంలో జరిగిన పొలిట్‌బ్యూరో సమా వేశంలో రాజ్యసభకు పోటీ చేసే అంశంపై చర్చిం చినట్లు తెలిసింది. కాగా పోటీపై టీడీపీ అధికారి కంగా వెల్లడిరచాల్సి ఉంది. ఏప్రిల్‌ 3వ తేదీన రాష్ట్రానికి చెందిన రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి(వైసీపీ), కనకమేడల రవీంద్ర కుమార్‌ (టీడీపీ), సీఎం రమేశ్‌ (బీజేపీ) పదవీ కాలం ముగియనుంది. ఆయా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ప్రస్తుతమున్న సంఖ్యా బలం ఆధా రంగా ఒక్కో రాజ్యసభ స్థానానికి 44 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరముంది. దీని ఆధారంగా వైసీపీ మూడు స్థానాలు దక్కించుకునేందుకుగాను 132 ఎమ్మెల్యేలు కావాలి. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించారు. పార్టీ ఫిరాయింపులపై అందిన ఫిర్యాదుల మేరకు టీడీపీ, వైసీపీకి చెందిన రెబల్‌ ఎమ్మెల్యేలకు స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ నోటీసులు జారీజేశారు. వారందరిపైన అనర్హత వేటు వేస్తే, వారు రాజ్యసభ ఎన్నికల్లో ఓట్లు వేసే అర్హతను కోల్పోతారు. దీంతో రాజ్యసభ స్థానాల ఓటింగ్‌కు మొత్తం ఎమ్మెల్యేల సంఖ్యాబలం తగ్గుతుంది. ఈనెల 8వ తేదీన రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీచేయను న్నారు. నామినేషన్‌ దాఖలకు ఈనెల 15వరకు గడువు ఉంటుంది. ఈనెల 27న పోలింగ్‌ నిర్వహించి, అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు. ఇప్పటికే మూడు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను బరిలో దించుతామని వైసీపీ ప్రకటించింది. ఈలోగా తమ ఎమ్మెల్యేలతో మాక్‌ పోలింగ్‌ పెట్టే ఆలోచనలో వైసీపీ అధిష్ఠానం ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img