Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

భారత్‌ బంద్‌ విజయవంతం

ఎస్‌కేఎం, బీకేయూ, సీటీయూల పిలుపునకు ఆదరణ


. చక్కా జామ్‌తో దేశవ్యాప్తంగా స్తంభించిన రవాణా
. ప్రధాన రహదారులు దిగ్బంధనం
. వాణిజ్య, విద్యాసంస్థల మూత
. జంతర్‌ మంతర్‌ వద్ద సీపీఐ, ఏఐటీయూసీ ప్రదర్శన
. తక్షణమే డిమాండ్ల పరిష్కారానికి రైతన్నల డిమాండ్‌

న్యూదిల్లీ : సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం), భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ), కేంద్ర కార్మిక సంఘాల (సీటీయూ) పిలుపు మేరకు శుక్రవారం నిర్వహించిన భారత్‌ బంద్‌ విజయవంతమైంది. కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కి చట్టబద్ధతతో పాటు పెండిరగ్‌ డిమాండ్ల సాధన కోసం అన్నదాతలు దేశవ్యాప్తంగా ర్యాలీలు, ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించారు. ప్రముఖ విద్యావేత్తలు, మేధావులు మద్దతు ప్రకటించారు. డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని రైతన్నలు నినాదాలు చేశారు. కేంద్రప్రభుత్వ రైతుకార్మికప్రజా వ్యతిరేక విధానాలను దుయ్యబట్టారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో మోదీ సర్కార్‌ విఫలమైందని ఆరోపించారు. అన్ని రాష్ట్రాల్లో రైతు`కార్మిక సంఘాల అధ్వర్యంలో బంద్‌ జయప్రదమైంది. జమ్మూకశ్మీర్‌లోని లాల్‌చౌక్‌ వద్ద కార్మిక సంఘాల ఆందోళనను పోలీసులు అడ్డుకొని, 50 మంది నాయకులను అరెస్టుచేశారు. కార్మిక సంఘాలు, బ్యాంకుల సమాఖ్యలతో కలిసి భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) అధ్వర్యంలో దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ప్రదర్శన జరిగింది. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, కార్యదర్శులు కె.నారాయణ, అజీజ్‌ పాషా, పార్టీ దిల్లీ సమితి కార్యదర్శి ప్రొఫెసర్‌ దినేశ్‌ వర్షనే, కార్యదర్శివర్గ సభ్యుడు శంకర్‌లాల్‌, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి అమర్‌జిత్‌ కౌర్‌తో పాటు ఇతర కార్మిక నాయకులు పాల్గొన్నారు. భారత్‌ బంద్‌లో భాగంగా మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటల వరకు చక్కాజామ్‌ జరిగింది. దీంతో ప్రజా రవాణా స్తంభించింది. వ్యవసాయ కార్యకలాపాలు, గ్రామీణ ఉపాధి పనులు నిలిచిపోయాయి. ప్రైవేటు కార్యాలయాలు, దుకాణాలు, వ్యాపార సముదాయాలు, పరిశ్రమలు, సేవా రంగ సంస్థలు మూతబడ్డాయి. ప్రధాన రహదారులను అన్నదాతలు దిగ్బంధించారు. స్వామినాథన్‌ సిఫార్సుల మేరకు కనీస మద్దతు ధర కల్పన, ఎంఎస్పీకి చట్టబద్ధత, రుణమాఫీ, సమగ్ర పంటల బీమా, పింఛన్లు, లఖింపూర్‌ బాధితులకు న్యాయం, ఉద్యమం సమయంలో నమోదైన కేసుల ఉపసంహరణ వంటివి రైతులు ప్రధానంగా డిమాండ్‌ చేస్తున్నారు. గ్రామీణ భారత్‌ బంద్‌, పారిశ్రామిక సమ్మెకు ప్రముఖ మేధావుల సంయుక్త ప్రకటనలో మద్దతు ప్రకటించారు.
దిల్లీ ఎన్‌సీఆర్‌ సరిహద్దులు ముఖ్యంగా సింఘు (దిల్లీహరియాణా), ఘాజీపూర్‌, టిక్రీ (దిల్లీహరియాణా) వద్ద ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. పంజాబ్‌, హరియాణా, దిల్లీ, ఉత్తరప్రదేశ్‌తో పాటు ఉత్తరదక్షిణాది రాష్ట్రాల్లో భారత్‌ బంద్‌ విజయవంతమైంది. గ్రామాలు, పట్టణాలలో కార్యకలాపాలు స్తంభించిపోయాయి. భారతీయ కిసాన్‌ యూనియన్‌ (చారుణి), భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ), బీకేయూ (రాజేవాల్‌), బీకేయూ (దాకుండా), బీకేయూ (లోఖోవల్‌), బీకేయూ (క్యాడియన్‌), కీర్తి కిసాన్‌ యూనియన్‌, హరియాణా పంజాబ్‌ రోడ్‌వేస్‌, పన్‌బస్‌, పీఆర్టీసీ ఒప్పంద కార్మిక సంఘంతో పాటు అనేక రైతు, కార్మిక సంఘాల నేతృత్వంలో బంద్‌ విజయవంతమైంది. పంజాబ్‌, గోలూ కా మోర్‌ గ్రామంలోని ఫిరోజ్‌పూర్‌ఫజిలా రోడ్డు, ఎన్‌హెచ్‌54పై బంగాలీవాలా బ్రిడ్జి, మఖు ప్రాంతం, తల్వాడి భాయి అండర్‌బ్రిడ్జిని రైతులు దిగ్బంధించారు. అమృత్‌సర్‌లో శిరోమణి గురుద్వారా పర్బందక్‌ కమిటీ (ఎస్‌జీపీసీ) విద్యాసంస్థలను మూసివేశారు. అన్ని దుకాణాలు మూతపడినట్లు సబ్జి మండీ అర్థియా అసోసియేషన్‌ అధ్యక్షుడు అశోక్‌ పస్రీచా తెలిపారు. త్వరలో పరీక్షలు ఉన్నందున టెన్త్‌, ట్వెల్త్‌ తరగతులు మినహా అన్ని తరగతులకు సెలవు ప్రకటించి, పాఠశాలలు మూసివేసినట్లు రికగ్నౖౖెజ్డ్‌, అఫ్లియేటెడ్‌ స్కూల్స్‌ అసోసియేషన్‌ (ఆర్‌ఏఎస్‌ఏ) అధ్యక్షుడు నరీందర్‌ సింగ్‌ కేశర్‌ తెలిపారు. ‘మా హక్కుల కోసం పోరాడుతున్నాం’ అని రైతు నాయకులు హర్భస్‌ సింగ్‌, బల్బీర్‌ సింగ్‌ రాజేవాల్‌ అన్నారు.
భవిష్యత్‌ కార్యాచరణపై నేడు భేటీ: తికైత్‌
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లోని బగోవలి వద్ద జరిగిన ఆందోళనలో బీకేయూ జాతీయ అధికార ప్రతినిధి రాకేశ్‌ తికైత్‌ పాల్గొన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల అమలు, రైతులకు రుణమాఫీ తదితర డిమాండ్లు చేస్తున్నామన్నారు. రైతుల పిలుపు మేరకు బంద్‌కు అన్ని వర్గాల నుంచి మంచి స్పందన లభించిందని, దుకాణదారులు స్వచ్ఛందంగా పాల్గొన్నారని తెలిపారు. దిల్లీ వెళతారా అని విలేకరి ప్రశ్నించగా ‘శనివారం ముజఫర్‌నగర్‌లోని సిసౌలీలో సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణను నిర్ణయిస్తామని తికైత్‌ బదులిచ్చారు. దిల్లీ`డెహ్రాడూన్‌ జాతీయ రహదారి దిగ్బంధనంలో ఆయన పాల్గొన్నారు. ఇదిలావుంటే బిజ్నోర్‌, భాగ్‌పట్‌ జిల్లాల్లో బీకేయూ నేతలు సోను చౌదరి, ప్రతాప్‌ సింగ్‌ గుర్జర్‌ అధ్వర్యంలో ఆందోళనలు, దిగ్బంధాలు జరిగాయి. రైతులకు మద్దతుగా చక్కెర సేకరణ కేంద్రాలను మూసివేశారు. కాగా, రైతుల ఆందోళనతో ఒక్క దిల్లీలోనే రూ.300 కోట్ల నష్టం వాటిల్లినట్లు కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆలిండియా ట్రేడర్స్‌ (సీఏఐటీ) ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ ఖండేల్‌వాల్‌ అంచనా వేశారు.
జమ్మూకశ్మీర్‌లో 50 మంది కార్మిక నేతలు అరెస్టు
భారత్‌ బంద్‌లో భాగంగా జమ్మూకశ్మీర్‌లో 50 మంది కార్మిక నేతలు అరెస్టుకు గురయ్యారు. రైతులు, కార్యకర్తలను ప్రతాప్‌ పార్క్‌ వద్ద నుంచి కోఠిబాగ్‌ పోలీసు స్టేషన్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ అరెస్టులను సీపీఎం నేత ఎంవై తరిగమి ఖండిరచారు. యాపిల్‌ రైతుల సమాఖ్య, స్కీమ్‌ వర్కర్లు, సీఐటీయూ నేతలు శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పోలీసులు బలవంతంగా అరెస్టు చేయడం ఆక్షేపణీయమని ఆయన ఎక్స్‌ మాధ్యమంగా ఖండిరచారు. కుల్గామ్‌ జిల్లా డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ (డీడీసీ) చైర్మన్‌ మహమ్మద్‌ అఫ్జల్‌, యాపిల్‌ ఫార్మర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు జహూర్‌ అహ్మద్‌, ప్రధాన కార్యదర్శి అబ్దుల్‌ రషీద్‌ను అక్రమంగా అరెస్టు చేసి బలవంతంగా పోలీసు వాహనాల్లో ఎక్కించారని, ఖాకీల చర్య ప్రజాస్వామ్యం, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అని తరీగమి పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img