Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

బీజేపీ అడ్డదారులు

. విపక్ష కూటమిని చీల్చే కసరత్తు
. జిత్తులు`ఎత్తులతో ముందుకు
. ఫిరాయింపులకు ప్రోత్సాహం
. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌

న్యూదిల్లీ : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో గెలుపే లక్ష్యంగా బీజేపీ అడ్డదారులు తొక్కుతోంది. ప్రతిపక్ష కూటమిని చీల్చేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. ఉన్న ప్రతి అవకాశాన్ని వాడుకుంటోంది. జిత్తులుఎత్తులు ప్రదర్శిస్తూ లేని అవకాశాలు సృష్టించుకుంటూ ధనకండ బలానికి తోడు ప్రలోభాల ద్వారా ఇండియా కూటమిని బలహీనపర్చేందుకు యత్నిస్తోంది. ఏదో ఒక విధంగా మూడోసారి అధికారంలోకి రావాలని, దేశాన్ని ఏలాలని కాంక్షిస్తోంది. ప్రతిపక్ష పార్టీల నేతలను బెదిరించో… భయపెట్టో… ప్రలోభపెట్టో… ఆశచూపో తమ వైపునకు తెచ్చుకోవాలని చూస్తోంది. ఇందుకు మంగళవారం రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ జరగడమే నిదర్శనం. హిమాచల్‌ ప్రదేశ్‌లో ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్రులు, ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేల క్రాస్‌ ఓటింగ్‌ ద్వారా 16 ఓట్లు బీజేపీ ఖాతాకు చేరుకున్నాయి. దీంతో ఆ పార్టీకి ప్రతి రాష్ట్రంలో అదనంగా ఒక స్థానం దక్కే అవకాశాలకు తోడు లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు విశ్వాసాన్ని మరింత పెంచినట్లైంది. కర్నాటకలోనూ క్రాస్‌ ఓటింగ్‌ జరిగినట్లు తెలుస్తోంది. ఓట్లు చీల్చేందుకు బీజేపీ మిత్రపక్షమైన జనతా దళ్‌ (సెక్యూలర్‌) ఐదో అభ్యర్థిని నిలబెట్టింది. తాజా పరిణామాణంతో అన్ని రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో కలిసి సీట్ల ఒప్పందాలు చేసుకుంటూ ముందుకెళుతున్న ఇండియా కూటమికి ఎదురు దెబ్బ తగిలింది. దిల్లీ, ఉత్తరప్రదేశ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌), సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)తో కాంగ్రెస్‌ సీట్ల సర్దుబాటు పూర్తి అయ్యింది. అలాగే, మహారాష్ట్రలో శివసేన (యూబీటీ), నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (శరద్‌ చంద్ర ప్రవార్‌), బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌తో చర్చలు తది దశకు చేరుకున్నాయి. దీంతో నయా జోష్‌తో మంగళవారం రాజ్యసభ ఎన్నికలను ఎదుర్కొన్న ఇండియా కూటమికి క్రాస్‌ ఓటింగ్‌ రూపేణ అవాంతరం ఎదురైంది. బీజేపీ బలవంతంగా ఎన్నికలు జరిపించిన మూడు రాష్ట్రాల్లో రెండిరటిని ఆ పార్టీ కైవసం చేసుకుంది. రాజ్యసభలో అదనంగా రెండు స్థానాలను కూడా గెలచుకోగలిగింది. ఇది ఎన్డీయేకు కలిసివచ్చే అంశమే కాగా ఇండియా కూటమికి ఎదురు దెబ్బ. రెండేళ్ల కిందట హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి రాజ్యసభ ఎన్నికలను కాంగ్రెస్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. 68 అసెంబ్లీ స్థానాల్లో 40 స్థానాలను ఒంటరిగా గెలుచుకుంది. బీజేపీని 25 సీట్లకు పరిమితం చేసింది. ఈసారి పోలింగ్‌లో ఒక్క స్థానమే ఖాళీ కాగా బెంగాల్‌ స్థానం నుంచి పదవీ కాలం ముగుస్తుండటంలో అభిషేక్‌ సింఫ్వీుని కాంగ్రెస్‌ బరిలోకి దింపింది. హిమాచల్‌ ప్రదేశ్‌ ఎంపీగా రాజ్యసభకు ఎన్నిక కావాలంటే ఆయనకు కేవలం 35 ఓట్లు అవసరం. కానీ ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు (ముగ్గురు స్వతంత్రులు కూడా) బీజేపీ అభ్యర్థికి ఓటేయడంతో రెండు పక్షాలకు 34 చొప్పున ఓట్లు వచ్చాయి. దీంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం మైనారిటీగా మారిందని చెబుతూ బలపరీక్ష కోసం కసరత్తును బీజేపీ మొదలు పెట్టింది. సగం పదవీ కాలం కూడా పూర్తి కాకుండానే ప్రభుత్వాన్ని కూల్చేందుకు యత్నిస్తోంది. ఉత్తరప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు 10 స్థానాలు ఉండగా ఏడిరటిని బీజేపీ అట్టిపెట్టుకున్నది. 252 మంది ఎమ్మెల్యేలతో పాటు 18 మిత్రపక్షాల ఓట్లు బీజేపీకి ఉన్నాయి. మరోవైపు సమాజ్‌వాదీ పార్టీకి 108 మంది సభ్యులతో పాటు కొందరు మిత్రపక్షాల మద్దతుతో మూడు స్థానాల్లో గెలవాలనుకుంది కానీ బీజేపీ ఎనిమిదో స్థానాన్ని లాక్కున్న పరిస్థితి ఏర్పడిరది.
సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యేలు ఏడుగురు క్రాస్‌ ఓటింగ్‌లో పాల్గొనడం, రాష్ట్రీయ లోక్‌దళ్‌ మద్దతుతో ఇది సాధ్యమైంది. ప్రస్తుతానికి ఇండియా కూటమిలో ఉన్న ఆర్‌ఎల్‌డీ త్వరలోనే ఎన్డీయేలో చేరబోతోందని తెలుస్తోంది. ఇక దక్షిణాది రాష్ట్రమైన కర్నాటకలో నాలుగు స్థానాలలో మూడిరటిని సునాయాశంగా గెలుస్తామని అధికార కాంగ్రెస్‌ భావించింది. మిగిలిన ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోవాలనుకున్నది. ఈ పార్టీకి 134 మంది ఎమ్మెల్యేల ఉంటే బీజేపీ`జేడీఎస్‌కు కలిపి 85 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. కానీ ఇక్కడ కూడా బీజేపీ వ్యూహరచన చేసింది. తన స్థానాన్ని దక్కించుకోవాలంటే బీజేపీకి 45 ఓట్లు కావాల్సి ఉండగా జేడీఎస్‌… కుపేంద్ర రెడ్డిని పోటీలో నిలబెట్టి ఆట ఆడిరది. కానీ బీజేపీ ఎమ్మెల్యే ఎస్టీ సోమశేఖర్‌ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓటు వేశారు. ఈ విషయాన్ని ఆయన పార్టీ ధ్రువీకరించింది. చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. దేశ్యాప్తంగా మిగిలిన 41 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img