Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

ఇప్పట్లో ‘జమిలి’కుదరదు

. చాలా కొత్త ఈవీఎంలు కావాలి
. 15 ఏళ్లకు రూ.10 వేల కోట్లు ఖర్చు: ఈసీ

న్యూదిల్లీ : దేశంలో జమిలి ఎన్నికలపై పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. జమిలి ఎన్నికలు జరిపించాలని మోదీ కంకణబద్ధులై ఉండగా… వద్దని ప్రతిపక్షాలు ముక్తకంఠంతో నినదిస్తున్నాయి. పార్లమెంటరీ వ్యవస్థకు, రాజ్యాంగానికి, ఫెడరలిజానికి ఈ ప్రక్రియ పూర్తిగా విరుద్ధమని, పార్లమెంటరీ స్ఫూర్తికి వ్యతిరేకంగా జమిలి ఎన్నికలు నిర్వహిస్తే తీరని నష్టం జరుగుతుందని చెబుతున్నాయి. ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు జరిపించడం ద్వారా ఖజానాపై పెద్దగా భారం ఉండదని, మొత్తం బడ్జెట్‌లో 0.02శాతంగానే ఎన్నికల వ్యయం ఉంటుందన్నాయి. కానీ ఎలాగైనా జమిలి ఎన్నికలు జరిపించాలని మోదీ ప్రభుత్వం సంకల్పించింది. వీటిని సమర్థించుకుంటూ ప్రకటనలు చేస్తోంది. అటు ఎన్నికల కమిషన్‌ కూడా కేంద్రానికి వత్తాలు పలుకుతోంది. జమిలి ఎన్నికల నిర్వహణకు కసరత్తు మొదలు పెట్టింది. అయితే లోక్‌సభకు, శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు జరిపిస్తే కొత్త ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు (ఈవీఎంలు) సేకరించేందుకు రూ.10కోట్ల వ్యయం ప్రతి 15 ఏళ్లకు అవుతుందని ఎన్నికల సంఘం తాజాగా అంచనా వేసింది. 2029కి ముందు జమిలి ఎన్నికలు సాధ్యం కాకపోవచ్చ అన్న అభిప్రాయాన్ని ఈసీ గతంలోనే వ్యక్తంచేసింది. ఈ ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల కోసం దేశవ్యాప్తంగా 11.80 లక్షల పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న అంచనా ఉంది. ఈవీఎంలు 15ఏళ్లకు మించి పనిచేయబోవని, ఒక సెట్‌ను మూడుసార్లు వాడవచ్చని ప్రభుత్వానికి కమిషన్‌ సమాచారం ఇచ్చింది. జమిలి ఎన్నికలకు వెళ్తే ప్రతి పోలింగ్‌ కేంద్రానికి రెండు సెట్ల ఈవీఎంలు కావాలని, అందులో ఒకటి లోక్‌సభ స్థానానికి కాగా మరొకటి అసెంబ్లీ నియోజకవర్గానికి అవసరమని తెలిపింది. గత అనుభవాలను బట్టి సమస్యాత్మక యంత్రాల స్థానంలో కొత్తవాటిని భర్తీ చేసేందుకు కొన్ని కంట్రోల్‌ యూనిట్లు (సీయూ), బ్యాలెట్‌ యూనిట్లు (బీయూ), వీవీప్యాట్‌ మెషిన్లను అదనంగా రిజర్వ్‌ చేయాల్సి ఉంటుందని, కనీసం ఒక ఈవీఎంకు ఒక బీయూ, సీయూ, వీవీప్యాట్‌ అవసరమని వెల్లడిరచింది. జమిలి ఎన్నికలకు వెళ్తే కనిష్ఠంగా 46,75,100 బ్యాలెట్‌ యూనిట్లు , 33,63,300 కంట్రోల్‌ యూనిట్లు, 36,62,600 వీవీప్యాట్‌ యంత్రాలు కావాలని తెలిపింది. 2023 ప్రారంభం నాటికి ఈవీఎం ధరను పరిశీలిస్తే.. ఒక్కో బ్యాలెట్‌ యూనిట్‌ ధర రూ.7900, కంట్రోల్‌ యూనిట్‌ ధర రూ.9,800, వీవీప్యాట్‌ ధర రూ.16వేలుగా ఉంది. ఈ లెక్కన, జమిలి ఎన్నికలకు వెళ్తే ప్రతి 15ఏళ్లకోసారి కొత్త ఈవీఎంలను కొనాలని, వాటికి రూ.10వేల కోట్ల చొప్పున ఖర్చవుతుందని ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. అదనపు పోలింగ్‌, భద్రతా సిబ్బంది, ఈవీఎంలకు మెరుగైన నిల్వ సౌకర్యాలు, మరిన్ని వాహనాలు అవసరమని కూడా చెప్పింది. కొత్త యంత్రాల ఉత్పత్తి దృష్ట్యా వేర్‌హౌసింగ్‌తో పాటు ఇతర లాజిస్టిక్‌ సమస్యలు పెరుగుతాయని, 2029కి ముందు జమిలి ఎన్నికలు నిర్వహించే వీలు లేదని ఈసీ తెలిపింది. జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగంలోని సంబంధిత ఐదు అధికరణాలను సరవించాలని కూడా కేంద్రప్రభుత్వం దృష్టికి ఎన్నికల సంఘం తీసుకెళ్లింది.
ఆర్టికల్స్‌ 83, 85, 172, 174, 356కు సవరణలు అవసరమని చెప్పింది. రాజ్యాంగం పదవ షెడ్యూల్‌లోనూ మార్పులు జరగాలని పేర్కొంది. అయితే దేశంలో జమిలి ఎన్నికల సాధ్యసాధ్యాలను పరిశీలించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వ కమిటీని కేంద్రం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img