Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Saturday, September 28, 2024
Saturday, September 28, 2024

చంద్రబాబుకు దేవుడంటే భక్తి లేదు: రోజా

చంద్రబాబుకు దేవుడంటే భయం, భక్తి లేదని మాజీ మంత్రి రోజా దుయ్యబట్టారు. కుల రాజకీయాలతో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన నాయకులు, ఇప్పుడు మత రాజకీయాలు మొదలు పెట్టారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఏమీ చెయ్యలేకపోయిన చంద్రబాబు.. చివరకు డైవెర్షన్ పాలిటిక్స్ ప్రారంభించారని ఆమె సెటైర్ వేశారు. మధురైలో మీనాక్షి అమ్మవారి ఆలయంలో ప్రార్థనల తర్వాత రోజా ఈ వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూకి వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా అనే అంశంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలనీ, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఇది జరగాలి అని రోజా డిమాండ్ చేశారు. ప్రజల సెంటిమెంట్‌తో ఆడుకుంటూ సీఎం చంద్రబాబు తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు. నిచంద్రబాబు తన స్వార్థం కోసం దేవుడితో ఆటలాడుతున్నారు. అధికారం కోసం ఆయన ఏమైనా చేస్తారు. లడ్డూ వివాదం అనేది.. తన వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి తెరపైకి తెచ్చినదిు అని రోజా అన్నారు. చంద్రబాబుకి దేవుడంటే భయం, భక్తి రెండూ లేవని విమర్శించారు రోజా. ఆయన పూజలు చేసే సమయంలో కూడా కాళ్లకు షూ వేసుకుంటారని అన్నారు. కనీసం షూ విడిచి పూజలు చేయాలని కూడా ఆయన అనుకోరని, కొన్ని ఫొటోలను చూపించారు రోజా. చంద్రబాబు షూ వేసుకుని పూజలు చేస్తున్నట్టుగా వీడియో ఆధారాలు కూడా ఉన్నాయనన్నారు. ఇక పవన్ కల్యాణ్ భార్య క్రిస్టియన్ అని, ఆయనతోపాటు ఆయన పిల్లలు కూడా బాప్టిజం తీసుకున్నారని చెప్పారు రోజా. వీళ్లంతా సనాతన ధర్మం గురించి మాట్లాడటం షాకింగ్ గా ఉందన్నారు. పవన్ అన్నయ్య నాగబాబు గతంలో దేవుడే లేడని అన్నారని, ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో ఉందని, ఇలాంటి వారంతా ఇప్పుడు దేవుడి గురించి గొప్పగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయన షూ వేసుకునే పూజలు చేస్తారని అన్నారు. గతంలో బాప్టిజం తీసుకున్నానని చెప్పిన పవన్ సనాతన ధర్మం గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. ఒకప్పుడు కుల రాజకీయాలు చేసిన చంద్రబాబు ఇప్పుడు మత రాజకీయాలతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. లడ్డూ వివాదంపై జదీI విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img