Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

డబ్బు చుట్టూ ఎన్నికలు.. సామాన్య మానవుడు అభ్యర్థిగా నిలబడే ప్రసక్తే లేదు….

ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలం చెందింది….

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ

విశాలాంధ్ర- అనంతపురం : గతంలో అభ్యర్థులు డబ్బు ఇచ్చేవారు కొంతమంది తీసుకునే వారు మరి కొంతమంది నిరాకరించేవారు ప్రస్తుత పరిస్థితుల్లో డబ్బు చుట్టే ఎన్నికలు నడుస్తున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ దుయ్యబట్టారు. సోమవారం స్థానిక మొరార్జీ నగర ప్రాథమిక పాఠశాల, ఉమా నగర్ పోలిక్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ… ప్రస్తుత పరిస్థితుల్లో అభ్యర్థులు ఇంటి దగ్గరకు ఓటర్లు వచ్చి డబ్బులు ఇవ్వాలని అభ్యర్థుల ను తిడుతూ శాపనార్థాలు పెట్టడం చూస్తుంటే ఏ స్థాయికి ప్రజాస్వామ్యం దిగజారిందోనని అనిపిస్తుందని అన్నారు. ఇంత పెద్ద ఎత్తున వందల వేల కోట్ల రూపాయలు ఒక ఆంధ్రప్రదేశ్ 26 జిల్లాలో దాదాపు పదవేల కోట్లు ఖర్చు పెట్టారని చెప్పడం జరుగుతుందన్నారు. సామాన్య మానవుడు అభ్యర్థిగా నిలబడే ప్రసక్తే లేదన్నారు. డబ్బు చుట్టూ ఎన్నికలు జరుగుతున్నాయి అన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధ్వాన్నమైన పరిపాలన చేయడం జరిగిందన్నారు. కేంద్ర రాష్ట్ర పరిపాలనలు రివర్స్ గేర్ లో నడుస్తుంటే అదే రివర్స్లో ఓటర్లు కూడా తెగించి అభ్యర్థుల దగ్గర డబ్బులు తీసుకోవడం జరుగుతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో డబ్బు ఇవ్వకపోతే అభ్యర్థులను ఓటర్లు కొట్టే పరిస్థితి వస్తుందన్నారు. ఈ విషయంపై ఒక పార్టీ అని కాదు అన్ని పార్టీల నాయకులు ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం కనుమరుగై ధనస్వామ్యం నడుస్తోందన్నారు. సాక్షాత్తు ప్రధానమంత్రి మతాలను రెచ్చగొడుతూ నీచస్థితికి దిగజారడం చూస్తున్నమన్నారు. ఇంత జరుగుతుంటే ఎన్నికల కమిషన్ ఏం చేస్తుందని ఆయన ప్రశ్నించారు. బహిరంగంగా మతాల గురించి డబ్బులు పంపిణీ చేస్తుంటే ఎన్నికల కమిషన్ ఏమి పట్టించుకోనట్లు వ్యవహరిస్తున్నారు. మాలాంటి పార్టీలు బ్యానర్లు కట్టుకుంటే తీసేస్తారు, ర్యాలీలు నిర్వహిస్తుంటే సమయం అయిపోయిందని బలవంతంగా అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు. డబ్బులు పంపిణీలో ఎన్నికల కమిషన్ వాటా పొందుతున్నారు అన్న అనుమానం వస్తుందన్నారు. దీనికి ఎన్నికల కమిషన్, పోలీసులు అవసరమా అని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాలపై ఎన్నికల కమిషన్ పూర్తి విఫలమైందని తెలిపారు. వీటన్నిటి పైన సుప్రీంకోర్టులో కేసులు వేస్తామన్నారు. ఎన్నికల కమిషన్ ద్వారా న్యాయం జరగదన్న ఉద్దేశంతోనే సుప్రీంకోర్టు ద్వారా న్యాయం పొందాలని భావిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి. జగదీష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శిలు పాల్యం నారాయణస్వామి, చిరుతల మల్లికార్జున, ఏ ఐ టి యూ సి జిల్లా ప్రధాన కార్యదర్శి జే రాజారెడ్డి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ బాబు, రాప్తాడు నియోజకవర్గ కార్యదర్శి పి రామకృష్ణ, సింగనమల నియోజకవర్గ కార్యదర్శి పి నారాయణస్వామి, ఏ టి యు సి జిల్లా అధ్యక్షులు రాజేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img