Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

ఆగని దాడులు

. రెండు మసీదుల ధ్వంసం
. దుకాణాలకు నిప్పు

నూప్‌ా: హరియాణాలోని నూప్‌ా జిల్లాలో ఉద్రిక్తత కొనసాగుతోంది. మతఘర్షణలు చెలరేగిన రెండు రోజుల తర్వాత పరిస్థితి మెరుగైనట్లు ఆ రాష్ట్ర పోలీసులు చెబుతున్నారుగానీ హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రెండు మసీదులపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. అయితే ప్రార్థనాలయాలకు స్వల్పంగా నష్టం జరిగింది తప్ప ఎవరికి గాయాలు కాలేదని పోలీసులు గురువారం తెలిపారు. మసీదులకు నిప్పు పెట్టడం, విధ్వంసకాండకు పాల్పడిన ఘటన బుధవారం అర్థరాత్రి జరిగిందని, 10`15 మంది కలిసి దాడి చేశారని వెల్లడిరచారు. కొన్ని చోట్ల గోదాములు, దుకాణాలకు దుండగులు నిప్పు పెట్టినట్లు తెలిపారు. ‘అర్థరాత్రి సమయంలో రెండు మసీదులపై దాడి జరిగింది. మొదటి మసీదులో బ్యాటరీలు ఉన్న ప్రాంతంలో మంటలు చెలరేగాయి. వాటిని వెంటనే ఆర్పేశారు. వర్షం వల్ల షార్ట్‌ సర్క్యూట్‌ జరిగివుండవచ్చు. దాడిలో మొలోటోవ్‌ కాక్‌టెయిల్స్‌ను వాడలేదు. రెండో మసీదు వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. రెండుచోట్ల భద్రతా ఏర్పాట్లు చేశాం’ అని సీనియర్‌ పోలీసు అధికారి వరుణ్‌ సింగ్లా అన్నారు. సీసీటీవీ ఆధారంగా దుండగులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. అయితే వార్తా కథనాలకు భిన్నంగా పోలీసుల ప్రకటన ఉండటం గమనార్హం. రెండు మసీదులపై మొలోటోవ్‌ కాక్‌టైల్స్‌తో దాడి జరిగిందని, మంటలు వ్యాపించాయని మీడియా నివేదికలు పేర్కొన్నాయి. సైకిల్‌పై వచ్చిన దుండగులు తౌరులోని పోలీసు స్టేషన్‌, విజయ్‌చౌక్‌ సమీపంలోని మసీదులే లక్ష్యంగా దాడులు చేయగా ఎవరికి గాయాలు కాలేదని పీటీఐ నివేదించింది. ఘటనాస్థలాలకు అగ్నిమాపక దళాలు హుటాహుటిన చేరుకొని మంటలను ఆర్పివేశాయి. గుర్తుతెలియని దుండగులు పల్వాన్‌ జిల్లాలోని మినర్‌ గేట్‌ మార్కెట్‌లోని గాజుల దుకాణానికీ నిప్పు పెట్టారు. మతఘర్షణల కారణంగా నూప్‌ా, పల్వాల్‌ జిల్లాల్లో జనసమూహాలపై నిషేధం, కర్ఫ్యూ విధించారు. అల్లర్లలో ఆరుగురు చనిపోయారు. ఇప్పటివరకు 116 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నూప్‌ాలో పోలీసు పహారా ఏర్పాటు చేశారు. ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. గురువారం మధ్యాహ్నం మూడు గంటల కోసం అంతర్జాల సేవలను పునరుద్ధరించారు. అయితే శనివారం వరకు మొబైల్‌ ఇంటర్నెట్‌, ఎస్‌ఎంఎస్‌లపై నిషేధం అమల్లో ఉంటుంది. హరియాణా ఘర్షణలతో పక్కనే ఉన్న దిల్లీలోనూ భద్రతను పెంచారు. అటు రాజస్తాన్‌ ప్రభుత్వం కూడా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంది. నూప్‌ాకు దగ్గరగా ఉండే తమ రాష్ట్రంలోని భరత్పుర్‌ జిల్లాలోని నాలుగు సబ్‌ డివిజన్‌లలో మొబైల్‌ ఇంటర్నెట్‌, ఎస్‌ఎంఎస్‌ సేవలను గురువారం ఉదయం వరకు నిలిపివేసింది.
తృటిలో తప్పించుకున్న జడ్జి
అల్లర్లు జరిగినప్పుడు ఓ జడ్జి, ఆమె మూడేళ్ల కుమార్తె ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఈ ఘటనపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం సోమవారం ఘర్షణల సమయంలో అడిషనల్‌ చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ అంజలీ జైన్‌, ఆమె కుమార్తె ప్రయాణిస్తున్న కారుపై అల్లరిమూక దాడి చేసింది. తొలుత రాళ్లు విసిరి, ఆపై కారుకు నిప్పు పెట్టింది. జడ్జితో పాటు కారులో ఉన్న కొందరు సిబ్బంది అక్కడ నుంచి తప్పించుకోగలిగారు. నూప్‌ా పాత బస్టాండ్‌కు చేరుకొన్నారు. కొందరు న్యాయవాదులు సహకరించడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటనలో జడ్జి ప్రయాణించిన కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనపై గుర్తు తెలియని దుండగుల మీద కేసును కోర్టు సిబ్బంది పెట్టారు.
గురుగ్రామ్‌లో ఉద్రిక్తత ముస్లింలపై దాడి గురుగ్రామ్‌: హరియాణా అల్లర్ల క్రమంలో పక్కనే ఉన్న గురుగ్రామ్‌లో గొడవులు జరుగుతున్నాయి. తాజాగా 30 మందితో కూడిన అల్లరి మూక స్థానిక ముస్లింలపై దాడికి తెగబడినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం సాయంత్రం సోదరులైన నిసార్‌ అలీ, రుస్తమ్‌ అలీపై మూకదాడి జరిగిందని, బాధితులు పల్దా గ్రామంలోని మురికవాడలో ఉంటున్నారని, వీరు పశ్చిమ బెంగాల్‌, మాల్డా జిల్లాకు చెందిన వారని పోలీసులు చెప్పారు. ముస్లింలను బుధవారం నాటికి నగరాన్ని వీడాలని మంగళవారం తమ వాడకు వచ్చిన 2530 మంది హెచ్చరించినట్లు నిసార్‌ తెలిపారు. క్రికెట్‌ మైదానం సమీపంలో నలుగురు, ఐదుగురు వచ్చి తమను అడ్డుకొని పేర్లు అడిగారని, ఆపై కొట్టడం మొదలు పెట్టారని, అంతలోనే 25`30 మంది వచ్చి తమను చితకబాదారని ఆయన చెప్పారు. తమను, తమ మతాన్ని దూషించారన్నారు. చుట్టూ జనం చేరడంతో వారంతా పారిపోయారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో నిసార్‌ పేర్కొన్నారు. ఈక్రమంలో గుర్తుతెలియని యువకులపై ఐపీసీలోని 147, 149, 323, 295ఎ, 506, 188 సెక్షన్ల కింద బాద్‌షాపూర్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.
ఇంటోనే నమాజ్‌:
ఘర్షణ వాతావరణం క్రమంలో శుక్రవారం ఇళ్లలోనే ప్రార్థనలు ఆచరించాలని ముస్లింలు నిర్ణయించారు. గురుగ్రామ్‌, నూప్‌ా, సోహ్నాలో ఉక్రిక్తలు కొనసాగుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇళ్లలోనే నమాజ్‌ చేసుకోవాలని నూప్‌ాలోని ఉలేమాలను డీసీ ప్రశాంత్‌ పన్వర్‌, ఎస్‌పీ వరుణ్‌ సింగ్లా కోరగా వారు అంగీకరించారు. గతంలోనూ నమాజ్‌ విషయంలో ఈ ప్రాంతాల్లో గొడవులు జరిగిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img