Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

తీవ్ర ఉద్రిక్తం

. పుంగనూరులో చంద్రబాబును అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు
. వైసీపీ`టీడీపీ వర్గాల ఘర్షణ
. పోలీసుల లాఠీచార్జి, బాష్పవాయువు ప్రయోగం
. పోలీస్‌ వాహనాలకు నిప్పు

విశాలాంధ్ర – పుంగనూరు/మదనపల్లి : చిత్తూరు జిల్లా పుంగనూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు పోలీసులు, వైసీపీ నేతలు యత్నించడంతో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయారు. రెండు పోలీస్‌ వాహనాలపై దాడికి నిప్పు పెట్టారు. దీంతో టీటీపీ కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. అయినా శాంతించకపోవడంతో బాష్పవాయువు గోళాలను, రబ్బరు బుల్లెట్లను ప్రయోగించారు. ప్రతిపక్ష నేత నారా చంద్రబాబుకు రాయలసీమలో పర్యటించే అర్హత లేదన్న వైసీపీ శ్రేణులు… అంతకుముందు అంగళ్లులో చంద్రబాబు నిర్వహిస్తున్న రోడ్‌ షోపై వైసీపీ నేతలు, కార్యకర్తలు రాళ్లదాడికి పాల్పడ్డారు. టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన బ్యానర్లను చించేసిన వైసీపీ కార్యకర్తలు చంద్రబాబు గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. దీంతో వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన టీడీపీ కార్యకర్తలపైనా రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో దేవేంద్ర అనే ఎంపీటీసీ సహా కొంతమంది నేతలు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన పోలీసులు లాఠీచార్జీ చేసి రెండు వర్గాలను చెదరగొట్టారు. దీనిపై చంద్రబాబు సీరియస్‌ అయ్యారు. టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చూశారని ఆరోపించారు. డీఎస్పీ తన యూనిఫామ్‌ తీసేయాలంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాంబులకే తాను భయపడలేదని.. రాళ్లకు భయపడతానా అని ప్రశ్నించారు. దమ్ముంటే రండి చూసుకుందాం.. పులివెందులకే వెళ్లానని, తానూ చిత్తూరు జిల్లాలోనే పుట్టానని చంద్రబాబు పేర్కొన్నారు.
పోలీసుల అండతోనే వైసీపీ నేతలు ఈ దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఎవరి జోలికి తాము వెళ్లమని.. మా జోలికి వస్తే ఊరుకునేది లేదన్నారు. పుంగనూరుకు వెళ్తున్నానని.. అక్కడి పుడిరగి సంగతి తేలుస్తానంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇక్కడ రావణాసురుడిలాంటి ఎమ్మెల్యే వున్నాడని.. ఇలాంటి వాళ్లను భూస్థాపితం చేయాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు. పోలీసులు ఎవరికి ఊడిగం చేస్తున్నారు? అంగళ్లు ఘటనపై విచారణ జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు.
పుంగనూరు పెద్దిరెడ్డి జాగీరా? చంద్రబాబు
పుంగనూరుకు పెద్దిరెడ్డి ఏమైనా పుడిరగా అని రోడ్‌ షో లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఈ రోడ్డు మార్గంలో తనని రావొద్దనటానికి ఈ రహదారి పెద్దిరెడ్డి తాత జాగీరా అని ప్రశ్నించారు. పుంగనూరు బైపాస్‌ కూడలి వద్ద చంద్రబాబు కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. ‘ఇవాళ జరిగిన విధ్వంసానికి మంత్రి పెద్దిరెడ్డి, పోలీసులే కారణం. విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి. ఈ దారిలో వెళ్లకూడదా? ఈ రహదారి మంత్రి పెద్దిరెడ్డి తాత జాగీరా? ప్రజలు తిరగబడితే మీరు పారిపోతారు. నేను మళ్లీ వస్తా… పుంగనూరు పట్టణమంతా పర్యటిస్తా… తలలు పగులుతున్నా, నెత్తురోడుతున్నా నిలబడిన కార్యకర్తలను అభినందిస్తున్నా. చల్లా బాబుపై దెబ్బపడితే నాపై పడినట్టే. మీ నుంచి కారిన ప్రతి రక్తపు చుక్కా.. నా నుంచి కారినట్టే. ప్రజలకు అండగా ఉంటా. వై నాట్‌ పుంగనూరు. వై నాట్‌ 175. భగవంతుడు స్క్రిప్టు రాశాడని అసెంబ్లీలో జగన్‌ చెప్పారు.. దేవుడు ఆ స్క్రిప్టు తిరగ రాశాడు. పుంగనూరులో ఎన్నో అరాచకాలు జరిగాయి. ప్రతి ఒక్క కార్యకర్తను కాపాడుకునే బాధ్యత నాది. ఈరోజు మీరు చూపించిన పట్టుదలను అభినందిస్తున్నా. మొన్నే పులివెందులలో పొలికేక వినిపించా. ఇప్పుడు పుంగనూరులో గర్జిస్తున్నా. అధికార పార్టీకి దాసోహం కావొద్దు. శాంతిభద్రతలు కాపాడండి’’ అని పోలీ సులను హెచ్చరించారు. వైసీపీ రాళ్లదాడి, పోలీసుల లాఠీఛార్జిలో గాయపడిన కార్యకర్తలను చంద్రబాబు పరామర్శించి ధైర్యం చెప్పారు. అధైర్యపడొద్దు.. అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తొలుత తంబళ్లపల్లి నియోజకవర్గం కురుబలకోట మండలం అంగళ్లులో వైసీపీ నాయకులు టీడీపీ ఫ్లెక్సీలు చింపేసి చంద్రబాబునాయుడు గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. అక్కడికి పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు వర్గాలు రాళ్ల వర్షం కురిపించుకోవడంతో పోలీసులకు, కార్యకర్తలకు, విలేకరులకు బలమైన గాయాలయ్యాయి. షెడ్యూల్‌ ప్రకారం చంద్రబాబు అంగళ్లుకు చేరుకోవడంతో మరోమారు యుద్ధ వాతావరణం నెలకొంది. మరోసారి రాళ్లు పడడంతో చంద్రబాబు నాయుడు సెక్రటరీ గాయపడ్డారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో పరిపాలనలో ఎక్కడ చూసినా అరాచకాలు తప్ప ప్రశాంతత లేదన్నారు. పెద్దిరెడ్డి కుటుంబం చేస్తున్న అరాచకాలకు గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని, వీరి బెదిరింపులకు భయపడే వ్యక్తి నేను కాదని వారు కర్రలతో వస్తే నేను కర్రలతోనే వస్తానని రౌడీలతో వస్తే రౌడీయిజం తోనే వస్తానని మర్యాదగా ఉంటే మంచిదని, లేదంటే వారి గుండెల్లో నిద్రపోతానంటూ హెచ్చరించారు. ఇక్కడ అన్నదమ్ముల ఆగడాలకు హద్దు లేదన్నారు. ఈ కుటుంబాన్ని జైలుకు పంపకపోతే ప్రజల భవిష్యత్తు కు విఘాతం కలుగుతుందన్నారు. ప్రాజెక్టుల పేరుతో 35 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. పోలీసుల వైఫల్యంతో ఇలాంటి ఘర్షణలు పునరావుతమవుతున్నాయని, డీఎస్పీగా ఉన్న వ్యక్తి పోలీస్‌ బట్టలు తీసి వెళ్లిపోవాలని ఆవేశంతో ఊగిపోయారు.

వైసీపీ అరాచకాలకు పరాకాష్ఠ
రామకృష్ణ ఖండన

విశాలాంధ్ర – విజయవాడ: మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌పై వైసీపీ శ్రేణుల రాళ్లదాడిని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ శుక్రవారం ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండిరచారు. వైసీపీ శ్రేణుల అరాచకాలకు అంతులేకుండా పోయిందని విమర్శించారు. చంద్రబాబు కాన్వాయ్‌లోని కార్లపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేయడం, టీడీపీ బేనర్లు చించేయడం, ఆ పార్టీ కార్యకర్తలపై దాడికి పాల్పడటం దుర్మార్గమని పేర్కొన్నారు. భీమగానిపల్లి వద్ద ప్రధాన రహదారిపై కంటైనర్‌ లారీ, వాహనాలు అడ్డుపెట్టి చంద్రబాబు పర్యటనను అడ్డుకోవాలని చూడటం పోలీసుల విపరీత చర్యలకు తార్కాణమని మండిపడ్డారు. లారీని పక్కకు తీయాలని ఆందోళన చేపట్టిన టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేయడం, బాష్పవాయువు గోళాలు ప్రయోగించడం, గాల్లోకి కాల్పులు జరపడంతో అనేకమంది టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారని తెలిపారు. పోలీసుల దుందుడుకు చర్యలను తీవ్రంగా ఖండిరచారు. జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టాక ప్రతిపక్షాలపై దాడులు, వేధింపులు నిత్యకృత్యమయ్యాయని ఆరోపించారు. శాంతియుత ఉద్యమాలపై ఉక్కుపాదం మోపుతున్నారని పేర్కొన్నారు. పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ ప్రజాస్వామిక హక్కులకు విఘాతం కలిగిస్తున్నారని విమర్శించారు. అధికార పార్టీ నేతల కార్యక్రమాలకు ఆఘమేఘాలపై అనుమతులిస్తూ…ప్రతిపక్ష పార్టీ నేతల కార్యక్రమాలను అడ్డుకోవడం దారుణమన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛ, ప్రజాస్వామిక హక్కులకు తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామిక వ్యవస్థలో ర్యాలీలు, ధర్నాలు, సభలు, సమావేశాలు నిర్వహించుకోవడం సర్వసాధారణమని, ఇది ఏ ఒక్క పార్టీ హక్కు కాదని వైసీపీ గుర్తించాలని సూచించారు. చంద్రబాబు కాన్వాయ్‌పై దాడికి పాల్పడిన వైసీపీ శ్రేణులను గుర్తించి… తక్షణమే అరెస్టుచేయాలని డిమాండ్‌ చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని రామకృష్ణ స్పష్టంచేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img