Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

జగన్‌నే బదిలీ చేద్దాం

వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం తథ్యం
కనిగిరి సభలో చంద్రబాబు

విశాలాంధ్ర బ్యూరో`ఒంగోలు : ఐదేళ్లలో రాష్ట్రాభివృద్ధి కుంటుపడిరదని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ సైకో జగన్‌కు ఒక అవకాశం ఇచ్చి తప్పు చేశామని పశ్చాతాపంలో రాష్ట్ర ప్రజలు ఉన్నారని అన్నారు. శుక్రవారం ‘రా… కదిలి… రా’ పేరుతో ఒంగోలు పార్లమెంటు పరిధిలోని కనిగిరిలో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ జగన్‌మోహన్‌ రెడ్డి ఎమ్మెల్యేలను, ఎంపీలను బదిలీ చేసినంత మాత్రాన విజయం దక్కదని, ప్రజలే జగన్‌ను బదిలీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఒక ఊరిలో పనికిరాని చెత్తను మరో ఊరిలో వేస్తున్నారని, అయినా ఆ చెత్త ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఓటమి తప్పదన్నారు. ఆరు గ్యారంటీలతో తెలుగుదేశం పార్టీ ఎన్నికల సమరంలోకి దిగుతుందన్నారు. తాము అధికారంలోకి వస్తే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు. ప్రతి ఆడబిడ్డకు ఏడాదికి రూ.15 వేలు ఇస్తామన్నారు. ఏటా మూడు వంట గ్యాస్‌ సిలిండర్లను పంపిణీ చేస్తామని, ప్రతి రైతుకు వ్యవసాయ ఖర్చుల కింద రూ.25 వేలు ఇస్తామని, యువతకు నిరుద్యోగ భృతి కింద రూ.3 వేలతో పాటు సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ప్రకటించారు. జాబ్‌ క్యాలెండర్‌తో అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. 2019లో ఒక అవకాశం ఇస్తే రాష్ట్రాన్నే జగన్‌ దోచుకున్నాడని, అమరావతి రాజధాని కాదన్నాడని, మరి మూడు రాజధానులు ఎక్కడా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్‌, విద్యుత్‌ చార్జీలు ఎక్కువగా ఉన్నాయని, మరోపక్క విద్యుత్‌ బిల్లులు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారని తెలిపారు. చెత్త నుంచి సంపద సృష్టిద్దామని మేము ప్రయత్నం చేస్తే చెత్తమీద పన్ను వేసిన సీఎం జగన్‌ను చిత్తుచిత్తుగా ఓడిరచాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కు తీసుకెళ్లిన ఘనత జగన్‌మోహన్‌ రెడ్డికే దక్కిందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కుంభకోణాలు జరుగుతున్నాయన్నారు. సుపరిపాలన అంటే ప్రజల ఖర్చులు తగ్గించి, వారి ఆదాయం, జీవన ప్రమాణాలు పెంచడమని, కానీ రాష్ట్రంలో ఎక్కడా సుపరిపాలన లేదని విమర్శించారు. టీడీపీ హయాంలో ఉచిత ఇసుకను ఇస్తే ఇప్పుడు ఒక్క ట్రాక్టర్‌ ఇసుకను రూ.5 వేలు చేశారని తెలిపారు. మరోపక్క జగన్‌ నాసిరకం మద్యం అమ్మి పేదల రక్తాన్ని తాగుతున్నారని, తాము అధికారంలోకి వస్తే మద్యం ధరలు తగ్గిస్తామని తెలిపారు. ప్రకాశం జిల్లా జీవనాధారమైన వెలుగొండ ప్రాజెక్టును తామే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
కనిగిరిలో ట్రిఫుల్‌ ఐటీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. జయహో బీసీ కార్యక్రమం ద్వారా బీసీల రుణం తీర్చుకుంటామన్నారు. స్థానిక సంస్థలను జగన్‌ నిర్వీర్యం చేశాడని, వలంటీర్లకున్న గౌరవం సర్పంచ్‌లకు లేకుండా పోయిందన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే సర్పంచ్‌ని గ్రామ మొదటి పౌరునిగా గౌరవిస్తామన్నారు. ప్రకాశం జిల్లాలో కొంతమంది ఎమ్మెల్యేలను పక్క నియోజకవర్గాలకు మార్చారని, మరికొందరికీ సీటు ఇచ్చే పరిస్థితి లేదని, ఇంకొంతమంది పోటీయే చేయలేమని తప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ బహిరంగ సభలో స్థానిక తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జ్‌ డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డితో పాటు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్ధన్‌, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, ఒంగోలు పార్లమెంటు అధ్యక్షులు నూకసాని బాలాజీతో పాటు మాజీ ఎమ్మెల్యే, గిద్దలూరు ఇన్‌ఛార్జ్‌ ముత్తుముల అశోక్‌రెడ్డి, కొండేపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి, యర్రగొండ పాలెం ఇన్‌ఛార్జ్‌ ఎరిక్షన్‌బాబు, మార్కాపురం ఇన్‌ఛార్జ్‌ కందుల నారాయ ణరెడ్డి, టీడీపీ యువత నేత దామచర్ల సత్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img