Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

ప్రభుత్వ మొండి వైఖరి వల్లే చర్చలు విఫలం

విశాలాంధ్ర – విజయవాడ (వన్‌టౌన్‌): పుర, నగరపాలక సంస్థల్లో పారిశుద్ధ్య, ఇంజినీరింగ్‌ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మెపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. న్యాయమైన సమస్యలను పరిష్కరించకుండా మొండి వైఖరి అనుసరిస్తోంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం, అధికారులతో కార్మికులను బెదిరించడం ద్వారా ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ చర్యలను కార్మికులు ఎక్కడికక్కడ తిప్పికొడుతున్నారు. సమ్మెతో ఇళ్ల నుంచి చెత్త సేకరణ, వీధులు, కాలువలు శుభ్రం చేసే పనులు నిలిచి పోయాయి. నగరాలు, పట్టణాల్లో వీధుల్లో చెత్తభారీగా పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది. ప్రభుత్వం మొండివైఖరి కారణంగానే మున్సిపల్‌ కార్మికుల చర్చలు విఫలమయ్యాయని ఏఐటీయూసి రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్‌ విమర్శించారు. న్యాయమైన సమస్యల పరిష్కారానికి సమ్మె చేస్తున్న మున్సిపల్‌ కార్మిక సంఘాలను చర్చలకు పిలిచి ఎటువంటి పురోగతి లేకుండా ప్రభుత్వం అవలంబించిన విధానమే చర్చలు విఫలం కావటానికి కారణమని చెప్పారు. విజయవాడ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఆదివారం తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎదురుగా జరిగిన ధర్నాలో రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న మున్సిపల్‌ కార్మికులను అనేక దఫాలుగా చర్చలకు ఆహ్వానించి ఎటువంటి పురోగతి లేకుండా చెప్పింది చెబుతూ కాలయాపన చేస్తూ సమ్మె విరమించండి అని మాత్రమే చెప్తున్నారు తప్ప అడిగిన న్యాయమైన సమస్యలు పరిష్కరించడం లేదన్నారు. అందరికీ సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని రిస్క్‌ అలవెన్స్‌లు కూడా పెంచాలని రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కూడా ఇవ్వాలని కోరగా వాటన్నిటి గురించి ప్రభుత్వం సరైన సమాధానం చెప్పలేకపోతోందన్నారు. సమ్మె విరమించండి మిగతా విషయాలన్నీ పరిష్కారం చేస్తామని చెబుతూ లేచి వెళ్లిపోవడం సరైన ి విధానం కాదన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియూసీ నాయకులు మూలి సాంబశివరావు, కొట్టు రమణ, మున్సిపల్‌ యూనియన్‌ నాయకులు జేమ్స్‌,రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.
బెదిరింపులతో ఉద్యమాలను ఆపలేరు: ఈశ్వరయ్య
మదనపల్లిలో మునిసిపల్‌ కార్మికుల చేస్తున్న సమ్మెకు సీపీిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి ఈశ్వరయ్య మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా బెదిరించే ప్రయత్నం చేసున్నదన్నారు. రాష్ట్రంలో అంగన్‌ వాడీలుి, మునిసిపల్‌ కార్మికులు, సర్వశిక్షన వాళ్ళు పోరాటంలో ఉన్నారని,అంగన్వాడీలపైన ఎస్మా ప్రయోగిస్తా అనడం ప్రభుత్వం దిగజారుడు తనానికి నిదర్శనం అన్నారు. ఇప్పటి వరకు కార్మికుల పొట్టకొట్టిన ఏ ప్రభుత్వం బతికి బట్ట కట్టలేదన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పి ఎల్‌ నరసింహులు, జనసెేన నాయకులు మహేష్‌ మాట్లాడారు.
సమ్మె విచ్ఛిన్నంచేసే చర్యలు అడ్డుకోవాలి: కోటేశ్వరరావు
దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న వేతనాలు తదితర ప్రధాన సమస్యలను పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్‌ కార్మికులు గత 13 రోజులుగా శాంతియుతంగా సమ్మె చేస్తుంటే వారి సమస్యలను పరిష్కరించకపోగా కిరాయి మనుషులతో పారిశుద్ధ్య పనులు చేయించి సమ్మెను విచ్ఛిన్నం చేసే చర్యలను అడ్డుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సీహెచ్‌ కోటేశ్వరరావు కార్మికులకు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్‌ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఇబ్రహీంపట్నంలో ఆదివారం కంచికచర్ల నుంచి కిరాయి కూలీలను రప్పించి పారిశుద్ధ్య పనులు చేస్తున్నట్లు తెలుసుకున్న కార్మికులు నాయకులు సమ్మె శిబిరం వద్దకు హుటాహుటిన వెళ్లి వారి పనులను అడ్డుకున్నారు. ట్రాక్టర్‌కు లోడ్‌ చేసే పనులను నిలిపేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కోటేశ్వరరావు ప్రభుత్వం సంబంధిత అధికారులు అధికార పార్టీ పెద్దలు ఒత్తిళ్ళతో ఈ రెచ్చగొట్టే చర్యలకు పూను కోవటం దుర్మార్గమన్నారు. ఏఐసీటీయూ నాయకులు గొల్లపూడి ప్రసాద్‌ మాట్లాడుతూ కార్మికులు సమైక్యంగా విచ్ఛిన్నకర చర్యలను ప్రతిఘటించాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img