Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

ఆర్థిక అసమానతలను తగ్గించడం ప్రభుత్వ విధానాలతోనే సాధ్యం.. చంద్రబాబు

  • తెలుగు జాతిని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెట్టాలనేది తన లక్ష్యమని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచంలో భారత్ నెంబర్ వన్ గా ఉంటే అందులో 30 శాతం మంది తెలుగు వాళ్లు ఉండాలనేది తన ఆకాంక్ష అని చెప్పారు. దేశంలో, రాష్ట్రంలో, జిల్లాలో.. ఇలా అన్ని స్థాయుల్లో జీరో పావర్టీని సాధించినపుడే అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. ఆర్థిక అసమానతలు తగ్గించడం ప్రభుత్వం వల్ల, ప్రభుత్వ విధానాల వల్ల మాత్రమే సాధ్యమని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు ఉన్న పరిస్థితులను తన పాలనలో మార్చేశానని చెప్పారు. అప్పట్లో సెక్రటేరియట్ కే పరిమితమైన పాలనను ప్రజల మధ్యకు తీసుకెళ్లినట్లు గుర్తుచేశారు. ప్రజలతో కలిసి పనిచేస్తూ అభివృద్ధివైపు అడుగులు వేశామన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేసిందని, తాను తీసుకున్న నిర్ణయాలతో సిటీ అభివృద్ధి బాట పట్టిందని చెప్పారు. ఆ ఫలితాలను చూసి ప్రపంచంలో ఉన్న కంపెనీల అధినేతలు హైదరాబాద్ కు క్యూ కట్టారని చెప్పారు. వారిని తాను ఆహ్వానించలేదని, అభివృద్ధి ఫలాలను చూసి వారే వచ్చారని వివరించారు. దీనిని బట్టి మంచి జరిగితే ప్రపంచం గుర్తిస్తుందనే విషయం స్పష్టమైందన్నారు.

సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో.. ఆ సంపదను పేదలకు చేరేలా చేయడమూ ముఖ్యమేనని చంద్రబాబు తెలిపారు. సమాజంలోని ఆర్థిక అసమానతలను తగ్గించాలని చెప్పారు. ఒకతనికి లక్ష కోట్లు.. మరొకతనికి రోజుకు వంద రూపాయలు వచ్చే పరిస్థితి ఉండకూడదని వివరించారు. ప్రజలంతా మెరుగైన జీవనప్రమాణంతో ఉండాలని, సరైన ప్రభుత్వ విధానాల వల్ల మాత్రమే ఇది సాధ్యమని చెప్పారు. భారత దేశంలోని కుటుంబ వ్యవస్థ ప్రపంచానికే ఆదర్శమని చంద్రబాబు చెప్పారు. అలాంటి కుటుంబ వ్యవస్థను, వారసత్వాన్ని వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ముందుకు తీసుకెళ్లాలని చెప్పారు.

తిరుమల వెంకన్న కీర్తిని ప్రపంచమంతటా చాటిచెప్పాలని అన్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం నలుమూలలా తెలుగువారు ఉన్నారని గుర్తుచేశారు. కలియుగ దైవం వెంకటేశ్వరుడిని దర్శించుకోవాలని ప్రతీ హిందువు కల అని, ఎన్నిసార్లు వచ్చినా మరోసారి స్వామి దర్శనం చేసుకోవాలని భావిస్తారని చెప్పారు. అలాంటి తిరుమల క్షేత్రాన్ని గత పాలకులు అపవిత్రం చేశారని ఆరోపించారు. తిరుమలకు వస్తే వైకుంఠానికి వచ్చిన అనుభూతి కలుగుతుందని చెప్పారు. ఈ పవిత్ర స్థలంలో నారాయణ మంత్రం తప్ప మరేమీ వినిపించకూడదని చంద్రబాబు అన్నారు.

గడిచిన ఐదేళ్లలో తిరుమల పవిత్రతను దెబ్బతీశారని, తిరుమలను అధ్వానంగా మార్చేశారని మండిపడ్డారు. పెళ్లిళ్లు, పేరంటాలకు స్వామి వారిని ఊరూరా తిప్పారని, కొండపైకి నాన్ వెజ్ తీసుకొచ్చి అపవిత్రం చేశారని విమర్శించారు. ఈ రోజు నుంచే ఆంధ్రప్రదేశ్ లో ప్రజాపాలన మొదలైందని, తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. టీడీపీ 4.0 పాలన ఎలా ఉండబోతోందనేది మీరే చూస్తారంటూ ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img