Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

రాష్ట్రాన్ని రక్షించండి… దేశాన్ని కాపాడండి

. ఆగస్టు 17 నుంచి సెప్టెంబరు 8 వరకు 26 జిల్లాల్లో సీపీఐ బస్సు యాత్ర
. జగన్‌ ఇక్కడున్నా, విశాఖలో ఉన్నా గుండు సున్నానే…
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

విశాలాంధ్రవిజయవాడ: ‘రాష్ట్రాన్ని రక్షించండిదేశాన్ని కాపాడండి’ అనే నినాదంతో ఆగస్టు 17 నుంచి సెప్టెంబరు 8 వరకు రాష్ట్రంలోని 26 జిల్లాల్లో సీపీఐ బస్సు యాత్ర నిర్వహించనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వెల్లడిరచారు. విజయవాడ దాసరి భవన్‌లో ఆదివారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీపీఐ బస్సు యాత్ర ఈ నెల 17న విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ వద్ద ప్రారంభమై సెప్టెంబరు 8న తిరుపతిలో భారీ ప్రదర్శన, బహిరంగ సభతో ముగుస్తుందని తెలిపారు. ఈ బస్సు యాత్ర కార్యక్రమాలలో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, కేంద్ర నాయకులు వినయ్‌ విశ్వం, అమరజిత్‌ కౌర్‌, కె.నారాయణ తదితరులు పాల్గొంటారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక, తిరోగమన విధానాలపై ప్రజలను చైతన్యం చేయటానికి ఈ యాత్ర చేపట్టినట్లు వివరించారు. ఈ బస్సు యాత్ర సందర్భంగా జిల్లాలలో జరిగే ర్యాలీలు, సభలు, సమావేశాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఏపీ అప్పుల బారిన పడలేదని ప్రకటిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు, ఆర్థిక వేత్తలు ఏపీ ఆర్థికంగా దివాళా తీసిందంటున్నారన్నారు. ఇప్పటికి దాదాపు రూ.9 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని, మరికొన్ని నెలల్లో ఏపీ అప్పు రూ.10 లక్షల కోట్లుకు చేరుకుంటుందని విమర్శించారు. జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఏపీ అప్పుల పాలైయిందని చెప్పటం, వైసీపీ నాయకులు నాలుగు నెలల్లో రూ.33,500 కోట్లు అప్పు చేసినట్లు చెప్పారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర బీజేపీ నేతల మాటలు పరస్పర విరుద్ధంగా ఉండడంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారన్నారు. ఈ అప్పుల వ్యవహారంపై రాష్ట్ర ఆర్థిక మంత్రి, ముఖ్యమంత్రిగాని ప్రజలకు సమాధానం చెప్పాలని, రాష్ట్ర ప్రభుత్వం చేసిన అన్నిరకాల అప్పులపై చర్చించేందుకు తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని జరపాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడా జరగటం లేదన్నారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టుల నిర్మాణం ముందుకు సాగటం లేదని, ఐటీ రంగం ఊసే లేదన్నారు. కొత్తగా ఒక్క పరిశ్రమ రాకపోగా ఏపీలో ఉన్న పరిశ్రమలు కూడా పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయన్నారు. రూ.9,600 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో అమర్‌రాజా కంపెనీ విస్తరణ చేపట్టిందన్నారు. రాష్ట్రంలో విస్తరణ చేపట్టాలని భావించిన తైవాన్‌ కంపెనీ రూ.1,600 కోట్లు పెట్టుబడిని తమిళనాడుకు తరలించిందన్నారు. కంపెనీలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్న పరిస్థితులపై సీఎం జగన్‌ ఇప్పటికైనా నోరు విప్పాలన్నారు. కక్ష పూరితంగా అమర్‌ రాజా కంపెనీ బస్సుపై, ఉద్యోగులపై వైసీపీ శ్రేణులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో అల్లర్లు పెచ్చుమీరుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు చేయటం సహజమని, సాక్షాత్తూ మంత్రులే ప్రతిపక్షాలను పర్యటించవద్దని రెచ్చగొట్టటం దారుణమన్నారు. జీవో నంబరు 1ను హైకోర్టు కొట్టేసిన తరువాత కూడా ప్రతిపక్షాల ర్యాలీలు, సభలు అడ్డుకునేందుకు వైసీపీ చూడడం దుర్మార్గమని మండిపడ్డారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం కూడా అభివృద్ధిని పట్టించుకోకుండా మతోన్మాదాన్ని రెచ్చగొట్టటం, కార్పొరేట్‌లకు ఊడిగం చేయటమే అజెండాగా పెట్టుకుందని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అక్టోబరు 24 నుంచి వారానికి మూడు రోజులు విశాఖలోనే ఉండనున్నట్లు వస్తున్న వార్తలపై విలేకరులు రామకృష్ణ స్పందన కోరగా ‘సీఎం జగన్‌ ఎవరితో మాట్లాడడు. ఎవరినీ కలవనివ్వడు. పరిపాలన గాలికొదిలేశాడు. అభివృద్ధిపై దృష్టిలేదు. అలాంటప్పుడు విశాఖలో ఉన్నా, తాడేపల్లిలో ఉన్నా, లేక సముద్రంలోని ఓడలో ఉన్నా ఒరిగేది, పోయేది, వచ్చేది ఏమి ఉండదు’ అని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జల్లి విల్సన్‌, అక్కినేని వనజ, కెేవీవీ ప్రసాద్‌ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img