Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

నినాదాలతో గాయాలు మానిపోవు

న్యూదిల్లీ: మణిపూర్‌ రాష్ట్రంలో పరిస్థితులు నానాటికీ దిగజారిపోతున్నాయని, ఇద్దరు గిరిజన మహిళ లను నగ్నంగా ఊరేగించడం, వారిపై సామూ హిక అత్యాచారానికి పాల్పడటం హేయమైన ఘటనని, దేశానికే కళంకమని భారత కమ్యూ నిస్టు పార్టీ (సీపీఐ) ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. దిల్లీ నుంచి ఇంఫాల్‌ వరకు బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఈ హేయమైన నేరానికి పాల్పడిన దోషులే ప్రతిబింబమన్నారు. బేటీ బచావో, నారీ శక్తి పథకాలు తెచ్చి మహిళల రక్షణ, సాధికారత కోసం చాలా చేస్తున్నామని గొప్పలు పోయే బీజేపీ ప్రభుత్వ అసమర్థతకు తాజా ఘటన నిదర్శనమని వ్యాఖ్యానించారు. ప్రజలు ఇలాంటి నేరాలను ఎప్పటికి క్షమించ బోరని రాజా అన్నారు. మణిపూర్‌ సంక్షోభ పరిష్కారంలో డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైందని విమర్శించారు. హింస, అల్లర్లు, మూక హత్యలు జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లుగా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల వైఖరి ఉన్నదన్నారు. కేవలం నినాదాలు ఇవ్వడం ద్వారా గాయం మానిపోదని మహిళల నగ్న ఊరేగింపు, అత్యాచారాలను ఉద్దేశించి రాజా వ్యాఖ్యానించారు. సీపీఐ ఎంపీ వినయ్‌ విశ్వం స్పందిస్తూ ఇంతటి సిగ్గుచేటు ఘటన జరిగిన నేపథ్యంలో జీ20 అధ్యక్షతను ప్రధాని మోదీ ఎలా చేపట్టగలరని ప్రశ్నించారు. నారీశక్తి ఏమైందని నిలదీశారు. ఏ ముఖం పెట్టుకొని జీ20కి నేతృత్వం వహిస్తారని ట్విట్టర్‌ మాధ్యమంగా ప్రశ్నించారు. ‘సంఫ్‌ు ముక హింస సంస్కృతి’కి మణిపూర్‌లోని అమానవీయ ఘటన అద్దం పట్టిందని సీపీఐ ఎంఎల్‌ అధ్యక్షుడు దీపాంకర్‌ భట్టాచార్య వ్యాఖ్యానించారు. బీజేపీ డబుల్‌ ఇంజిన్‌ పాలన వాస్తవ పరిస్థితులను బట్టబయలు చేసిందన్నారు. ప్రధాని మోదీ మౌనం వహించడం ఈ నేరాన్ని సమర్థించడమే అవుతుందని ట్వీట్‌ చేశారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పందిస్తూ నేరం జరిగి 77 రోజులైతే మణిపూర్‌ అధికారులు, పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. చర్యలు తీసుకోవడంలో బాధితులకు న్యాయం చేయడంలో ఎలాంటి తొందర లేదని ఆయన ట్విట్టర్‌ మాధ్యమంగా విమర్శించారు. మోదీజీ ఇప్పటికైనా మేల్కోండి: ప్రధాని మోదీకి వినయ్‌ విశ్వం లేఖ నిద్రావస్థను వీడాలని, మణిపూర్‌ హింసపై ప్రకటన చేయాలని కోరుతూ వినయ్‌ విశ్వం గురువారం ప్రధాని మోదీకి ఒక లేఖ రాశారు. గిరిజన మహిళల వ్యవహారంలో చర్యలు తీసుకోవాలని, సరిహద్దు రాష్ట్ర ప్రజల్లో నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు కసరత్తు చేయాలని కోరారు. ఈ వీడియో దేశానికి కళంకమన్నారు. అంతర్జాతీయ స్థాయిలో అపఖ్యాతిని తెస్తుందని, దీనిని సులువుగా మర్చిపోలేరని పేర్కొన్నారు. హేయమైన ఘటన నేపథ్యంలో ఏ ముఖం పెట్టుకొని జీ20కి అధ్యక్షత వహిస్తారని ప్రశ్నించారు. ఈశాన్య రాష్ట్ర ప్రజల్లో విశ్వాసాన్ని నింపేలా సముచిత చర్యలు తీసుకోవాలని కోరారు. శాంతిభద్రతల క్షీణత, మహిళలకు గౌరవం లేకపోవడం, ప్రభుత్వ అధికారుల అసమర్థతకు తాజా ఘటన అద్దం పట్టిందన్నారు. తగు విధంగా చర్యలు తీసుకోవడంలో విఫలమైనందుకు ప్రతిపక్షా లతో పాటు సుప్రీం కోర్టు కూడా నిలదీసిందని గుర్తుచేశారు. హేయమైన నేరానికి పాల్పడిన వారు నెలలు గడుస్తున్నా స్వేచ్ఛగా తిరుగుతుండటం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శమని, మణిపూర్‌ విషయంలో మోదీ మౌనం కారణంగానే మూకలు రెచ్చిపోతున్నాయ న్నారు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పడంలో డుబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం విఫలమైందని వ్యాఖ్యానించారు. ‘మణిపూర్‌ సంక్షోభానికి పరిష్కరించడంలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల తీరు నిరాశాజనకం. అక్కడ హింస, అల్లర్లు, హత్యలకు అంతు లేకుండా పోయింది. మత శక్తుల దయకు ప్రజలను వదిలేశారు. మహిళా సాధికారతకు నినాదాలు ఇవ్వడం సరిపోదు వారి రక్షణ, సాధికారత సంక్షేమానికి చర్యలు కూడా తీసుకోవాలి. ‘యత్ర నార్యస్తు పూజ్యంతె. రమంతె తత్ర దేవతా’ అనే సంస్కృత శ్లోకాన్ని పదేపదే వల్లిస్తుంటారు. బేటీ బచావో బేటీ పడావో అంటారు. కానీ మణిపూర్‌లో మహిళలు కేవలం అవమానాలు, అత్యాచారాలు, లైంగిక దాడులు, నగ్న ఊరేగింపులతో తల్లడిల్లిపోతున్నారు. మీరిచ్చే నినాదాలతో దేశ మహిళల గాయాలు మానిపోవని గ్రహించాలి’

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img