Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

ఉక్రెయిన్‌తో చర్చలకు
సానుకూలమేగానీ…: పుతిన్‌

టెహ్రాన్‌: రష్యా, ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. రష్యాను ఏకాకిని చేసే విధంగా ఉక్రెయిన్‌ అన్ని దేశాల మద్దతును కూడగట్టుకునేందుకు ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. అటు నాటోలో చేరేందుకు సిద్ధమైంది. పాశ్చాత్య దేశాలు కూడా అండగా నిలుస్తుండ టంతో రష్యాపై దాడులను ఉక్రెయిన్‌ కొనసాగి స్తోంది. ఈ క్రమంలో శాంతి చర్చలు జరిపాలని రెండు దేశాల మధ్య దౌత్యానికి కొన్ని దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా ఆఫ్రికా నేతలు శాంతి స్థాపన కోసం ప్రతిపాదనను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ముందు ఉంచారు. దీనిపై ఆయన స్పందిస్తూ తామేమీ ఉక్రెయిన్‌తో చర్చలు జరిపే ఆలోచనకు వ్యతిరేకం కాదని చెప్పారు. ఆఫ్రికా నేతల ప్రతిపాదనల్లో కొన్ని అంశాలు ఆచరణ సాధ్యమేనన్నారు. అయితే కాల్పుల విరమణ వంటివి అసాధ్యమన్నారు. ఉక్రెయిన్‌ నిర్విరామంగా దాడులు చేస్తున్న సమయంలో కాల్పుల విరమణ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. తమపై దాడి చేస్తుంటే దీటైన బదులివ్వకుండా ఉండలేమని చెప్పారు. అయితే ఆఫ్రికా నేతలతో సుమారు రెండు గంటల పాటు శాంతి, సుస్థిరత చర్యలపై చర్చించినట్లు పుతిన్‌ తెలిపారు. ‘ఈ అంశంపై ప్రతి ఒక్కరు మాట్లాడారు. చర్చలు స్నేహపూర్వకంగానే సాగాయి. పరిస్థితిని చక్కబెట్టేందుకు ఉన్న అవకాశాలు, మార్గాల అన్వేషణే ఉద్దేశంగా స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు సాగాయి’ అని చెప్పారు. శాంతి ప్రక్రియ మొదలు కావాలంటే రెండు వర్గాల మధ్య ఏకాభిప్రాయం ముఖ్యమన్నారు. తూర్పు ఉక్రెయిన్‌లోని రష్యా జనాభా ఉండే ప్రాంతాల పరిరక్షణ కోసం ఉక్రెయిన్‌లో ప్రత్యేక సైనిక చర్యలను చేపట్టినట్లు పుతిన్‌ తెలిపారు. ఉక్రెయిన్‌ను నాటోలో చేర్చుకునేందుకు రష్యా వ్యతిరేక అజెండాతో పాశ్చాత్య దేశాలు అత్యుహాసాన్ని ప్రదర్శించడమే కాకుండా రష్యా సరిహద్దుల వరకు సైన్యాన్ని విస్తరించడంతో ఒకప్పటి సోవియట్‌ రిపబ్లిక్‌లోని ప్రాంతంపై యుద్ధం చేయక తప్పలేదన్నారు. చైనా కూడా కాల్పులను విరమించి, చర్చలు జరపాలంటూ శాంతి ప్రణాళికను ప్రతిపాదించిందని గుర్తుచేశారు. మిగతా దేశాలను, వారి ప్రాదేశిక సార్వభౌమత్యాన్ని గౌరవించాలని సూచించిందన్నారు. అణ్వాయుధాలను వినియోగించవద్దని వారించిందని చెప్పారు. క్రమంగా సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పిందన్నారు. అయితే శాంతి చర్చల విషయంలో రాజీ కుదరలేదన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img