Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ప్రైవేట్ పాఠశాలలో ఉచిత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులతో ఫీజులు వసూలు చేయిస్తున్న ఎంఈఓ పై చర్యలు తీసుకోవాలి

విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరులోని ప్రైవేటు పాఠశాలలో ఉచిత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయిస్తున్న ఎంఈఓ సువర్ణ సునియం పై చర్యలు తీసుకోవాలంటూ గురువారం స్థానిక మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఏఐఎస్ఎఫ్, విద్యార్థుల తల్లిదండ్రులు ఆధ్వర్యంలో ఏఐఎస్ఎఫ్ మండల అధ్యక్షులు అరుణ్ అధ్యక్షతన ధర్నా నిర్వహించారు.ఏఐఎస్ఎఫ్ మంత్రాలయం తాలూకా అధ్యక్షుడు ఎస్.ఈరేష్ మండల కార్యదర్శి షెక్షవలి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్య హక్కు చట్టం 2009 సెక్షన్ 12 (1)ద్వారా అప్లై చేసుకున్న ప్రతి పేద బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలల్లో ఉచితంగా విద్యను అందించాలని జీవో జారీ చేస్తుంటే కానీ పెద్దకడబూరు మండలం ఎంఈఓ జీవోలకు విరుద్ధంగా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు రెయిన్బో, బాల వికాస్, శ్రీ వేంకట సాయి యుపి,పాఠశాలల యాజమాన్యాలు ద్వారా విద్య హక్కు చట్టాన్ని నీరుగారిస్తూ ఉచిత విద్యను అభ్యాసిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులతో ఫీజులు కట్టాలని ముక్కు పిండి వేలుకు వేలు ఫీజులు వసూలు చేస్తున్నారు ఆవేదన వ్యక్తంచేశారు. ఎంఈఓ ఎలాంటి కాపిగాని జీవో గాని విద్యార్థుల తల్లిదండ్రులకు చూపించకుండా ఫీజులు ఏలా వసూలు చేస్తారని ఎంఈఓ తీరుపై మండిపడ్డారు. విద్యార్థుల తల్లిదండ్రులు రాజు, ఆంజనయ్య, దుబ్బన్న ,రంగన్న,చిన్న మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేద విద్యార్థి చదువుకోవాలని విద్య హక్కు చట్టం ద్వారా విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తుంటే, పాఠశాల యాజమాన్యం ఫీజులు కట్టాలని ఫోన్ ద్వార ఒత్తిడి చేస్తున్నారన్నారు . ఈ విషయంపై ఎంఈఓ ను వివరణ కోరితే సరైన సమాధానం చెప్పకుండా ఎలాంటి జీవో కాఫీలు చూపించకుండా ఫీజు కట్టాల్సిందేనని ఖరాఖండిగా చెప్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు ఎంఈఓ పైన పాఠశాల యాజమాన్యాల పైన విచార చేపట్టి చర్యలు తీసుకోవాలి అలాగే ఫీజులు కట్టించుకున్న ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం నుండి తిరిగి విద్యార్థి తల్లిదండ్రులకు ఫీజులు చెల్లించెలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు లేనిపక్షంలో పెద్ద ఎత్తున డివో ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు హజరత్ బాషా,రియన్ ఉసేన్ బాషా, సమీర్,రాము ప్రవీణ్, విద్యార్థుల తల్లిదండ్రులు రాజు, ఆంజనేయ,దుబ్బాన్న,రంగన్నతదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img