Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

బేటీ బచావో- బేటి పడావో పోస్టర్ ను విడుదల చేసిన ప్రముఖ నటుడు మంచు మనోజ్

విశాలాంధ్ర – నంద్యాల : నంద్యాల పట్టణం రామకృష్ణ డిగ్రీ కళాశాల నందు బుధవారం నాడు బేటి బచావో- బేటి పడావో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ నటుడు మంచు మనోజ్, కళాశాల చైర్మన్ ప్రొఫెసర్ జి .రామకృష్ణారెడ్డి, కళాశాల డైరెక్టర్ జి. హేమంత్ రెడ్డి, కళాశాల ఎస్టేట్ మేనేజర్ ప్రగతిరెడ్డి, ఐసిడియస్ అధికారులు జి. నాగసువర్చల, డాక్టర్ ప్రసన్నలత, టి.ఆర్ఎం చంద్రకళ (సిడిపిఓ)నంద్యాల అర్బన్ ప్రాజెక్ట్, తిరుపతిరావు, వరల్డ్ విజన్ ఎన్ 40, రామారావుతో పాటు
కళాశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్య అతిథి, ప్రముఖ నటుడు మంచు మనోజ్ మాట్లాడుతూ ఇంత అవగాహన ఉన్న సమాజంలో ఇప్పటికి కూడా ఆడపిల్లని రక్షించాల్సి వస్తుందని, ఎవరో వస్తారు ఎవరో కాపాడతారు అని కాదు మిమ్మల్ని మీరే కాపాడుకుంటూ రక్షించుకోవాలని, ఇతరులకు మీరు ధైర్యాన్నివ్వాలని, అలాగే అబ్బాయిలు కూడా మీ ఇంట్లో, మీ చుట్టుపక్కల ఉన్న ప్రతి అమ్మాయిని గౌరవిస్తూ వారిలో ధైర్యాన్ని ఇవ్వాలన్నారు. అమ్మాయిలు ఆదిపరాశక్తులు వారు తలుచుకుంటే ఏదైనా చేయగలరన్నారు. అనంతరం ముఖ్య అతిథి మంచు మనోజ్ ను ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img