Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

నంద్యాలలో నేచురల్ బ్యూటీ సెలూన్ ప్రారంభం

విశాలాంధ్ర – నంద్యాల : నంద్యాలలో నేచురల్ బ్యూటీ సెలూన్ ను ఎమ్మెల్యే శిల్పా, శాంతిరాం విద్యాసంస్థల చైర్మన్ మిద్దె శాంతి రాముడులు ప్రారంభించారు. నంద్యాల పట్టణం పద్మావతి నగర్ లో
ప్రారంభించిన ఈ బ్యూటీ సెలూన్ 758వ బ్రాంచి అని, నంద్యాలలో మెట్రో పాలిటన్ సిటీలకు దీటుగా ఇటువంటి పట్టణ ప్రాంతాలతో నూతనంగా ఆధునికపోకడలతో ఇటువంటి సెలూన్ లను నిర్వహించడం అభినందనీయమని, పట్టణ, పరిసర ప్రాంతాల ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ సెలూన్ లో ప్రత్యేకంగా హైడ్రో ఫేసియల్, మార్చి ఆఖరు వరకు 25 శాతం డిస్కౌంట్ తో అన్ని రకాల బ్యూటీ సేవలు చేయనున్నట్లు నిర్వాహకులు విజయ్ కృష్ణ, జస్వంత్, భవ్యలు తెలిపారు. దేశవ్యాప్తంగా నేచురల్ బ్యూటీ సెలూన్ లున్నాయని, నంద్యాల లో అన్ని హంగులతో, మహిళలకు, పురుషులకు ప్రతేక గదులతో పాటు అనుభవమయిన బ్యూటిషియన్ ల. నిర్వహణలో నిర్వహించడం జరుగుతుందని, కావున నంద్యాల, పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సాధారణ, మధ్యతరగతి ప్రజలకు కూడా అందుబాటు ధరల్లో ఉంచామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img