Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Saturday, September 21, 2024
Saturday, September 21, 2024

పార్వతీపురం మన్యంజిల్లా కేంద్రంలో ఘనంగా జరిగిన విశాలాంధ్ర 72వ వార్షికోత్సవ వేడుకలు

ముఖ్యఅతిథులుగా పార్వతీపురం పురపాలక సంఘ కమిషనర్, డిపిఆర్ఓ, ప్రముఖ కథారచయిత, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, పట్టణ ఎస్ఐ, ఏపీయూడబ్ల్యూజే యూనియన్ నాయకులు
***పేదలపక్షాన నిలిచే పత్రికగా విశాలాంధ్రను కొనియాడిన వక్తలు

విశాలాంధ్ర, పార్వతీపురం టౌన్/బెలగాం: ప్రతీక్షణం ప్రజలకోసం ఆలోచన చేస్తూ పేద, బడుగు ,బలహీన వర్గాల అభ్యున్నత కోసం విశాల దృక్పథంతో వార్తలను రాస్తున్న విశాలాంధ్ర దినపత్రిక 72 వార్షికోత్సవాలు పూర్తిచేసుకోవడం ఎంతో ఆనందదాయకమని పార్వతీపురం పురపాలక సంఘం కమిషనర్ కోనా శ్రీనివాసరావు, డిపిఆర్ఓ లోచర్ల రమేష్, ప్రముఖకవి,కథారచయిత గంటేడ గౌరు నాయుడులు తెలిపారు. శనివారంనాడు విశాలాంధ్ర 72వ వార్షికోత్సవ వేడుకలను పార్వతీపురం మన్యంజిల్లా కేంద్రంలోని పురపాలక సంఘంకార్యాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. 72వ వార్షికోత్సవం సందర్భంగా కేకునికోసి అందరికీ పంచిపెట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. 1952లో ప్రారంభమైన విశాలాంధ్ర అన్నివర్గాల వారికి సుపరిచితమైన పత్రికని, ఎన్నో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఎదుర్కొని నిలవడం ఎంతో అభినందనీయమన్నారు. ఒక్కరోజు కూడా ఆగకుండా పత్రికను నడపడం నిజంగా నేటి పోటీ ప్రపంచంలో కూడా విశాలాంధ్ర దీటుగా నిలబడి పనిచేయడం గర్వించదగ్గరన్నారు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర విభజనలో విశాలాంధ్ర పత్రిక పాత్ర ఎంతో ఉందన్నారు.విశాలాంధ్ర పేదల పక్షాన నిలిచే పత్రికని,ఫోర్త్ ఎస్టేట్ గూర్చి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చింతల చలపతిరావు, పార్వతీపురం పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ బి . రవీంద్రరాజులు వివరించారు. నేటి ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికల ప్రాధాన్యతను వారు వివరించారు. ప్రజాస్వామ్యంలో పత్రికలు కీలకమైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. విశాలమైన హృదయం కలిగిన పత్రికగా విశాలాంధ్రకు, విశాలాంధ్ర పత్రిక విలేకరులకు పేరుందన్నారు.ఈకార్యక్రమంలో విశాలాంధ్ర స్టాఫ్ రిపోర్టర్ మంతిని రమేష్, సిపిఐ నాయకులు, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి ఆర్ వి ఎస్ కుమార్, ఏపీయూడబ్ల్యూజే అధ్యక్ష,కార్యదర్శులు కిషోర్ కుమార్, గంగి శ్రీనివాసరావు, కోశాధికారి సాలాపు అనంతరావు, పార్వతీపురం పట్టణ విశాలాంధ్ర విలేకరులు వానపల్లి శంకర్రావు, సాలాపు అనంతరావు , అగ్రిగోల్డ్ యూనియన్ రాష్ట్రఅధ్యక్షులు ఈవినాయుడు, ఎల్ టి పి జిల్లా అధ్యక్షులు జయకృష్ణ, సానిటరీ ఇన్స్పెక్టర్ మురళి, విశాలాంధ్ర విలేకరులు నెల్లి శ్రీనివాసరావు (కురుపాం), కరణం సత్యనారాయణ (మక్కువ), డొల్లు మన్మధరావు (కొమరాడ), కాంతారావు (పాలకొండ), వెంకటేష్ (సీతంపేట), చినగుడబ చంద్రమౌళి (గరుగుబిల్లి), ఇతర విలేకరులు ఎస్. గౌరిశంకర్ (ఆంధ్రజ్యోతి), పి. పురుషోత్తం (ప్రజాశక్తి), చెవిటి వెంకటరమణ (ప్రజాశక్తి), సత్యానంద్ (అక్షర సూర్య), అట్ల దివాని (జర్నలిస్ట్ పవర్) తదితరులతోపాటు పురపాలక కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img