Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Saturday, September 21, 2024
Saturday, September 21, 2024

ఆస్తి, ఖాళీ జాగా పన్నుపై వడ్డీ మాఫీ.. మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్

విశాలాంధ్ర ధర్మవరం:: ఆస్తి పన్ను, ఖాళీ జాగా పన్నుపై వడ్డీ మాఫిను సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ జీవో నెంబర్ 35 ప్రకారం ఆస్తి,కాలీజాగా పన్నుల విషయంలో ఈ ఆర్థిక సంవత్సరం వరకు ఉన్న పాత బకాయిలు పన్నుపై విధించిన వడ్డీని ఏక మొత్తంగా మాఫీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ వడ్డీ మాఫీ పొందాలంటే పన్ను చెల్లింపు దారులు బకాయి ఉన్న మొత్తాన్ని ఈ ఆర్థిక సంవత్సరంతో సహా ఒకేసారి ఏక మొత్తంగా ఈనెల 31వ తేదీ చెల్లించినట్లయితే ఈ వడ్డీ మినహాయింపు వర్తిస్తుందని వారు తెలిపారు. కావున ఆస్తి పన్ను చెల్లింపుదారులు ఈ యొక్క సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వడ్డీ మినహాయింపు లబ్ధిని పొందాలని తెలిపారు. పన్ను చెల్లింపులు పన్నుల వసూలు కౌంటర్ నందు కానీ సంబంధిత వార్డు సచివాలయంలో గాని చెల్లించవచ్చునని, అంతేకాకుండా పన్నులను ఆన్లైన్ ద్వారా, నెట్ బ్యాంకింగ్ ద్వారా, డెబిట్ అండ్ క్రెడిట్ కార్డుల ద్వారా, యూపీఐ ద్వారా కానీ చెల్లించవచ్చునని తెలిపారు. పన్ను చెల్లింపు కేంద్రములు మున్సిపల్ ఆఫీసు నందు లేదా ఎల్సికేపురం సచివాలయము లేదా ఎల్ పి సర్కిల్ (అన్నా క్యాంటీన్), ఎస్బిఐ కాలనీలోని సచివాలయం, పార్థసారథి-2 సచివాలయములలో ఉదయం 8 నుండి సాయంత్రం 6 వరకు పని చేస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని మున్సిపల్ ఆదాయ అభివృద్ధికి సహకరించాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img