Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

కంటి శుక్లమును ప్రారంభ దశలోనే గుర్తించాలి, లేనియెడల కంటిచూపు పోయే అవకాశాలు ఉన్నాయి…

రిటైర్డ్ జిల్లా అంధత్వ నివారణ అధికారి డాక్టర్ ఎస్. నరసింహులు

విశాలాంధ్ర ధర్మవరం:: కంటి శుక్లమును ప్రారంభ దశలోనే గుర్తించి, తగిన సమయంలో కంటి ఆపరేషన్ చేసుకోవాలని, నిర్లక్ష్యం చేసిన ఎడల కంటిచూపు పోయే ప్రమాదం ఉందని రిటైర్డ్ జిల్లా అందత్వ నివారణ అధికారి, కంటి వైద్య నిపుణులు. డాక్టర్. ఎస్. నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా కంటి శుక్ల మాసోస్తవాలు సందర్భంగా ప్రజలకు కంటి శుక్లముపై అవగాహన విషయాలను వారు వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ కంటి చూపు పోయే ప్రమాదం ఉంది అంటే దానికి కారణం కంటి శుక్లము అని తెలిపారు. కంటి శుక్లాం నొప్పి లేకుండానే క్రమేనా చూపు తగ్గుతూ వస్తుందని, కంటి శుక్లము రావడం సహజంగా వస్తుందని తెలిపారు. కంటి శుక్లము రాకముందు వచ్చిన తర్వాత వాటిని వివరంగా చిత్రపటం ద్వారా వివరించారు. షుగర్ వ్యాధికి ఉన్నవారు కంటి శుక్లము వస్తుందని, బట్ట తెర కనబడినట్లు కంటి శుక్లము వస్తుందని నిర్లక్ష్యం చేయరాదని, చేస్తే కంటి చూపు పోయే ప్రమాదం ఉందని తెలిపారు. కంటి శుక్లమ్మును ప్రారంభ దశలో గుర్తించి కంటి వైద్యుల ద్వారా వైద్య చికిత్సలు పొంది కంటి అద్దాలను వాడకం ద్వారా నివారించే అవకాశం కూడా కలదని తెలిపారు. కంటి శుక్లమునకు శుక్లము మందు వేస్తే రోగము నయము కాదని, కంటి శుక్లమునకు ఏకైక పరిష్కారం కంటి ఆపరేషన్లను చేయడమే ప్రధాన పరిష్కారం అని తెలిపారు. కొంతమంది కంటి శుక్లము ముదిరిన తర్వాత ఆపరేషన్ చేయించుకున్న ఫలితం ఉండదని తెలిపారు. ఈ ఆపరేషన్లు కేవలం 15 నిమిషాల్లో మాత్రమే పూర్తి అవుతుందని, ఎటువంటి అపూహలకు తావు ఇవ్వరాదని తెలిపారు. పుట్టుకట్టు లేకుండా ఆపరేషన్ ద్వారా కంటి శుక్లమును తొలగించి కంటి మకటమును (ఐ ఓ ఎల్) అమర్చుతారని తెలిపారు. కన్ను ఎర్రగా గాను నొప్పిగా ఉంటే వెంటనే కంటి డాక్టర్లను సంప్రదించాలని, నెల నుండి ఆరు వారాలు తర్వాత డాక్టర్ తో చికిత్స చేసి అవసరమైతే అద్దాలను కూడా వాడాలని తెలిపారు. ఆపరేషన్ చేయకపోతే కంటి చూపు పూర్తిగా పోవడమే కాక జీవితాంతం గుడ్డితనముతోనే బ్రతకాల్సి వస్తుందని తెలిపారు. ఈ కంటి శుక్లము ఆపరేషన్లు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా నిర్వహిస్తారని, జిల్లా అందత్వ నివారణ సహకారంతో ఆర్థిక సహాయం పొందుతారని తెలిపారు. కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు ఉచిత కంటి ఆపరేషన్ల పేరుతో సేవాభావంతో సేవ చేయటం లేదని, వారికి జిల్లా అంతత్వ నివారణ తో నిధులు సమకూర్చుతాయని తెలిపారు. ఈ కంటి శుక్లము యొక్క మాసొస్తవాలు జూన్ నెల వరకు నిర్వహిస్తారని తెలిపారు. కెమెరాలో కటకం (లెన్స్) ఉన్నట్లుగానే కంటిలో కూడా కటకం ఉంటుందని తెలిపారు. కంటి శుక్లాలు పుట్టుకతో వచ్చుట, వృద్ధాప్యంలో వచ్చేవి, కంటి జబ్బుల వలన, చక్కెర వ్యాధి వలన, కొన్ని మందుల వలన కూడా కంటి శుక్లములు తప్పక వస్తాయని తెలిపారు. కంటి శుక్లము యొక్క లక్షణాలలో ప్రకాశవంతమైన కాంతిని చూడలేకపోవడం, వాహనాల యొక్క కాంతిని భరించలేక నిలబడిపోవడం, కంటి చూపులో నల్ల మచ్చలు కనిపించడం, గ్రామీణ కంటి చూపు తగ్గడం లాంటివి లక్షణాలు అని తెలిపారు. టార్చ్ లైట్ వెలుతురుతోనే శుక్లములను గుర్తించిన, మైక్రోస్కోప్ ద్వారా పరీక్షించడం ఎంతో అవసరమని తెలిపారు. కంటికి చుక్కల మందు ల వలన కంటి శుక్లము కరిగిపోయే అవకాశం లేదు అని తెలిపారు. కంటి శుక్లము ఆపరేషన్ చేసే ముందు, మూత్ర పరీక్ష, రక్తపోటు పరీక్ష, కంటిలో ఒత్తడి గుర్తించుట, కంటిలో నీటి ప్రవాహంలోని అడ్డంకులను పరీక్షల ద్వారా గుర్తించాలని తెలిపారు. కంటి శుక్లము కు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత డాక్టర్ సూచించిన మేరకు తప్పకుండా చుక్కల మందులు క్రమేనా వేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వే తర స్వచ్ఛంద సంస్థల ద్వారా కూడా రవాణా సౌకర్యంతో పాటు మందులు కంటి అద్దాలు ఉచితంగా పొందవచ్చునని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img