Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

ప్రజలు వడదెబ్బ పట్ల అప్రమత్తంగా ఉండాలి

ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ మాధవి

విశాలాంధ్ర ధర్మవరం:: ప్రజలు వడదెబ్బ పట్ల అప్రమత్తంగా ఉండాలని, స్థానిక ప్రభుత్వ ఆసుపత్రులలో గాని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో గాని సకాలంలో వైద్య చికిత్సలు పొంది తమ ఆరోగ్యమును కాపాడుకోవాలని ప్రభుత్వాసుపత్రి చూపెట్టెంట్ డాక్టర్ మాధవి తెలిపారు. ఈ సందర్భంగా వారు పలు విషయాలను ప్రజలకు తెలియజేశారు. ప్రస్తుతం పట్టణము గ్రామీణ ప్రాంతాలలో ఎండ వేడిమి అధికంగా ఉన్నందున, అవసరమైతే తప్ప ప్రజలు బయటికి రారాదని, అధికంగా నీరు సేవించాలని, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్ లాంటివి అతి తక్కువగా వాడాలని తెలిపారు. ఎండ సమయములో అధికంగా తిరగరాదని మద్యం సేవించరాదని, రోడ్లమీద చల్లని రంగు పానీయాలను తగరాదని కలుషిత ఆహారం తినరాదని, సాధ్యమైనంతవరకు మాంసాహారాన్ని తగ్గించి, తాజా కూరగాయల్ని అధికంగా తీసుకోవాలని తెలిపారు. ఇంటిలోనూ చుట్టుపక్కల పరిశుభ్రత పాటించాలని దోమలు లేకుండా చూసుకోవాలని దోమతెరలు వాడాలని, వేపాకు పొగ వేసుకోవాలని తెలిపారు. త్రాగునీరు, పళ్ళ రసాలు, కొబ్బరి నీళ్లు, ద్రవపదార్థాలు అధికంగా తీసుకోవాలని, రెండు పూటలా స్నానం చేయాలని భోజనం మితంగా చేయాలని, కాటన్ వస్తువులు మాత్రమే ధరించాలని, అత్యవసర సమయాలలో బయటికి వస్తే గొడుగు, టోపీ లాంటివి వెంట తీసుకొని ధరించుకొని, వెళ్లాలని తెలిపారు. వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ గల ప్రదేశానికి చేర్చాలని, ఐస్ నీటితో ముంచిన తడి గుడ్డతో శరీరాన్ని తుడవాలని తెలిపారు. ఫ్యాను లేదా చల్లటి గాలి తగిలేలా ఉంచుకోవాలని తెలిపారు. వడదెబ్బ తగిలి అపస్మానిక స్థితిలో ఉన్న రోగికి ఎటువంటి పరిస్థితుల్లోనూ నీరు త్రాగించరాదని తెలిపారు. వీలైనంతవరకు ప్రభుత్వ లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెంటనే వైద్య చికిత్సలు అందించాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img