Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ఉచిత కంటి వైద్య శిబిరమును పేద ప్రజలు సద్వినియోగం చేసుకోండి.. యువర్ ఫౌండేషన్ సంస్థ

విశాలాంధ్ర- ధర్మవరం : పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) ఈనెల నాలుగవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు యువర్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర, కార్యదర్శి ఆర్. జయరాం, కోశాధికారి బండి నాగేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని స్వాతి క్లినిక్ లో వైద్య శిబిరం యొక్క కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ శిబిరం యువర్స్ ఫౌండేషన్ వారి సౌజన్యంతో జిల్లా ఆంధత్వ నివారణ సంస్థ శ్రీ సత్యసాయి జిల్లా, నేత్రాలయ ఐ క్లినిక్ వారి సహకారంతో, పుష్పగిరి కంటి ఆసుపత్రి- కడప వారిచే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిబిరంలో కంటి శుక్లములు గల వారికి ఉచితంగా పరీక్షలు నిర్వహించి అర్హులైన వారికి ఆరోగ్యశ్రీ లేదా ఈ హెచ్ ఎస్ నిబంధనల ప్రకారం ఆపరేషన్లు నిర్వహించబడునని తెలిపారు. ఈ శిబిరానికి వచ్చువారు ఆరోగ్యశ్రీ లేదా ఈ హెచ్ ఎస్ కార్డ్ తో పాటు బ్యాంక్ పాస్బుక్, ఆధార్ కార్డు వెంట తీసుకొని రావాలని తెలిపారు. అదేవిధంగా కాంటాక్ట్ లెన్స్ కూడా అమర్చబడునని, కంటి శుక్లములకు ఆధునిక ఆపరేషన్, మెల్లకన్ను, రెటీనా, కార్నియా, గ్లూకోమా ఆపరేషన్లు కూడా నిర్వహించబడును అని తెలిపారు. ఈ శిబిరానికి క్యాంపు చైర్మన్గా శ్రీకాంత్ రెడ్డి నిర్వహిస్తూ, ఆప్తాల మీకు అసిస్టెంట్ గా నాగరాజా ఆచారి వ్యవహరిస్తారని తెలిపారు. మరిన్ని వివరాల కొరకు సెల్ నెంబర్ 9440248192 లేదా 988 6643560కు గాని సంప్రదించవచ్చునని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని గ్రామీణ పట్టణ ప్రాంత పేద ప్రజలు సద్వినియోగం చేసుకొని కంటి వెలుగును ప్రసాదించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు సుకుమార్, సభ్యులు చాంద్ బాషా, మోహన్, గర్రె రమేష్ బాబు, డాక్టర్. బివి. సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img