Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సీరియస్ గా నిర్వహించాలి

ప్రతి శాఖలోనూ సర్వీస్ మ్యాటర్స్ కు సంబంధించి నోడల్ అధికారులను నియమించాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్

విశాలాంధ్ర- అనంతపురం : ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా అధికారులు సీరియస్ గా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ ఆదేశించారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక, డయేరియా, సర్వీస్ మ్యాటర్స్, తదితర అంశాలపై వివిధ శాఖల జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఎన్నికల అనంతరం మళ్ళీ మొదలుపెట్టడం జరిగిందన్నారు. ప్రతి సోమవారం జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని జాగ్రత్తగా నిర్వహించాలన్నారు. డయేరియాకు సంబంధించి జిల్లాలో కేసులు పెరుగుతున్నాయని, డయేరియాను అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో స్టాప్ డయేరియా క్యాంపెయిన్ చేపట్టాలని, ఎక్కడా చెత్త రోడ్డుపై వేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీటి పైప్ లైన్ లపై చెత్తను వేయరాదన్నారు. ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవాలని, ఆర్డీవోలు, ఎంపిడివోలు, ఎంఈవోలు, మున్సిపల్ కమిషనర్లు, తదితరులు హ్యాండ్ వాష్ పై డెమోనిస్ట్రేషన్ చేయాలని, చేతులు కడిగి చూపించాలన్నారు. నీటిని తాగేటప్పుడు వేడి చేసి చల్లార్చి తాగాలని, ఈ అంశాలపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలన్నారు. చెత్త సేకరణ, తొలగింపు ఖచ్చితంగా చేపట్టాలని, కమ్యూనిటీ టాయిలెట్స్ శుభ్రంగా ఉంచాలని, క్లీన్లీ నైస్ డ్రైవ్ చేపట్టాలన్నారు. క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి ఓఆర్ఎస్ కలపడం, తాగడం, ఉపయోగంపై డెమోనిస్ట్రేషన్ చేయాలన్నారు. డిఎంహెచ్ఓ, డిసిహెచ్ఎస్, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ లు ఎక్కడైనా డయేరియా కేసులు వస్తే తక్షణమే చికిత్స అందించాలన్నారు. ఎక్కడ కేసులు వచ్చినా వెంటనే రిపోర్ట్ చేయాలని, కిడ్నీ ఫెయిల్యూర్లు రాకుండా చూసుకోవాలన్నారు. పాఠశాలల్లో డయేరియాపై అవగాహన కల్పించేలా పోస్టర్స్ రిలీజ్ చేయాలని సూచించారు. డయేరియాపై విస్తృతంగా అవగాహన కల్పించాలని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యం, ప్రవర్తన పరంగా జాగ్రత్తగా ఉండాలని, ఎక్కువ జనాభా ఉన్న, మురికి వాడల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలన్నారు.
ఏ ప్రభుత్వ కార్యక్రమమైనా షెడ్యూల్ లో నమోదు చేసుకొని ప్రతి కార్యక్రమానికి మినిట్ టు మినిట్ తయారు చేయాలని, దానిని పాటించాలన్నారు. ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అవగాహన కల్పించాలని, ప్రతి కార్యక్రమంపై సంబంధిత అధికారులకు ముందుగానే తెలియజేయాలని, ఆయా శాఖల అధికారులు సమన్వయం చేసుకొని పనిచేయాలన్నారు. జిల్లాలోని తహసిల్దార్ కార్యాలయాల్లో ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ల జాబితా అందించాలని, వారి బయోమెట్రిక్ అటెండెన్స్ వివరాలు కూడా ఇవ్వాలన్నారు. సర్వీస్ మ్యాటర్స్ కు సంబంధించి కారుణ్య నియామకాలను ఆయా శాఖల అధికారులు పూర్తిచేయాలని, కంపార్స్మెంట్ అపాయింట్మెంట్ పథకం ప్రకారం డ్రైవ్ పెట్టి పెండింగ్ నియామకాలను చేపట్టాలన్నారు. ప్రతి శాఖలోనూ సర్వీస్ మ్యాటర్స్ కు సంబంధించి నోడల్ అధికారులను నియమించాలని, వారితో వాట్సప్ గ్రూప్ తయారు చేయాలన్నారు. రెవెన్యూ సర్వీసులకు సంబంధించి ప్రతిరోజు మానిటర్ చేయాలని, పెండింగ్ ఉంచకుండా సర్వీసులను పరిష్కరించాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, నగర పాలక సంస్థ కమిషనర్ మేఘ స్వరూప్, జిల్లా పరిషత్ సీఈవో వైఖోమ్ నిదియా దేవి, డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, డిపిఓ ప్రభాకర్ రావు, వ్యవసాయ శాఖ జెడి ఉమామహేశ్వరమ్మ, పశుసంవర్ధక శాఖ జెడి సుబ్రహ్మణ్యం, ఐసిడిఎస్ పిడి శ్రీదేవి, డిఎంహెచ్ఓ డా.ఈబి.దేవి, డిసిహెచ్ఎస్ పాల్ డా.రవికుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఎహసాన్ భాష, కలెక్టరేట్ ఏవో అంజన్ బాబు, జిల్లా సైనిక సంక్షేమ అధికారి పి.తిమ్మప్ప, డీఆర్డీఏ పిడి నరసింహా రెడ్డి, డ్వామా పిడి వేణుగోపాల్ రెడ్డి, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ సురేంద్ర, హార్టికల్చర్ డిడి ఫిరోజ్ ఖాన్, ఏపీఎంఐపి పిడి రఘునాథరెడ్డి, ఏపీఎస్ఆర్టీసీ ఆర్ఎం సుమంత్, సోషల్ వెల్ఫేర్ జెడి మధుసూదన్, డిటిసి వీర్రాజు, గ్రౌండ్ వాటర్ డిడి తిప్పేస్వామి, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నాగరాజారావు, ఆర్ అండ్ బి ఎస్ సి ఓబుల్ రెడ్డి మైండ్స్ డిడి నాగయ్య, వికలాంగుల సంక్షేమ శాఖ ఏడి రసూల్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img