Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

మన్యంజిల్లా అభివృద్ధికి ఇంజనీర్ల సేవలు ఎంతో అవసరం

61యూనిట్లను రక్తదానంచేసిన ఇంజనీర్లును అభినందించిన జిల్లాకలెక్టర్

విశాలాంధ్ర, పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లా అభివృద్ధిలో, మౌలికసదుపాయాలు కల్పనలో ఇంజినీర్లు సేవలు ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్  నిశాంత్ కుమార్ తెలిపారు.గురువారం జిల్లా పంచాయతీరాజ్ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఇంజినీర్స్  డే  వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలనచేసి,మోక్షగుండం  విశ్వేశ్వరయ్యచిత్రపటానికి  పూలదండలువేసి నివాళులు  అర్పించారు.అనంతరం వారు,పార్వతీపురంబ్లడ్ బ్యాంకు వారు ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈకార్యక్రమంలో  ఆయన మాట్లాడుతూ  సమాజ అభివృద్ధిలో  భాగస్వాములైన  ఇంజినీర్స్అందరికీ ఇంజినీర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు.  మోక్షగుండం  విశ్వేశ్వరయ్యసేవలను వివరించి అంతా  విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకొని పని చేయాలనికోరారు.విశేష సేవలందించిన  విశ్రాంతఇంజినీర్లు  విజయకుమార్, లక్ష్మణరావులను సన్మానించారు.  ఉత్తమ  సేవలు అందించిన  డిప్యూటీ ఇంజినీర్లు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు ,  టెక్నికల్ అసిస్టెంట్లకు  ప్రశంసాపత్రాలను అందించారు. జిల్లా, డివిజన్, మండల, సచివాలయాలకు చెందిన 61మందిఇంజనీర్లు, సిబ్బంది రక్తాన్ని దానం చేశారు. ప్రతీ ఒక్కరూ రక్తదానం  చేసి మరొకరిప్రాణాన్ని నిలబెట్టడంతోపాటు పార్వతీపురం మన్యం జిల్లాలో రక్తం కొరతను నివారించాలనిజిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిడాక్టర్ జగన్నాథరావు , జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వాగ్దేవి,బ్లడ్ బ్యాంకు ఇంఛార్జి డాక్టరువినోద్ లు తెలిపారు.యువత ముందుకు వచ్చి రక్తదానం చేయాలని వారు పిలుపు నిచ్చారు.ఈకార్యక్రమంలో  జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి డా.ఎం.వి.జి.కృష్ణాజి, చంద్రమౌళి, జిల్లా ఆర్.డబ్ల్యు.ఎస్ ఇంజినీరింగ్ అధికారి ప్రభాకర రావు, గృహనిర్మాణసంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ రఘురాం, పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు, గృహనిర్మాణశాఖ,  గిరిజన సంక్షేమ శాఖలకు చెందిన ఇంజినీర్లు, సిబ్బందితోపాటు బ్లడ్ బ్యాంకు స్టాఫ్ మధుకర్, మురళి, కోటనాయక్, నాయుడు,గౌరీశంకర్,కిరణ్, జ్యోతి స్టాఫ్ నర్స్ వనిత జిల్లా ఎన్ జి ఓ ప్రెసిడెంటు కిషోర్ తదితరులు పాల్గొన్నారు.  

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img