Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

అభ్యర్థులకు చుక్కలు చూపుతున్న ఓటర్లు

బావ మరుదుల మధ్య ఇండిపెండెంట్ ప్రచార జోరు

  • ప్రధాన పార్టీలను పట్టించుకోని ఓటరు
    విశాలాంధ్ర ఆముదాలవలస (శ్రీకాకుళం) : సార్వత్రిక ఎన్నికల సమరానికి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసి పది రోజు లైనా ప్రధాన పార్టీ అభ్యర్థుల ప్రచారం జోరందుకోలేదు. మరోవైపు వైసీపీలో టిక్కెట్ ఆశిం చి బంగపడ్డ సువ్వారి గాంధీ ప్రధాన పార్టీల అభ్యర్థులను తలదన్నేలా ప్రచారం లో ముందుకు దూసుకుపోతున్నారు. అయితే ఓటర్ మాత్రం బింకం వహిస్తూ అభ్యర్థులకు చెమటలు పట్టిస్తున్నారు. ఆమదాలవలస అంటే గతంలో బొడ్డేపల్లి వెర్సెస్ తమ్మినేని కుటుంబాలు మాత్రమే. తాజా పరిస్థితులు అలా లేవు. టిడిపి నుంచి కూన రవికుమార్ కు ప్రత్యర్థి లేకపోవడంతో అభ్యర్థి ఎంపిక తేలికయింది. అయితే వైసీపీ నుంచి తమ్మి నేని సీతారాం తో పాటు గాంధీ, చింతాడ రవికుమార్లు టిక్కెట్ ఆశించారు. సువ్వారి గాంధీకి వైసీపీ అధిష్టానం టికెట్ ఇస్తామని మాట తప్పిందని, సీతారాంకే మొగ్గుచూపు డంతో గాంధీ రెబల్ అభ్యర్థిగా మారారు. చింతాడ రవి కుమార్ ను బుజ్జగించి ఇచ్చా పురం నియోజకవర్గ పరిశీలకునిగా నియమి స్తూ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత నామినేటెడ్ బదులు ఇస్తామని చెప్పడంతో చల్లబ డ్డారు అని వినికిడి. గాంధీ మాత్రం గత జగన్ ప్రజా సంకల్ప యాత్రలో తనకు సీటు ఇస్తా నని మాట ఇచ్చి తప్పారని అందుకే ఇండి పెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగానని బాహా టంగానే చెబుతున్నారు. ఈ క్రమంలో సీతా రాంకు టికెట్ ప్రకటించిన వెంటనే గాంధీ తిరుగుబాటు ప్రకటించి ఆయన కుటుంబా నికి ఇచ్చిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవిని త్యజించి ఆయన వర్గం వారిచే రాజీనామాలు చేయించి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు. అంతే కాకుండా ప్రధాన పార్టీలను కాదని నియోజక వర్గ ప్రచారంలో గాంధీయే దూసుకుపోతు న్నారు. ప్రతి గ్రామంలో తనకంటూ బందు వర్గాన్ని తన వైపు తిప్పుకొని ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఆయన వెనుక జనం కూడా బాగానే వస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులైన వందనం బావ బావ మరుదులు సీతారాం, రవికుమార్ ప్రచారం నిర్వహిస్తు న్నప్పటికీ జనం అంతగా పోగవడం లేదు. వారి కుటుంబ సభ్యులతో ప్రచారం నిర్వ హిస్తున్న ప్రజలు మాత్రం వారి వెంట నడవ డం లేదు. దీంతో అభ్యర్థులు బయటకు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ లోపల ఆందోళన చెందుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. మరోవైపు ఎన్నికలకు ఎక్కువ సమయం ఉండటంతో ప్రధాన పార్టీ అభ్య ర్థులు సమయం ఇంకా ఉందిలే అన్న ధీమా తో కూడా ఉన్నారు. ప్రచారానికి వెళ్తే రోజుకు లక్షల్లో ఖర్చు కానుండడంతో ప్రస్తుతానికి కానిచ్చాము ,, అన్నట్టు నిర్వహిస్తున్నారు. మున్ముందు దీన్ని ఉధృతం చేసి దూసుకె ళ్తామని శ్రేణులు వద్ద చెబుతున్నారు. సీతా రాం రవికుమార్ వెంట ప్రచారంలో ప్రధాన మైన శ్రేణులు తప్ప జనం కనిపించడం లేదు. మరోవైపు గాంధీ బావ మరుదు ల మధ్య ఆముదాలవలస నియోజకవర్గం ఎలా దోపిడీకి గురైం దో వెలు గెత్తి చాటుతున్నారు. బావ మరుదులు నాటకాలు ఆడుతూ ప్రజలను మోసగిస్తున్నారని ప్రచారంలో దూసుకుపోతున్నారు. దీంతో తటస్థ ఓటరు ఇరు పార్టీలపై అసంతృప్తితో ఉన్న వారు ఈయన ప్రచారాన్ని మొగ్గు చూపుతున్నారు. అయితే ఈయన చెప్పుకోదగ్గ ఓట్లు సాధించ గలరేమోగాని విజయం బావమరుదుల మధ్య ఊగిసలాడుతుందని రాజకీయ విశ్లే షకులు భావిస్తున్నారు. ఇంకా ప్రచారానికి 40 రోజులు పాటు సమయం ఉండటంతో రాజ కీయ వాతావరణం వేడెక్కి మార్పులకు గురవు తుందని కూడా చెబుతున్నారు. మున్ముందు ఎటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి మరి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img