Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Tuesday, October 1, 2024
Tuesday, October 1, 2024

పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన
ఏపీ మున్సిపల్ కార్మికుల యూనియన్ అధ్యక్షులు, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు ఎస్ రంగరాజు
విశాలాంధ్ర – విజయనగరం అర్బన్ : విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, పర్మినెంట్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయం వద్ద ఏపీ మున్సిపల్ కార్మికుల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జలగడుగుల కామేష్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు ఎస్ రంగరాజు మీడియాతో మాట్లాడుతూ పర్మినెంట్ కార్మికులకు మూడు సంవత్సరాల సరెండర్ లీవ్ సొమ్మును తక్షణమే విడుదల చేయాలని, అవుట్ట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులకు పెండింగ్‌లో ఉన్న 2 హెల్త్ అలవెన్స్ లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే చనిపోయిన కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికుల స్థానంలో వారి పిల్లలకు ఉద్యోగ భద్రత కల్పించి ఆదుకోవాలన్నారు, పారిశుద్ధ్య కార్మికులు పదవీ విరమణ పొందితే రూ.75 వేలు, చనిపోయిన వారికి రూ.2 లక్షలు ఎక్స్ గ్రేషియాను ప్రభుత్వం ప్రకటించినందున ఆయా కార్మికులకు వెంటనే అందే విధంగా చూడాలని కోరారు. విజయనగరం నగరపాలక సంస్థలో పనిచేస్తున్న 11 మంది నూపర్వైజర్లకు జీవో అమలు చేసినప్పటి నుండి వారికి రూ.18,500 జీతాన్ని మంజూరు చేస్తూ ఏరియర్ కూడా ఇవ్వాలన్నారు. ప్రతి సచివాలయంలో 15 మంది కార్మికులు పనిచేసే విధంగా ఉండాలని, అయితే నాలుగు నుండి ఆరుగురు కార్మికుల వరకే ఉన్నారని, కార్మికులపై చాలా పని భారం పెరుగుతున్నందున కార్మికుల సంఖ్యను పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాము ఈ డిమాండ్లతో కూడిన సమ్మె నోటీసును సోమవారం ఎంహెచ్ఓకు అందజేశామన్నారు. ఈనెల 10 తేదీలోగా ఈ డిమాండ్లన్నింటిని పరిష్కరించాలని, లేని ఎడల సమ్మెలోకి వెళ్తామని, తరువాత జరిగే పరిణామాలకు అధికారులే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆఫీస్ బేరర్ పొడుగు రామకృష్ణ K. శ్రీనివాసరావు జిల్లా కార్యదర్శి T. శ్రీనివాసరావు ఉపాధ్యక్షులు D. శ్రీను , కార్మికులు బి శంకర్, బి రాము, డి మజ్జిరాజు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img