Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

ఆస్పరి తాసిల్దార్ గా బి.ఈరమ్మ బాధ్యతల స్వీకరణ

బాధ్యతలు స్వీకరించిన తాసిల్దార్ ఈరమ్మ

విశాలాంధ్ర – ఆస్పరి (కర్నూలు జిల్లా) : ఆస్పరి మండల నూతన త‌హ‌సీల్దార్ గా బి.ఈరమ్మ సోమవారం బాధ్యతలు స్వీక‌రించారు. ఈమె అనంతపురం జిల్లా, ఉరవకొండ నియోజకవర్గం, విడపనకల్లు మండలం తాసిల్దార్ గా విధులు నిర్వహిస్తూ బదిలీపై ఆస్పరి కి వచ్చారు. గతంలో ఆస్పరి లో పనిచేసిన త‌హ‌సీల్దార్ కె.కుమారస్వామి అనంతపురం జిల్లాకు బదిలీపై వెళ్లారు. నూతనంగా బదిలీపై వచ్చిన త‌హ‌సీల్దార్ బి. ఈరమ్మ ను డిప్యూటీ త‌హ‌సీల్దార్ గాయిత్రి, రెవిన్యూ సిబ్బంది పూల బొకే ఇచ్చి స్వాగతం ప‌లికి శాలువా పూలమాలతో సత్కరించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటు రెవెన్యూ పరమైన సమస్యలు పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img