Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

రాజకీయ లబ్ధికే యూసీసీ

. విపక్షాల ఐక్యతతో ఎన్‌డీఏకు దడ
. ఎన్నికల వేళ బీజేపీ కుట్రలు, కుయుక్తులు
. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శ

విశాలాంధ్ర – హైదరాబాద్‌: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉమ్మడి పౌరస్మృతి వివాదాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తెరపైకి తీసుకువచ్చారని, మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయంగా లబ్ధి పొందేందుకు కుట్ర చేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ విమర్శించారు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ), జీఎస్‌టీని తీవ్రంగా వ్యతిరేకించిన మోదీ…ప్రధాని పదవి చేపట్టిన తర్వాత ఆ రెండిరటినీ భుజాలకెత్తుకున్నారని ఆగ్రహం వెలిబుచ్చారు. హైదరాబాద్‌ హిమాయత్‌నగర్‌లో గల మగ్దూంభవన్‌లో సీపీిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, కార్యదర్శి వర్గసభ్యులు ఎన్‌.బాలమల్లేశ్‌, ఈటీ నరసింహతో కలిసి నారాయణ శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావడం, దేశవ్యాప్తంగా మోదీ సర్కారు ప్రతిష్ఠ దిగజారడంతో ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో గెలవాలని ఉమ్మడి పౌరస్మృతి అంశాన్ని ప్రధాని మోదీ తెరపైకి తెచ్చారని నారాయణ విమర్శించారు. ఒక దేశంలో రెండు చట్టాలు ఏమిటంటూ మోదీ సర్కారు వితండవాదం చేస్తోందని, దేశ ఆవిర్భావ చరిత్ర కాషాయదళానికి ఎలా తెలుస్తుందని ఎద్దేవా చేశారు. కులాలు, మతాలు, ప్రాంతాలకతీతంగా ప్రజలంతా దేశ స్వాతంత్య్రం కోసం ఐక్యంగా పోరాటం చేశారని నారాయణ గుర్తుచేశారు. బ్రిటీషు పాలకులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో బీజేపీ పాత్ర లేదన్నారు. స్వాతంత్య్రం అనంతరం అన్ని మతాలు, కులాలు, సంస్కృతులు, సంప్రదాయలకు అనుగుణంగా రాజ్యాంగం రాసుకున్నామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కుయుక్తులు, పార్లమెంట్‌ ఎన్నికలప్పుడు కుట్రలు చేయడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ పాకులాడుతోందని వ్యాఖ్యానించారు. ఇలాంటి కుట్రలు, కుతంత్రాలను కర్నాటక ప్రజలు తిప్పికొట్టారని గుర్తుచేశారు. దేశం సర్వనాశనమైనా ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తామని బీజేపీ నాయకులు ప్రగల్భాలు పలుకుతున్నారని, మతాల మధ్య విద్వేషం నింపుతున్నారని నారాయణ మండిపడ్డారు. మణిపూర్‌ అల్లర్లకు మోదీనే బాధ్యుడన్నారు. మణిపూర్‌లో మారణహోమం జరుగుతున్నా మోదీ పట్టించుకోవడం లేదన్నారు. మణిపూర్‌లోని అటవీ సంపదను కార్పొరేట్‌ శక్తులకు కట్టబెట్టేందుకు మోదీ సర్కార్‌ పన్నిన కుట్ర కారణంగానే హింస కొనసాగుతోందని విమర్శించారు. ఉమ్మడి పౌరస్మృతికి వ్యతిరేకంగా ప్రజలంతా ఐక్యంగా పోరాడాలని నారాయణ పిలుపునిచ్చారు. మణిపూర్‌ పర్యటనకు వెళ్లిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీని రెచ్చగొట్టేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నించారన్నారు. బీహార్‌ వేదికగా ఏకతాటిపైకి వచ్చిన విపక్షాలను విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నదన్నారు. గవర్నర్‌ వ్యవస్థ కేంద్రానికి తొత్తుగా మారిందని విమర్శించారు. రాష్ట్రమంత్రి బాలాజీని తమిళనాడు గవర్నర్‌ రవి బర్తరఫ్‌ చేయడమేమిటని ప్రశ్నించారు. దిల్లీలో తన పెత్తనాన్ని నిలుపుకునేందుకు మోదీ సర్కారు తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తామని నారాయణ స్పష్టంచేశారు. ఈ నెల 14 నుంచి 17వ తేదీ వరకు దిల్లీలో సీపీఐ జాతీయ సమితి సమావేశాలు జరగనున్నట్లు ఆయన తెలిపారు. సీపీఐ, సీపీఐ(ఎం) కూటమిగా ఉన్నాయని, రాష్ట్ర ఎన్నికల్లో, దేశ వ్యాప్తంగా ఉమ్మడిగానే పోటీ చేస్తామన్నారు.
శ్రీలంకకు నారాయణ: శ్రీలంక కమ్యూనిస్టు పార్టీ 80వ మహాసభలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయని, సీపీఐ తరపున తాను సభలకు హాజరువుతున్నట్లు నారాయణ చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img