Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

20 నుంచి పార్లమెంటు

. కీలక బిల్లులపై కేంద్రం కసరత్తు
. సహకరించాలని మంత్రి జోషి విజ్ఞప్తి

న్యూదిల్లీ: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జులై 20 నుంచి ఆగస్టు 11 వరకు కొనసాగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి వెల్లడిరచారు. ఈసారి సమావేశాలు తొలుత పాత భవనంలో ప్రారంభమై… మధ్యలో కొత్త భవనంలోకి మారతాయని ఇటీవల అధికార వర్గాలు వెల్లడిరచాయి. అయితే ఈ విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఫలవంతమైన చర్చలకు సహకరించాల్సిందిగా ప్రతిపక్షాలకు జోషి విజ్ఞప్తి చేశారు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోదీ సర్కారును గద్దె దించడానికి విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చిన వేళ…పార్లమెంటు సమావేశాలు మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తోంది. ఉమ్మడి పౌరస్మృతి అంశాన్ని ప్రధాని మోదీ తెరపైకి తీసుకొచ్చిన వేళ పార్లమెంటు సమావేశం అవుతుంది. దీనిపై మోదీ సర్కారు ఇప్పటికే కసరత్తు చేపట్టింది. పార్లమెంటు సమావేశాలు మొత్తం 23 రోజులు, 17 సిట్టింగ్‌లో జరుగుతాయని జోషి ట్వీట్‌ చేశారు. ఈ సమావేశాల్లోనే కీలక బిల్లులు ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోంది. ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ఈసారి ఆ జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే చాలా మంది పార్లమెంటు సభ్యుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. యూసీసీని కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తుండగా… మరికొన్ని పార్టీలు మద్దతు ఇచ్చే యోచనలో ఉన్నాయి. దీంతోపాటు దిల్లీ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసుల విషయంలో తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌పై బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ ఆర్డినెన్స్‌పై కేంద్రం, ఆప్‌ ప్రభుత్వం మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆప్‌ ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇవే చివరి వర్షాకాల సమావేశాలు. ఆ ఎన్నికల్లో బీజేపీని గద్దె దింపే లక్ష్యంతో విపక్ష పార్టీలన్నీ కలిసికట్టుగా పోరాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ సమయంలో వివిధ అంశాల్లో అధికారపక్షం బీజేపీని విపక్షాలు గట్టిగానే ప్రశ్నించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. మణిపూర్‌ ఘర్షణలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img