Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

‘చెత్త’ భారం

. ఆలస్యంగా బిల్లుల జారీ
. ఏడునెలలకోసారి బాదుడు
. ఒకేసారి రూ.వందల్లో పన్నులు
. రూ.750 కోట్ల వసూలు లక్ష్యం


విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: చెత్తపై పన్ను విధించడం ద్వారా వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై మోయలేని భారాన్నే మోపింది. దీనిపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. అయితే నెలనెలా చెత్త బిల్లు కట్టడమే కష్టంగా ఉందనుకుంటుంటే… ప్రభుత్వ అసమర్థత వల్ల ప్రజలపై మరింత భారం పడుతోంది. ప్రతినెలా చెత్త పన్నుల వసూళ్లల్లో జాప్యం జరుగుతోంది. ఏడు నెలలకోసారి బిల్లులిచ్చి, వాటిని ముక్కుపిండి మరీ వసూలు చేయి స్తోంది. ఈ విధానాలతో సామాన్యుడిపై ఆర్థిక భారం పడుతోంది. ఎవరికీ చెప్పుకోలేని దుస్థితిలో ప్రజలున్నారు. వాస్తవంగా ప్రభుత్వం చెత్తపన్ను వేయడమే పెద్ద తప్పు. అదీ కేటగిరీల వారీగా వేయడంతో మురికివాడల ప్రజలకు పన్నుల్లో కాస్త వెసులుబాటు కలిగింది. ప్రతినెలా రూ.30 చెత్త పన్నుగా విధించారు. ఇప్పుడు ఏకంగా ఏడ్నెళ్ల కోసారి రూ.210 బిల్లు ఇచ్చి కట్టాలంటూ వలంటీర్ల ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా ఒత్తిడి చేయడంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. రోజు వారీ కూలి పనులు చేసుకుని, అద్దె ఇళ్లల్లో నివసించే వారికి ఇది పెద్ద భారంగా మారింది. జూన్‌ 2022 నుంచి డిసెంబరు 2022కు సంబంధిం చిన చెత్త బిల్లులను విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ద్వారా సచివాలయాలకు జారీజేస్తున్నారు. అక్కడి నుంచి వలంటీర్లు ఈ బిల్లుల వసూళ్లల్లో నిమగ్నమయ్యారు. ప్రతిరోజూ చెత్త బిల్లులు కట్టాలంటూ వలంటీర్లు తమ పరిధిలోని వాట్సాప్‌ గ్రూపుల్లో మెసేజ్‌లు పెడుతున్నారు. ఏడు నెలలకోసారి ఈ బిల్లులను పంపడం వల్ల సామాన్యులంతా ఆర్థిక అవస్థలు పడుతున్నారు.
ప్రజల నుంచి తీవ్ర నిరసన
రాష్ట్ర ప్రభుత్వం చెత్త పన్నులను ప్రవేశపెట్టడంతో ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. చెత్త పన్నులు రద్దు చేయాలంటూ వామపక్ష, ప్రజా సంఘాలు పెద్దఎత్తున ఉద్యమించాయి. ఎక్కడికక్కడ మున్సిపల్‌ కార్యాలయాలు, వార్డు సచివాలయాల ఎదుట నిరసనలు తెలిపినా ప్రభుత్వం దిగిరాలేదు. విలువ ఆధారిత ఆస్తి పన్నుకు ముందస్తుగా, జగన్‌ ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ఈ చెత్తపన్నును ప్రవేశపెట్టింది. ఇప్ప టికే ఆర్టీసీ చార్జీలు, నిత్యవసరాల ధరలు క్రమేపీ పెరిగి పోతున్నాయి. విద్యుత్‌ చార్జీలు ప్రజలకు షాక్‌ కొడుతు న్నాయి. టమోటా లాంటి నిత్యావసరాల ధరలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రించలేక పోతు న్నాయి. వాటికి తోడుగా మధ్యలో చెత్తపన్ను వేయడం ప్రజలకు మరింత భారంగా మారింది. పట్టణ, నగర ప్రాంతాల్లోని అభివృద్ధి పనుల కోసం ప్రజలపైనే కొత్త పన్నుల భారం వేయాలనే ఆలోచనకు జగన్‌ సర్కారు శ్రీకారం చుట్టిన విషయం విదితమే. ప్రజలు తమ ఇళ్ల నుంచి బయట పారేసే వ్యర్థాలపై పన్ను విధించడం ద్వారా తీవ్ర విమర్శలపాలైంది. దానికితోడు ఆస్తి పన్నునూ విలువ ఆధారంగా లెక్కించి దండిగా పన్నులు వడ్డించాలని ప్రభుత్వం సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా కేటగిరీల వారీగా చెత్త పన్నును నిర్ణయించడంపై ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం వసూలు చేస్తున్నవన్నీ గతేడాదికి సంబంధించిన చెత్త పన్నుల బిల్లులే. అంటే గతేడాది చెత్త పన్నుల వసూలులో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ యంత్రాంగం తీవ్రంగా విఫలమైందనే విమర్శలున్నాయి. ఈ బిల్లుల వసూలు బాధ్యతల్ని వార్డు సచివాలయ వ్యవస్థకు అప్పజెప్పినా… ఆశించిన ఫలితాలు రాలేదు. ప్రజల నుంచి స్పందన లేదు. జనవరి 2023 నుంచి జులై 2023 వరకు ఇంకా బిల్లులు రాలేదు. గతేడాది జూన్‌ నుంచి డిసెంబరు వరకు గల బిల్లులను ఏక మొత్తంగా వసూళ్లు చేయడంతో ప్రజలకు భారంగా మారింది. క్రమంగా ప్రతినెలా బిల్లులిచ్చి వసూలు చేస్తే, వారిపై అంత భారం ఉండేది కాదు. ఒకేసారి బిల్లులు జారీ చేయడాన్ని తప్పుబడుతున్నారు. ఈ చెత్త పన్నుల ద్వారా ప్రభుత్వా నికి రూ.750 కోట్లు వసూలు కానున్నాయి. అయితే చెత్త పన్నుల్ని వసూలు చేస్తున్నప్పటికీ పట్టణాలు, నగరాల అభివృద్ధి అరకొరగానే విమర్శలున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చెత్త పన్నుల వసూళ్లను నిలిపివేయాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img