Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

సహకార ఫెడరలిజానికి సమాధి…

. ఎన్నికైన ప్రభుత్వాల హక్కు హరణే ఉద్దేశం
. దిల్లీ బిల్లుపై ప్రతిపక్షాల ఆరోపణలు
. లోక్‌సభలో ప్రతిపాదన
. విపక్షాల అభ్యంతరాలు రాజకీయ ప్రేరేపితం: అమిత్‌షా

న్యూదిల్లీ : సహకార ఫెడరలిజాన్ని సమాధి చేసేందుకే దిల్లీ బిల్లును కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిందని ప్రతిపక్షాలు దుయ్యబట్టాయి. ఎన్నికైన ప్రభుత్వాల హక్కులను హరించడమే కాకుండా కేంద్రానికి సర్వాధికారాలు కట్టబెట్టడమే దీని ఉద్దేశమన్నాయి. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా జీఎన్‌సీటీడీ (సవరణ) బిల్లును రూపొందించారని, దానిని ఆమోదించే చట్టబద్ధ అర్హత సభకు లేదని, అందుకే తిరస్కరిస్తున్నామని ప్రతిపక్షాలు తేల్చిచెప్పాయి.
దిల్లీలో అధికారుల నియామకాయాధికారాల కోసం తెచ్చిన ఆర్డినెన్స్‌ స్థానంలో జీఎన్‌సీటీడీ (సవరణ) బిల్లును మంగళవారం లోక్‌సభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రవేశపెట్టారు. ప్రతిపక్ష సభ్యుల నినాదాలు, ఆందోళన నడమ వివాదాస్పద బిల్లును సభ ముందు ఉంచారు. దిల్లీలో సేవలపై కేంద్రానికి అధికారాలు కట్టబెట్టే ఆర్డినెన్స్‌ స్థానె గవర్నమెంట్‌ ఆఫ్‌ నేషనల్‌ కేపిటల్‌ టెరిటరీ ఆఫ్‌ దిల్లీ (అమెండ్‌మెంట్‌) బిల్‌, 2023ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. బిల్లును ప్రవేశపెట్టినప్పుడు సభలో గందరగోళం నెలకొంది. అమిత్‌షా మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీల అభ్యంతరాలు రాజకీయ ప్రేరేపితమేగానీ రాజ్యాంగాధారితం కాబోవని వ్యాఖ్యానించారు. దిల్లీకి సంబంధించి ఎలాంటి చట్టాన్నైనా తెచ్చే అధికారం పార్లమెంటుకు రాజ్యాంగం ఇచ్చిందని చెప్పారు. ఈ బిల్లును జులై 25న కేంద్ర కేబినెట్‌ ఆమోదించింది. దిల్లీ బిల్లును ప్రవేశపెట్టడంపై ప్రతిపక్ష సభ్యులు తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. కొన్ని పత్రాలు చించి స్పీకర్‌ వైపునకు కొందరు విసిరారు. బిల్లుపై అమిత్‌షా మాట్లాడటం ప్రారంభించినప్పుడు ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ సుశీల్‌ కుమార్‌ రింకు వెల్‌లోకి కెళ్లి నిరసన తెలిపారు. తనను మాట్లాడనివ్వలేదన్నారు. ఈ పద్ధతి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని, బీఆర్‌ అంబేద్కర్‌ను అవమానిస్తోందని దుయ్యబట్టారు. రింకుతో పాటు కాంగ్రెస్‌ నేత టీఎన్‌ ప్రతాపన్‌ కొన్ని కాగిలాలను చించి సభాపతి వైపునకు విసిరారు. సభలో గందరగోళం నెలకొనగా స్పీకర్‌ ఓంబిర్లా స్పందిస్తూ ‘దేశం చూస్తోంది. ఈ పద్ధతి మంచిది కాదు’ అని సభ్యులతో అన్నారు. లోక్‌సభలో కాంగ్రెస్‌నేత అధిర్‌ రంజన్‌ చౌదరి మాట్లాడుతూ సహకార ఫెడరలిజాన్ని సమాధి చేసే విధంగా ఈ బిల్లు రూపొందిందని వ్యాఖ్యానించారు. ఎన్నికైన దిల్లీ ప్రభుత్వ హక్కులను హరించేదిగా ఉందన్నారు. దీనిని అడ్డుపెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చాలని కేంద్రం భావిస్తోందని విమర్శించారు. ఆర్‌ఎస్‌పీ నేత ఎన్‌కే ప్రేమ్‌చంద్రన్‌ మాట్లాడుతూ ఈ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఇందుకు మూడు ప్రధాన కారణాలు ఉన్నాయన్నారు. ‘బిల్లును ప్రవేశపెట్టేందుకు చట్టబద్ధ అర్హతను ప్రశ్నిస్తున్నా. రాజ్యాంగం సూచించే ఫెడరిజం సూత్రాలకు ఇది విరుద్ధం. బ్యూరోక్రాట్లపై దిల్లీలో ఎన్నికైన ప్రభుత్వానికి అధికారం ఉండకపోవడమంటే అసలు దిల్లీలో ప్రభుత్వం లేనట్టే అవుతుంది’ అని అన్నారు. ప్రేమ్‌చంద్రన్‌ వ్యాఖ్యలపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహాద్‌ జోషి స్పందిస్తూ బిల్లును ఆమోదించే అర్హత పార్లమెంటుకు ఉందని చెప్పారు. బిల్లు ప్రయోజనాలపై మాట్లాడాలని భావిస్తే దాని పరిశీలన, ఆమోదం సమయంలో నిర్వహించే చర్చలో మాట్లాడాలని సూచించారు. ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ కూడా అభ్యంతరం తెలిపారు. ఓ బిల్లును తెచ్చి రాజ్యాంగాన్ని మార్చేయలేరన్నారు. వేర్వేరు అధికారాల సిద్ధాంతాన్ని అతిక్ర మించేలా, 2018లో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం ధర్మాసనం తీర్పునకు విరుద్ధంగా బిల్లు ఉందని అన్నారు. ఈ బిల్లుకు అవసరమైన చట్టబద్ధ అర్హత సభకు లేనందునే దానిని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. లోక్‌సభలో ఈ బిల్లును ఆమోదించగలరేమో రాజ్యసభలో దానిని అడ్డుకునేందుకు అవసరమైన సంఖ్యాబలం ప్రతిపక్షాలకు ఉందని ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ అన్నారు. రాజ్యాం గాన్ని, సుప్రీంకోర్టు తీర్పుకు, భారత ఫెడరల్‌ వ్యవస్థకు విరుద్ధంగా దిల్లీ బిల్లు ఉందన్నారు. టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్‌ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పును తోసిపుచ్చే విధంగా తాజా బిల్లు ఉందని, దిల్లీ ప్రభుత్వ శాసనాధికారాలను రద్దు చేసేదిగా రూపొందిందన్నారు. ఆప్‌ ఎంసీ రాఘవ్‌ చడ్డా మాట్లాడుతూ ఆర్డినెన్స్‌ కంటే ఘోరంగా బిల్లు ఉందని, ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి, దిల్లీ ప్రజలకు పూర్తి విరుద్ధమైన విధంగా రూపొందిందని అన్నారు.ఇది అజ్రాస్వామిక బిల్లు అని, ఎన్నికైన దిల్లీ ప్రభుత్వ హక్కులను హరించి ‘బాబు’లకు కట్టబెడుతుందని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం స్థానంలో ‘బాబూ’స్వామ్యాన్ని తెస్తుందని విమర్శించారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ కూబా బిల్లును తిరస్కరించారు. దిల్లీ ఎన్‌సీటీని తక్కువ చేసేదిగా ప్రజాస్వామ్య ప్రాతినిధ్య సిద్ధాంతాలను తుంగలో తొక్కేదిగా ఉన్నట్లు వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే, దిల్లీ బిల్లుకు బీజేడీ, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ తమ మద్దతును ప్రకటించాయి. ఇండియా కూటమిలోని ప్రతిపక్ష పార్టీల ఎంపీలు 109 మందితో పాటు కపిల్‌ సిబల్‌ వంటి స్వతంత్రులు ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తారని ఓ సీనియర్‌ నాయకుడు చెప్పారు.
కొన్ని మార్పులుచేర్పులు దిల్లీ ఆర్డినెన్స్‌ స్థానె తెచ్చిన బిల్లులో కొన్ని మార్పులుచేర్పులు జరిగాయి. ఆర్డినెన్స్‌లోని అన్ని ప్రధాన నిబంధనలు ఉన్నాగానీ కొన్ని సవరణలు ఉన్నాయి. ‘సేవలు’పై ఏదేని చట్టాన్ని తెచ్చే విధంగా రాష్ట్ర అసెంబ్లీని కట్టడి చేసేలా ఆర్డినెన్స్‌లోని నియమాలు తాజా బిల్లులో లేదు. ఆలిండియా సర్వీసెస్‌, డానిక్స్‌కు చెందిన అధికారుల నియామకాలపై దిల్లీ ప్రభుత్వం మీద పెత్తనానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారాన్ని ఈ బిల్లు కట్టబెడుతుంది. కేంద్రప్రభుత్వానికి వార్షిక నివేదికను దిల్లీ ప్రభుత్వం ఇవ్వాలన్న నిబంధనతో పాటు కేంద్రానికి సిఫార్సు చేసే ప్రతిపాదలపై మంత్రిత్వశాఖ సూచనలు/ఆదేశాలను లెఫ్టినెంట్‌ గవర్నర్‌, దిల్లీ సీఎంకు సమర్పించాలన్న నియమాన్ని తొలగించారు. ఎల్‌జీ నియామకానికి సంబంధించిన ప్యానల్‌కు అర్హులైన వారిని సిఫార్సు చేసే అధికారాన్ని ఎన్‌సీటీ ప్రభుత్వానికిస్తూ బిల్లులోని సెక్షన్‌ 45ఇలో సబ్‌ సెక్షన్‌ (బి)ను జోడిరచారు. ఇలాంటి అధికారులను రాష్ట్రపతి లేదా కేంద్రానికి కట్టబెట్టేలా తొలుత రూపొందిన ఆర్డినెన్స్‌ ఉంది. దిల్లీ ప్రభుత్వంలో సీనియర్‌ అధికారుల నియామకాలు, బదిలీలను దిల్లీ ముఖ్యమంత్రి నేతృత్వ త్రిసభ్య కమిటీ చేపట్టేలా బిల్లు పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img