Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

దసరా నాటికి విశాఖ నుంచి పాలన!

సీఎం జగన్‌ బసకు చాపకింద నీరులా ఏర్పాట్లు?

విశాలాంధ్రబ్యూరో-విశాఖపట్నం: ఈ మధ్యకాలంలో మూడు రాజధానుల మాట మరుగున పడినప్పటికీ… విశాఖ నుంచి పాలన సాగించే అంశంపై మళ్లీ ఊహాగానాలు జోరందుకున్నాయి. సెప్టెంబరు నుంచే విశాఖకు కాపురం మారుస్తానంటూ సీఎం జగన్‌ గతంలో ప్రకటన చేయగా, తాజాగా వైసీపీ నేతలు దసరా (అక్టోబరు 24)నాటికి విశాఖకు సీఎం జగన్‌ వచ్చేస్తారంటున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విశాఖపట్నం నుంచి పాలన సాగించేందుకు చాప కింద నీరులా ఏర్పాట్లు సాగుతున్నాయి. విశాఖలో సీఎం కార్యాలయం, నివాసాలకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను తాజాగా పోలీసు ఇంటిలిజెన్స్‌ విభాగం సమీక్షించినట్టు తెలుస్తోంది. రుషికొండలో పర్యాటక శాఖ కొత్తగా నిర్మించిన భవనాల్లో ముఖ్యమంత్రి కార్యాలయం, అక్కడికి సమీపంలోనే విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు చెందిన మరో భవనంలో సీఎం నివాసముండేందుకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్తి కావొచ్చినట్టు సమాచారం. అయితే ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయం ఎదురుగా ఉన్న బే పార్కులో నివాసం ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా ఉండేలా ఈ ఏర్పాట్లు ఉండనున్నాయి. దీంతో ముఖ్యమంత్రి రాకపోకలకు బీచ్‌ రోడ్‌ లో వాహనదారులకు ఎటువంటి ట్రాఫిక్‌ కు ఇబ్బందులు లేకుండా ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
కేవలం విమానాశ్రయానికి వెళ్లడానికి మాత్రమే ట్రాఫిక్‌ ఆపాల్సి ఉంటుంది. మిగతా ఏ సమయంలో ట్రాఫిక్‌ అంతరాయం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఇక ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు బస చేసేందుకు నగరంలోని ఖరీదైన ప్రాంతం సీతమ్మధారను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రికి నివాస ప్రాంతానికి దగ్గరలో గల ఎండాడ ప్రాంతంలో అధికారుల నివాసం ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఆలోచనలో కూడా ఉన్నారు. మరోపక్క ముఖ్యమంత్రి జగన్‌ వారంలో మూడు రోజులు విశాఖలో, మూడు రోజులు అమరావతిలో ఉంటారని మరో ప్రచారం సాగుతోంది. ఇక శాఖల వారీగా కార్యాలయాల ఏర్పాటుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీఎంఆర్డీఏ, జీవీఎంసీ భవనాలను ఎంపిక చేయడంలో తలమునకలై ఉన్నట్లు తెలుస్తోంది.
కాజేసిన భూముల ధరల పెంపుకోసమే…
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి విశాఖపట్నంపై, ఉత్తరాంధ్రపై ఏమాత్రం ప్రేమ లేదని, ఈ ప్రాంతంలోని విలువైన భూముల్ని తమ అనుచరులకు కట్టబెట్టడానికే విశాఖ వస్తున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే విశాఖలో విలువైన భూములు అనేకమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, వారి అనుచరుల చేతుల్లోకి వెళ్లి పోయాయని, అసైన్డ్‌ భూములను కూడా తక్కువ ధరకు కాజేశారని… ఇప్పుడు రాజధాని పేరిట వాటిని అధిక ధరలకు అమ్ముకొని సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img